Tilak Varma | టీమిండియాకు చేదు వార్త.. న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు తిలక్ వర్మ దూరం..
Tilak Varma | భారత టీ20 క్రికెట్ జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి మూడు టీ20లకు దూరమయ్యాడు. జనవరి 21వ తేదీ నుంచి భారత్ సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్‌ను ఆడనుండగా, ఈ సిరీస్‌కు తిలక్ వర్మను ఇప్పటికే సెలెక్టర్లు ఎంపిక చేశారు.
Tilak Varma | భారత టీ20 క్రికెట్ జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి మూడు టీ20లకు దూరమయ్యాడు. జనవరి 21వ తేదీ నుంచి భారత్ సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్‌ను ఆడనుండగా, ఈ సిరీస్‌కు తిలక్ వర్మను ఇప్పటికే సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే అనుకోని గాయం కారణంగా అతను తొలి మూడు టీ20లకు దూరమయ్యాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. తిలక్ వర్మ ప్రస్తుతం దేశవాళీ విజయ్ హజారే వన్డే ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం అతను రాజ్‌కోట్‌లో జమ్మూ కాశ్మీర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు.
సమస్య ఏంటంటే..?
వృషణాల్లో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న తిలక్ వర్మ జట్టుకు దూరం కాగా, అతనికి అక్కడి గోకుల్ హాస్పిటల్‌లో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. టెస్టిక్యులార్ టోర్షన్ (అకస్మాత్తుగా వృషణాల్లో వచ్చే నొప్పి)తో తిలక్ వర్మ బాధపడుతున్నాడని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో అతనికి శస్త్ర చికిత్స చేయగా అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. అయితే శస్త్ర చికిత్స కారణంగా తిలక్ వర్మ కోలుకునేందుకు కాస్త సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల అనంతరం మళ్లీ అతని వైద్య పరిస్థితిని సమీక్షించి అతను టీ20 సిరీస్‌లో ఆడే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ శస్త్ర చికిత్స కారణంగా తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి మూడు టీ20లకు మాత్రం అందుబాటులో ఉండడని, అతని పరిస్థితిపై ఆ తరువాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
తొలి మూడు మ్యాచ్‌లకు దూరం..
కాగా న్యూజిలాండ్‌తో భారత్ జనవరి 11వ తేదీన తొలి వన్డేను వడోదరలో ఆడనుండగా, 14న రెండో వన్డేను రాజ్ కోట్‌లో నిర్వహించనున్నారు. మూడోదైన చివరి వన్డే 18వ తేదీన ఇండోర్‌లో జరుగుతుంది. ఆ తరువాత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. తొలి టీ20 మ్యాచ్‌ను జనవరి 21న నాగ్‌పూర్ లో నిర్వహిస్తారు. అలాగే రెండో టీ20ని జనవరి 23న రాయ్‌పూర్‌లో, 3వ టీ20ని జనవరి 25న గువాహటిలో, 4వ టీ20ని 28వ తేదీన విశాఖపట్నంలో, 5వ టీ20 మ్యాచ్‌ను 31వ తేదీన తిరువనంతపురంలో నిర్వహిస్తారు. వన్డే మ్యాచ్ లు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుండగా, టీ20 మ్యాచ్‌లను రాత్రి 7 గంటలకు ప్రారంభిస్తారు. అయితే ఈ టీ20 సిరీస్‌కు గాను తిలక్ వర్మను ఇప్పటికే ఎంపిక చేశారు. కానీ శస్త్ర చికిత్స కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడం లేదు.
అభిమానుల్లో ఆందోళన..
ఇక ఈ సిరీస్‌లు ముగిసిన అనంతరం భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్ కప్ 2026ను నిర్వహిస్తారు. భారత్ తన తొలి లీగ్ మ్యాచ్‌ను ఫిబ్రవరి 7వ తేదీన ముంబైలోని వాంఖెడె స్టేడియంలో రాత్రి 7 గంటలకు యూఎస్ఏతో ఆడుతుంది. రెండో గ్రూప్ మ్యాచ్‌ను ఫిబ్రవరి 12వ తేదీన ఢిల్లీలో రాత్రి 7 గంటలకు నమీబియాతో ఆడనుంది. అలాగే మూడో గ్రూప్ మ్యాచ్ ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలో పాకిస్థాన్‌తో జరుగుతుంది. చివరి గ్రూప్ మ్యాచ్‌ను ఫిబ్రవరి 18వ తేదీన అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో ఆడనుంది. ఈ వరల్డ్ కప్ మార్చి 8వ తేదీన ముగియనుంది. అయితే టీ20 వరల్డ్ కప్‌కు కూడా తిలక్ వర్మను ఎంపిక చేశారు. ఈ క్రమంలో అతని ఆరోగ్యంపై అభిమానుల్లో ప్రస్తుతం ఆందోళన నెలకొంది.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

Sreeleela | నేనెప్పుడూ అతడిని కలవలేదు – డేటింగ్ రూమర్లపై శ్రీలీల క్లారిటీ
మే 18, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



