త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rishabh Pant | టీమిండియాకు ఎదురుదెబ్బ‌.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు రిషభ్‌ పంత్‌ దూరం!

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు భార‌త్‌కు (Team India) భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. వికెట్ కీప‌ర్‌, బ్యాట‌ర్ రిషభ్‌ పంత్ (Rishabh Pant) సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తున్న‌ది.

G

Sports | Published On Jan 11, 2026, 6.47 am IST

Rishabh Pant | టీమిండియాకు ఎదురుదెబ్బ‌.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు రిషభ్‌ పంత్‌ దూరం!
Advertisement

త్రినేత్ర.న్యూస్‌: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు భార‌త్‌కు (Team India) భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. వికెట్ కీప‌ర్‌, బ్యాట‌ర్ రిషభ్‌ పంత్ (Rishabh Pant) సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తున్న‌ది. మొద‌టి వ‌న్డే కోసం టీమ్ఇండియా వ‌డోద‌ర‌లోని బీసీఏ (BCA) గ్రౌండ్‌లో శనివారం ప్రాక్టీస్ సేష‌న్‌లో పాల్గొంది. ఈ క్ర‌మంలో త్రోడౌన్ స్పెష‌లిస్టుల‌ను ఎదుర్కొంటున్న స‌మ‌యంలో ఓ బంతి పంత్ న‌డుము పైభాగంలో తగలడంతో ఆయనకు బలమైన గాయమైంది. దీంతో ఆయన్ను సిరీస్‌ నుంచి తప్పించినట్లు సమాచారం.

`జ‌ట్టు వైద్యులు నిర్వ‌హించిన స్కానింగ్‌ల‌లో పంత్‌ కుడి వైపున పక్కటెముకకు దెబ్బ తగిలిందని, సైడ్ స్ట్రెయిన్ గుర్తించారు. దీంతో అత‌డిని న్యూజిలాండ్‌తో జరుగ‌నున్న‌ వన్డే సిరీస్ నుంచి జ‌ట్టు యాజ‌మాన్యం తొలగించింది` అని విశ్వ‌స‌నీయ వర్గాలు తెలిపాయి. కాగా, పంత్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్ లేదా ధ్రువ్ జురెల్‌లో ఎవ‌రినో ఒక‌రిని తీసుకునే అవకాశం ఉంది. వీరిద్ద‌రు ఇటీవ‌ల జ‌రిగిన విజ‌య్ హ‌జారే ట్రోఫీలో అద‌ర‌గొట్టిన విష‌యం తెలిసిందే. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువ‌డ‌లేదు.

అయితే బెంగ‌ళూరులోని బీసీసీ సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్‌లెన్స్ (CoE) నివేదిక ఇచ్చిన త‌ర్వాత‌ పంత్‌కు కొన్నిరోజుల పాటు విశ్రాంతి ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది. టీమ్ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం త్వరలో భారత పర్యటనకు న్యూజిలాండ్ రానుంది. జనవరి 11 నుంచి మూడు వన్డేల సిరీస్, 21 నుంచి టీ20 సిరీస్ మొదలుకానున్నాయి.

 

Advertisement

తాజావార్తలు

Advertisement