T20 World Cup | టీ20 వరల్డ్ కప్.. మ్యాచ్ రిఫరీలు, అంపైర్స్ ప్యానెల్‌ను ప్రకటించిన ఐసీసీ
T20 World Cup | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) శుక్రవారం టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశ కోసం మ్యాచ్ అధికారుల ప్యానెల్‌ను ప్రకటించింది. భారత్ నుంచి నలుగురుకి, బంగ్లాదేశ్ నుంచి ఇద్దరు అంపైర్లకు చోటు దక్కింది.
T20 World Cup | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) శుక్రవారం టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశ కోసం మ్యాచ్ అధికారుల ప్యానెల్‌ను ప్రకటించింది. భారత్ నుంచి నలుగురుకి, బంగ్లాదేశ్ నుంచి ఇద్దరు అంపైర్లకు చోటు దక్కింది. ప్రపంచ కప్‌కు ముందు బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన క్రమంలోనే ఐసీసీ ప్యాలెన్ జాబితాను రిలీజ్ చేసింది. అయినా, ఈ ఇద్దరు బంగ్లాదేశ్ అంపైర్లకు అవకాశం కల్పించింది. వివాదంతో సంబంధం లేకుండా అనుభవం, పనితీరుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి.
షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్ గతంలో అనేక ప్రధాన ఐసీసీ టోర్నీల్లో అంపైర్స్‌గా వ్యవహరించారు. గాజీ సోహైల్ ఎలైట్, అంతర్జాతీయ ప్యానెల్స్‌లో నిలకడగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. అంపైర్ల ట్రాక్ రికార్డ్, ఇంటర్నేషనల్ అనుభవం, ప్రమాణాల ఆధారంగా మాత్రం ప్యానెల్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది. నలుగురు భారతీయ అంపైనర్లు సైతం విధులు నిర్వర్తించనున్నారు. భారతీయ అంపైర్ల విషయానికొస్తే.. జవగల్ శ్రీనాథ్ (మ్యాచ్ రిఫరీ), జయరామన్ మదన్‌గోపాల్, నితిన్ మీనన్, కేఎన్ఏ పద్మనాభన్, నితిన్ మీనన్ వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభంకానున్నది. గ్రూప్ దశలో మొత్తం 24 మంది ఆన్-ఫీల్డ్ అంపైర్లు, ఆరుగురు మ్యాచ్ రిఫరీలు విధులు నిర్వర్తిస్తారు. సూపర్ 8, నాకౌట్ మ్యాచ్‌ల కోసం ప్యానెల్‌ను తర్వాత ప్రకటిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. డీన్ కోస్కర్, డేవిడ్ గిల్బర్ట్, రంజన్ మదుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్, జవగల్ శ్రీనాథ్ మ్యాచు రిఫరీలుగా వ్యవహరించనున్నారు. ఇక రోలాండ్ బ్లాక్, క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, వేన్ నైట్స్, డోనోవన్ కోచ్, జయరామన్ మదన్‌గోపాల్, నితిన్ మీనన్, సామ్ నోగాజ్స్కీ, కేఎన్ఏ పద్మనాభన్, అల్లావుద్దీన్ పాలేకర్, అహ్సన్ రజా, లెస్లీ రీఫర్, పాల్ రీఫెల్, లాంగ్టన్ రుసెరే, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, గాజీ సోహైల్, రాడ్ టకర్, అలెక్స్ వార్ఫ్, రవీంద్ర విమలసిరి, ఆసిఫ్ యాకుబ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






