Usman Tariq | మళ్లీ వివాదాస్పదమవుతున్న పాక్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్.. కామెరాన్ గ్రీన్ ఏమన్నాడు..?
Usman Tariq | పాకిస్థాన్ క్రికెట్ జట్టు వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్.. ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
Usman Tariq | పాకిస్థాన్ క్రికెట్ జట్టు వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్.. ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. శనివారం (జనవరి 31, 2026) ఈ రెండు జట్ల మధ్య లాహోర్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఉస్మాన్ బౌలింగ్ లో గ్రీన్ ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో అతను డగౌట్ వద్దకు వెళ్లగానే ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్‌ను ఉద్దేశిస్తూ అతను చకింగ్ చేస్తూ బంతిని త్రో చేస్తున్నాడని సూచించే విధంగా గ్రీన్ తన సహచరులకు సైగ చేస్తూ అసహనంగా మైదానం వీడాడు. ఈ క్రమంలోనే పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ మరోమారు వివాదాస్పదంగా మారింది.
ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై..
పాక్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ కెప్టెన్, ఓపెనర్ మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ లు త్వరగా పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో గ్రీన్ దూకుడుగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే గ్రీన్ క్రీజులో నిలవడంతో ఆసీస్ అతనిపై ఆశలు పెట్టుకుంది. కానీ బౌలింగ్ ఛేంజ్‌తో బరిలోకి వచ్చిన స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ గ్రీన్‌ను ఔట్ చేశాడు. అయితే గ్రీన్ ఔట్ అయ్యాక మైదానం వీడే సమయంలో తీవ్ర అసహనంతో ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్‌ను అనుమానిస్తూ సైగలు చేశాడు. అతను పెవిలియన్ చేరుతూ చేసిన హావభావాలు తారిక్ బౌలింగ్ యాక్షన్ చకింగ్, త్రోయింగ్ మాదిరిగా ఉందని అనిపించాయి. అయితే తారిక్ బౌలింగ్ యాక్షన్ మొదట్నుంచీ చర్చనీయాంశంగానే మారింది.
Cameron Green publicly expressed concerns regarding the legality of Usman Tariq’s bowling action.
— Cricketopia (@CricketopiaCom) January 31, 2026
చేతిని వంచుతున్నాడా..?
ఉస్మాన్ తారిక్ బంతిని వదిలే ముందు డెలివరీ పాయింట్ వద్ద క్షణం ఆగి, దాదాపు పూర్తిగా నిలిచిన తర్వాత ఆఫ్బ్రేక్ను విడుదల చేయడం అతని ప్రత్యేకత. ఈ ప్రక్రియ వల్ల చేతిని వంచుతున్నట్టు బ్యాటర్లకు అనిపిస్తుందని విమర్శలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద అనుభవం లేకపోయినా, 2023లో ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన తారిక్ పలు టీ20 లీగ్‌లలో ఆడాడు. ఇప్పటివరకు అతడు టీ20 అంతర్జాతీయాల్లో 8 వికెట్లు సాధించి, 7.50 సగటు, 5.62 ఎకానమీతో ఆకట్టుకున్నాడు. అయితే గ్రీన్‌కు మాత్రం తాజా మ్యాచ్‌తో పెద్ద అనుమానం వచ్చింది. దీంతో అతను తారిక్‌ను ఉద్దేశించి చేసిన సైగల తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
కామెరాన్ గ్రీన్‌కు కౌంటర్..
అయితే కామెరాన్ గ్రీన్ సైగలు, చర్యలకు ఉస్మాన్ తారిక్ కూడా ఘాటుగానే స్పందించాడు. మ్యాచ్ అనంతరం అతను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆఫ్టర్ గెట్టింగ్ అవుట్ అనే క్యాప్షన్‌తో పోస్టు పెట్టాడు. దీంతో ఆ ఫొటో కూడా వైరల్‌గా మారింది. అయితే ఉస్మాన్ తారిక్పై ఇలా చకింగ్, త్రోయింగ్ ఆరోపణలు రావడం ఇదేం కొత్త కాదు. గతంలో అతను పలు లీగ్ మ్యాచ్ లలో ఆడినప్పుడు 2024, 2025 సీజన్లలో రెండు సార్లు వేర్వేరుగా ఆరోపణలను ఎదుర్కొన్నాడు. దీంతో పాకిస్థాన్ లోని లాహోర్‌లో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీలో తారిక్కు బయోమెకానికల్ పరీక్షలు నిర్వహించారు. ఈ రెండు సందర్భాల్లోనూ తారిక్ యాక్షన్ సరిగ్గానే ఉందని, అందులో ఎలాంటి చకింగ్ లేదా త్రోయింగ్ లేదని, అతని బౌలింగ్ చట్టబద్ధంగానే ఉందని తేల్చారు. దీంతో అతన్ని జాతీయ జట్టులోకి సైతం తీసుకున్నారు.
నా బౌలింగ్ కరెక్టే: ఉస్మాన్ తారిక్
అయితే తన మోచేతి వద్ద సహజంగానే కాస్త ఎక్కువ వంగుతుందని, దీన్ని పరీక్షల్లోనూ గుర్తించారని, అది తనకు అడ్వాంటేజ్‌గా మారిందని తారిక్ తెలిపాడు. కానీ అందరూ తన బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేదని ఆరోపిస్తున్నారని అతను గతంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ వెల్లడించాడు. అయితే త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీకి కూడా అతను ఎంపికయ్యాడు కనుక టోర్నీల్లో భారత్‌తో మ్యాచ్‌లో అతను ఆడతాడని తెలుస్తోంది. మరి భారత్ అతని బౌలింగ్‌ను అడ్డుకుంటుందా, లేక అతని బౌలింగ్ యాక్షన్‌పై ఏమైనా ఫిర్యాదు చేస్తుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






