IND Vs NZ | వడోదర వన్డేలో చెలరేగిన కివీ బ్యాటర్లు.. భారత్ విజయలక్ష్యం 301 పరుగులు..
IND Vs NZ | వడోదర వన్డేలో న్యూజిలాండ్ భారత్‌కు 301 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కివీస్ 300 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 84 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు.
IND Vs NZ | వడోదర వన్డేలో న్యూజిలాండ్ భారత్‌కు 301 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కివీస్ 300 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 84 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. 117 పరుగుల వద్ద జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్‌లను హర్షిత్ పెవిలియన్‌కు పంపాడు. కాన్వే తన కెరీర్‌లో ఐదో హాఫ్ సెంచరీని సాధించాడు. నికోల్స్ 15వ అర్ధశతకం చేశాడు. కాన్వే 56, నికోల్స్ 62 పరుగులకు అవుట్ అయ్యారు. ఆ తర్వాత భారత బౌలర్లు చెలరేగడంతో వేగంగా వికెట్లు పడిపోయాయి.
కివీస్ స్కోరు 198 పరుగులకు చేరేసరికి ఐదు వికెట్లు నష్టపోయింది. విల్ యంగ్ (12), గ్లెన్ ఫిలిప్స్ (12) మిచెల్ హే (18) తక్కువ స్కోర్‌కే అవుట్ అయ్యారు. కెప్టెన్ బ్రేస్‌వెల్ (16) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. శ్రేయాస్ అయ్యర్ వేసిన డైరెక్ట్ త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు. మరో వైపు డారిల్ మిచెల్ ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో కెరీర్‌లో 11వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 71 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 84 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జాకరీ ఫాక్స్ కేవలం ఒక పరుగు చేసి అవుట్ అయ్యాడు. క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమీసన్ కలిసి న్యూజిలాండ్ స్కోరు బోర్డ్‌ను 300 పరుగులకు తీసుకెళ్లారు. క్లార్క్ 17 బంతుల్లో 24 పరుగులతో, జేమీసన్ ఎనిమిది పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్, సిరాజ్, హర్షిత్ తలో రెండు వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






