త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | షిమ్రాన్ హెట్‌మైర్ ఔట్ నిర్ణ‌యంపై వివాదం.. బంతి తాకిందా, లేదా..?

T20 World Cup 2026 | కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం భార‌త్‌తో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సూప‌ర్ 8 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట‌ర్ షిమ్రాన్ హెట్‌మైర్‌ను అంపైర్ ఔట్ గా ప్ర‌కటించ‌డం వివాదాస్ప‌దం అయింది. తాను బంతికి ఎలాంటి ఎడ్జ్ ఇవ్వ‌లేద‌ని హెట్‌మైర్ ప‌దే ప‌దే చెబుతున్న‌ప్ప‌టికీ రీప్లేలో మాత్రం ఎడ్జ్ తీసుకున్న‌ట్లు తేలింది.

S

Cricket | Published On Mar 2, 2026, 10.19 am IST

T20 World Cup 2026 | షిమ్రాన్ హెట్‌మైర్ ఔట్ నిర్ణ‌యంపై వివాదం.. బంతి తాకిందా, లేదా..?
Advertisement

T20 World Cup 2026 | కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం భార‌త్‌తో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సూప‌ర్ 8 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట‌ర్ షిమ్రాన్ హెట్‌మైర్‌ను అంపైర్ ఔట్ గా ప్ర‌కటించ‌డం వివాదాస్ప‌దం అయింది. తాను బంతికి ఎలాంటి ఎడ్జ్ ఇవ్వ‌లేద‌ని హెట్‌మైర్ ప‌దే ప‌దే చెబుతున్న‌ప్ప‌టికీ రీప్లేలో మాత్రం ఎడ్జ్ తీసుకున్న‌ట్లు తేలింది. దీంతో అంపైర్ అత‌న్ని ఔట్‌గా ప్ర‌క‌టించారు. అయితే దీనిపై హెట్‌మైర్‌తోపాటు విండీస్ టీం అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. విండీస్ ఇన్నింగ్స్ 11.3 ఓవ‌ర్ వ‌ద్ద 102/1 గా కొన‌సాగుతోంది. అదే స‌మ‌యంలో భార‌త బౌల‌ర్ జ‌స్‌ప్రిత్ బుమ్రా బౌలింగ్ వేస్తున్నాడు. మంచి లెంగ్త్ బంతిని ఎడమచేతి బ్యాటర్ వైపు అవుట్‌స్వింగ్‌గా వదిలాడు. హెట్‌మైర్ దానిని ఫీల్డ్‌లోకి స్వింగ్ చేయడానికి ప్రయత్నించగా, బ్యాట్‌ లోపలి అంచును బంతి తాకి వికెట్ కీపర్ చేతికి వెళ్లినట్టు అంపైర్ భావించి కాట్ బిహైండ్ గా ఔట్ ఇచ్చాడు.

హెట్‌మైర్ రివ్యూ కోరినా..

అయితే హెట్‌మైర్ వెంట‌నే ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ డీఆర్ఎస్ రివ్యూ కోరాడు. తాను బంతికి ఎడ్జ్ ఇవ్వ‌లేద‌నే న‌మ్మ‌కంతో అత‌ను రివ్యూ అడిగాడు. అయితే స్లో మోషన్ రిప్లేల్లో అది అత్యంత సూక్ష్మ ఎడ్జ్‌గా కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ అల్ట్రాఎడ్జ్‌లో స్పష్టమైన స్పైక్ కనిపించడంతో ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థించాడు. హెట్‌మైర్‌ను మ‌ళ్లీ ఔట్ గానే ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో అత‌ను నిరాశ‌గా వెనుదిగాడు. ఇక డ‌గౌట్‌లో ఉన్న వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కూడా త‌ల ఊపుతూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. కాగా హెట్ మైర్ 12 బంతుల్లో 27 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉండ‌గా అత‌ని వికెట్ టీమిండియాకు వ‌రంలా ల‌భించింది. ఆ త‌రువాత మ‌ళ్లీ వెంట‌నే అదే ఓవ‌ర్‌లో రోస్టాన్ చేజ్ కూడా ఔట్ అయ్యాడు. దీంతో కాసేపు వెస్టిండీస్ ప‌రుగుల ప్ర‌వాహానికి అడ్డుక‌ట్ట ప‌డింది. అయిన‌ప్ప‌టికీ వారు 195 ప‌రుగుల భారీ స్కోరు చేశారు. అయితే కామెంటేట‌ర్లు మాత్రం మ‌రో 20 ప‌రుగులు త‌క్కువయ్యాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అదే జ‌రిగి ఉంటే భార‌త్‌కు చేజ్ చేయ‌డం ఇంకా క‌ష్టం అయ్యేది.

రికార్డు స్థాయిలో సిక్సులు..

కాగా టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో హెట్‌మైర్ మంచి ఫామ్‌లో కొన‌సాగాడు. ఈ టోర్నీలో అత‌ను ఏకంగా 19 సిక్సులను బాదాడు. ఒకే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఒక ప్లేయ‌ర్ బాదిన అత్య‌ధిక సిక్సుల సంఖ్య ఇదే కావ‌డం విశేషం. త‌రువాతి స్థానంలో పాక్‌కు చెందిన బ్యాట‌ర్ షాహిబ్‌జాదా ఫ‌ర్హాన్ (18) ఉండ‌గా అత‌ను కూడా ఇదే టోర్నీలో ఈ ఘ‌న‌త సాధించాడు. ఇక ఈ జాబితాలో 17 సిక్సుల‌తో నికోలాస్ పూర‌న్ 3వ స్థానంలో నిలిచాడు. అత‌ను 2024 టోర్నీలో ఈ ఘ‌న‌త సాధించాడు. అంత‌కు ముందు మ‌రో విండీస్ ప్లేయ‌ర్ క్రిస్‌గ్రేల్ 2012 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో 16 సిక్సులు బాదాడు.

అయితే భార‌త్‌తో జ‌రిగిన తాజా మ్యాచ్‌లో షిమ్రాన్ హెట్‌మైర్ ఔట్ నిర్ణ‌యం వివాదాస్ప‌దంగా మారింది. కొంద‌రు అత‌నిది ఔట్ కాద‌ని, బంతి స‌రిగ్గా బ్యాట్‌ను తాక‌లేద‌ని, ఆ స‌మ‌యంలో అల్ట్రా ఎడ్జ్ త‌ప్పుగా చూపించింద‌ని అంటున్నారు. మ‌రికొంద‌రు మాత్రం అల్ట్రా ఎడ్జ్ స‌రిగ్గానే చూపించింద‌ని, స్టేడియం నిండా అంత‌టి భారీ శ‌బ్దాలు ఉంటే చిన్న శ‌బ్దాలు స‌రిగ్గా వినిపించ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ ఈ నెల 5వ తేదీన ముంబైలో జ‌ర‌గ‌నున్న సెమీ ఫైన‌ల్ 2 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement