T20 World Cup 2026 | పాకిస్థాన్‌కు సూర్యకుమార్ కూడా అలాగే బాల్స్ వేయనున్నాడా..? వీడియో వైరల్..!
T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి పాక్ ఆఫ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్పైనే ఉంది. గత కొద్ది రోజులుగా తారిక్ బౌలింగ్ యాక్షన్‌తోపాటు అతన్ని మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారు.. అన్న చర్చ విపరీతంగా కొనసాగుతోంది.
T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి పాక్ ఆఫ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్పైనే ఉంది. గత కొద్ది రోజులుగా తారిక్ బౌలింగ్ యాక్షన్‌తోపాటు అతన్ని మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారు.. అన్న చర్చ విపరీతంగా కొనసాగుతోంది. అయితే టీమిండియా మాత్రం ఇప్పటికే అతని బౌలింగ్‌పై పూర్తి అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మ్యాచ్ జరగనున్న వేదిక శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆర్.ప్రేమ దాస స్టేడియంలో భారత బ్యాటర్లు తారిక్ లాంటి యాక్షన్‌తో కూడిన బౌలింగ్‌ను ఇప్పటికే తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్వయంగా అలాంటి యాక్షన్‌తో బంతులను సంధించాడు. ఈ క్రమంలో సూర్య నెట్స్‌లో బ్యాటర్లకు అలా బౌలింగ్ చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
నెట్స్‌లో అదే బౌలింగ్‌తో ప్రాక్టీస్..
పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ లాంటి బౌలింగ్ యాక్షన్‌తో, అతన్ని అనుకరిస్తూ భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ భారత బ్యాటర్లకు శనివారం నెట్స్ ప్రాక్టీస్‌లో భాగంగా బంతులు వేశాడు. అచ్చం తారిక్ లాంటి యాక్షన్‌తో సూర్య బంతులు వేయడం విశేషం. ఈ క్రమంలోనే సూర్య బౌలింగ్‌ను చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. కొంపదీసి సూర్య కూడా తారిక్ లాగే మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లకు బౌలింగ్ వేస్తాడా.. అని ప్రశ్నిస్తున్నారు. అయితే జట్టు కోసం అవసరం అయితే ఆ అసాధారణ స్టెప్‌ను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ సాధారణంగా మ్యాచ్‌లలో బౌలింగ్ చేయడు. కనుక ఆయన బౌలింగ్ గురించి అసలు పాక్‌కు అవగాహన లేదు. అదే ఆయన అనుకోకుండా తారిక్ లాంటి యాక్షన్‌తో అదే పాక్ బ్యాటర్లకు బౌలింగ్ చేస్తే అప్పుడు వాళ్లకు అనూహ్యమైన పరిణామం అవుతుంది. దీంతో వారి బౌలింగ్‌ను వారికే వేసినట్లు అవుతుంది. ఇది భారత్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుంది. అందువల్ల మ్యాచ్‌లో టీమ్ మేనేజ్మెంట్ సూర్యతో బౌలింగ్ చేయించే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది.
View this post on Instagram
స్పిన్ ను ఎవరు బాగా ఆడుతారు..?
ఇక భారత జట్టులో స్పిన్‌ను ఆడే బ్యాట్స్మెన్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ పేరుగాంచాడు. కానీ తారిక్‌తో పాకిస్థాన్ 10వ ఓవర్ తరువాత బౌలింగ్ చేయించే అవకాశం ఉంటుంది. ఎక్కువగా తారిక్ అదే స్పెల్‌లో బౌలింగ్ వేస్తుంటాడు. మరి అప్పటి వరకు అభిషేక్ అవుట్ అవకుండా ఉంటాడా.. అంటే.. అది డౌటే. ఇక అభిషేక్ తరువాత స్పిన్‌ను ఆడే బ్యాట్స్మెన్లలో హార్దిక్ పాండ్యా, శివం దూబె, రింకు సింగ్ ఉన్నారు. కానీ వారు లోయర్ ఆర్డర్లో వస్తారు. అప్పటి వరకు తారిక్ బౌలింగ్ కంప్లీట్ అయ్యే చాన్స్ ఉంటుంది. కానీ అనుకోకుండా టీమిండియా వెంట వెంటనే వికెట్లను కోల్పోతే మాత్రం భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కచ్చితంగా తారిక్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది అతి పెద్ద సవాల్‌గా మారుతుంది. కనుక టీమిండియా ఈ ప్లాన్‌కు కూడా రెడీ అవ్వాల్సి ఉంటుంది. అయితే తారిక్ బౌలింగ్ యాక్షన్ సరైందే అని తేలడంతో అతనిపై భారత్ ఫిర్యాదు చేసే అవకాశం లేదని సమాచారం. కానీ ఐసీసీ రూల్స్ ప్రకారం ఏదైనా గమ్మత్తు చేస్తారా అన్నది మ్యాచ్ అయ్యే వరకు వేచి చూస్తే తెలుస్తుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



