BCB | భారత్, న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అంపైర్.. బీసీబీ రియాక్షన్ ఇదే..!
BCB | భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య ప్రస్తుతం పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. ఐపీఎల్ 2026 ఎడిషన్ నుంచి కోల్‌కతా ప్లేయర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను ఆ ఫ్రాంచైజీ రిలీజ్ చేయడంతో ఈ వివాదం ప్రారంభం అయంది.
BCB | భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య ప్రస్తుతం పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. ఐపీఎల్ 2026 ఎడిషన్ నుంచి కోల్‌కతా ప్లేయర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను ఆ ఫ్రాంచైజీ రిలీజ్ చేయడంతో ఈ వివాదం ప్రారంభం అయంది. సెక్యూరిటీ కారణాలతో ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ నుంచి తొలగించడం అన్యాయమని, కేవలం ఒక్క ప్లేయర్‌కు సెక్యూరిటీ కల్పించకపోతే మొత్తం జట్టుకు ఎలా రక్షణ ఉంటుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) బీసీసీఐ వైఖరి పట్ల మండిపడింది. అందుకనే భారత్‌లో టీ20 వరల్డ్ కప్‌లో తమ మ్యాచ్‌లను ఆడేది లేదని బీసీబీ స్పష్టం చేసింది. ఇదే విషయమై ఐసీసీకి బీసీబీ రెండు సార్లు లేఖలు కూడా రాసింది. కానీ ఐసీసీ మాత్రం వారి లేఖలపై స్పందించలేదు.
బీసీబీకి, అతనికి సంబంధం లేదు..
అయితే పరిస్థితులు ఇలా ఉన్న నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వడోదరలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన అంపైర్ షర్ఫుదులా ఇబ్నె షాహిద్ సైకత్ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచ్ లో అసలు బంగ్లాదేశ్ అంపైర్ ఎలా పనిచేస్తున్నాడు..? అని చాలా మందికి సందేహాలు వచ్చాయి. అయితే దీనిపై బీసీబీ కూడా స్పందించింది. షాహిద్ సైకత్ వాస్తవానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నియమించిన అంపైర్ కాడు. అతను ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్స్‌లో భాగంగా పనిచేస్తున్నాడు. కనుక ఐసీసీ పిలిస్తే ఏ మ్యాచ్‌కు అయినా సరే వెళ్లి అంపైరింగ్ చేయాల్సిందే. అతను ఐసీసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాడు. బీసీబీతో అతనికి సంబంధం లేదు. కానీ బీసీబీ కావాలనుకుంటే అక్కడి దేశవాళీ మ్యాచ్‌లు లేదా ఇతర లీగ్‌లకు అతనితో పని చేయించుకోవచ్చు. అతన్ని అంపైర్‌గా నియమించుకోవచ్చు. ఈ క్రమంలో బీసీబీయే అతనికి వేతనం చెల్లించాల్సి ఉంటుంది. ఇక అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఐసీసీ పిలిస్తే మాత్రం కచ్చితంగా వెళ్లాల్సిందే. అలాంటప్పుడు బీసీబీ కూడా అడ్డు చెప్పడానికి వీలు లేదు. కనుకనే షాహిద్ సైకత్ ప్రస్తుతం భారత్, కివీస్ మ్యాచ్‌లో కనిపించాడు. అంపైర్ గా బాధ్యతలను నిర్వర్తించాడు.
వేదికల మార్పు ఇంకా సందిగ్ధంలోనే..
టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌లను ఆడనుంది. వాటిల్లో మొదటి మూడు మ్యాచ్‌లను కోల్‌కతాలో నిర్వహిస్తారు. చివరి మ్యాచ్ ముంబైలో ఆడుతుంది. అయితే భారత్‌లోని తమ వేదికలను శ్రీలంకకు తరలించాలని ఇప్పటికే ఐసీసీకి బీసీబీ రెండు సార్లు లేఖలు రాసింది. కానీ ఐసీసీ నుంచి స్పందన రాలేదు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సేఫ్టీ పట్ల ఐసీసీ అన్ని చర్యలు తీసుకుంటుందని బీసీబీయే ఇప్పటికే పలు సార్లు వ్యాఖ్యలు చేసింది. కానీ ఐసీసీ మాత్రం అధికారికంగా ఇంకా దీనిపై ప్రకటించలేదు. అయితే బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ కచ్చితంగా తిరస్కరిస్తుందని తెలుస్తోంది.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



