త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC Test Rankings | ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. మూడో స్థానానికి భారత్

ICC Test Rankings | అంతర్జాతీయ క్రికెట్ మండలి శుక్రవారం విడుదల చేసిన తాజా టెస్టు జట్టు ర్యాంకింగ్స్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పుల నేపథ్యంలో భారత ఓ స్థానాన్ని మెరుగుప‌రుచుకొని మూడోస్థానానికి చేరుకుంది.

P

Sports | Published On May 1, 2026, 7.14 pm IST

ICC Test Rankings | ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. మూడో స్థానానికి భారత్
Advertisement

ICC Test Rankings | అంతర్జాతీయ క్రికెట్ మండలి శుక్రవారం విడుదల చేసిన తాజా టెస్టు జట్టు ర్యాంకింగ్స్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పుల నేపథ్యంలో భారత ఓ స్థానాన్ని మెరుగుప‌రుచుకొని మూడోస్థానానికి చేరుకుంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టింది. టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. గ‌తేడాది మే త‌ర్వాత టెస్టుల‌కు ప్రాధాన్యం ఇచ్చింది. అంత‌కు ముందు మ్యాచుల్లోనూ 50శాతం టెస్టుల‌కు కేటాయించ‌డంతో ర్యాంకింగ్స్‌లో గ‌ణ‌నీయంగా మార్పులు జ‌రిగాయి. ఆస్ట్రేలియా జట్టు 131 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్ దక్షిణాఫ్రికా 119 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

నాలుగో స్థానానికి ఇంగ్లండ్

తాజా ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు జ‌రిగాయి. భారత్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 104 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ 102 పాయింట్లతో నాలుగో స్థానానికి ప‌డిపోయింది. గతంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాపై స్వదేశంలో సాధించిన విజయాలు, పాకిస్థాన్‌లో సిరీస్ విజయం వంటి అవకాశాలను ఇంగ్లండ్ పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. పాకిస్థాన్ జట్టు శ్రీలంకను వెనక్కు నెట్టి ముందుకు వచ్చింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు టాప్-10లో తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. ఇదే సమయంలో ఐర్లాండ్ జట్టు టెస్టు మ్యాచ్‌లు ఆడకపోవడంతో ర్యాంకింగ్స్ నుంచి తొల‌గించారు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ స్థానం

2025–27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్‌లో భారత్ ప్రస్తుతం 48.15 శాతం పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాపై స్వదేశంలో సిరీస్ ఓటమి, ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోల్పోవడం జట్టుపై ప్రభావం చూపింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 87.50 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, న్యూజిలాండ్ 77.78 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ సంద‌ర్భంగా వుమెన్స్ జ‌ట్టు ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. మహిళల వన్డే ప్రపంచకప్ విజేత అయిన భారత జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్ రెండో స్థానంలో కొన‌సాగుతోంది.

Advertisement
Advertisement