త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Varun Chakravarthy | టీ క‌ప్పు, ప్ర‌పంచ క‌ప్ ట్రోఫీతో వ‌రుణ్ ఫొటో.. పాక్‌కు గ‌ట్టి కౌంట‌ర్‌..

Varun Chakravarthy | భారత్ టీ20 ప్రపంచకప్ 2026 ట్రోఫీని అహ్మదాబాద్‌లో ఆదివారం గెలుచుకున్న అనంతరం భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి పాకిస్తాన్‌పై సరదాగా వ్యంగ్యాస్త్రం సంధించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది.

S

Cricket | Published On Mar 9, 2026, 2.53 pm IST

Varun Chakravarthy | టీ క‌ప్పు, ప్ర‌పంచ క‌ప్ ట్రోఫీతో వ‌రుణ్ ఫొటో.. పాక్‌కు గ‌ట్టి కౌంట‌ర్‌..
Advertisement

Varun Chakravarthy | భారత్ టీ20 ప్రపంచకప్ 2026 ట్రోఫీని అహ్మదాబాద్‌లో ఆదివారం గెలుచుకున్న అనంతరం భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి పాకిస్తాన్‌పై సరదాగా వ్యంగ్యాస్త్రం సంధించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అర్ధశతకాలతో జట్టుకు బలమైన స్కోర్ అందించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ భారత బౌలర్ల కట్టుదిట్టమైన దాడిని ఎదుర్కోలేక 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత్ టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకోవడమే కాకుండా, మూడు సార్లు ఈ ట్రోఫీని గెలిచిన తొలి జట్టుగా కూడా నిలిచింది.

టీ క‌ప్పు, ట్రోఫీ..

విజయం అనంతరం వరుణ్ చక్రవర్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సరదా ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో అతను ట్రోఫీని చేత్తో ప‌ట్టుకుని ఒక కప్పుతో టీ తాగుతూ కనిపించాడు. కాగా వ‌రుణ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఆ ఫోటోపై సరదా కామెంట్లతో స్పందించారు. భారత్ ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత కూడా వరుణ్ చక్రవర్తి ఇలాంటి ఫోటోనే పోస్ట్ చేశాడు. ఆ టోర్నమెంట్ సమయంలో భారత ఆటగాళ్లు పీసీబీ చీఫ్, ఆసియా కప్ కౌన్సిల్ చైర్మన్ మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించారు. అందువల్ల వారు ట్రోఫీ లేకుండానే తిరిగి వచ్చారు. తరువాతి రోజు వరుణ్ చక్రవర్తి తన బెడ్‌పై పడుకుని పక్కన టీ కప్పు పెట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ టీ కప్పును ఆసియా కప్ ట్రోఫీకి సరదాగా ప్రతీకగా చూపించాడు.

https://twitter.com/KKRWeRule/status/2030854475595055458

గ‌తంలో ఏమ‌న్నాడంటే..

తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వరుణ్ చక్రవర్తి ఆ ఫోటో వెనుక కథను వివరించాడు. మొదట ట్రోఫీని తన బెడ్‌ పక్కన పెట్టుకుని సెలబ్రేషన్ ఫోటో తీయాలని ప్లాన్ చేశానని చెప్పాడు. కానీ ట్రోఫీ అందుబాటులో లేకపోవడంతో కప్పును ఉపయోగించి అదే భావాన్ని చూపించానని వెల్లడించాడు. మేం గెలుస్తామనే నమ్మకం నాకు ముందే ఉంది. రెండో మ్యాచ్ తర్వాతే ఫైనల్లో వారిని ఎదుర్కొంటే మేమే గెలుస్తామని నిశ్చయించుకున్నాను. అందుకే ట్రోఫీని నా పక్కన పెట్టుకుని పడుకుని ఫోటో తీయాలని ముందే ప్లాన్ చేశాను. కానీ మ్యాచ్ తర్వాత నా పక్కన ట్రోఫీ లేదు. కేవలం ఒక కాఫీ కప్పు మాత్రమే ఉంది. అందుకే అదే కప్పుతో ఫోటో తీశాను.. అని వ‌రుణ్ గ‌తంలో వివరించాడు.

కాగా టీ20 ప్రపంచకప్ 2026లో వరుణ్ చక్రవర్తి ప్రదర్శన మిశ్రమంగా నిలిచింది. మొత్తం టోర్నమెంట్‌లో 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచినా, అతను వేసిన 31 ఓవర్లలో మొత్తం 287 పరుగులు కూడా ఇచ్చాడు. అయితే ఈ ప్ర‌ద‌ర్శ‌న‌తో అత‌ని మిస్ట‌రీ వీడిపోయింద‌ని, ప్ర‌త్య‌ర్థి జ‌ట్లు అత‌ని బౌలింగ్‌లో సుల‌భంగా ఆడుతున్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రి వ‌రుణ్ ఇక‌పై ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తాడో చూడాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement