T20 World Cup 2026 | సౌతాఫ్రికాతో మ్యాచ్ లో సంజు శాంసన్..? నెట్స్‌లో గంటల తరబడి ప్రాక్టీస్..
T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌లో ఎట్టకేలకు లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. చివరి లీగ్ మ్యాచ్‌లో ఓమన్‌పై ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. కానీ జింబాబ్వే, శ్రీలంకలతో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రం ఆసీస్ ఓటమిపాలైంది. దీంతో ఆసీస్ సూపర్ 8కు అర్హత సాధించలేకపోయింది.
T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌లో ఎట్టకేలకు లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. చివరి లీగ్ మ్యాచ్‌లో ఓమన్‌పై ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. కానీ జింబాబ్వే, శ్రీలంకలతో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రం ఆసీస్ ఓటమిపాలైంది. దీంతో ఆసీస్ సూపర్ 8కు అర్హత సాధించలేకపోయింది. ఓమన్ మ్యాచ్ ఆసీస్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఇప్పుడు శనివారం నుంచి సూపర్ 8 దశ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తొలుత కొలంబోలో పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. భారత్ విషయానికి వస్తే టీమిండియా మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్‌లో సౌతాఫ్రికాతో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు సంజు శాంసన్‌ను ఎంపిక చేయాలని జట్టు మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సంజు ఇప్పటికే అహ్మదాబాద్‌లో నెట్ సెషన్లలో బ్యాటింగ్‌ను సాధారణం కన్నా ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం.
సాధారణంగా ఎక్కువ సమయం పాటు..
సౌతాఫ్రికాతో జరగనున్న సూపర్ 8 మ్యాచ్‌కు గాను భారత్ ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకోగా అక్కడ ప్లేయర్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారు. ముఖ్యంగా సంజు శాంసన్ సాధారణంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం కేటాయించే సమయం కన్నా అదనపు సమయం వెచ్చించి మరీ అనేక భిన్నమైన షాట్లను ఆడుతున్నాడని, భిన్న రకాల బౌలింగ్ ఆప్షన్లలో అతను సాధన చేస్తున్నాడని తెలుస్తోంది. ఇషాన్ కిషన్‌తో కలిసి సంజు శాంసన్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సైతం వైరల్ అవుతున్నాయి. దీంతో సంజు శాంసన్ సౌతాఫ్రికాతో జరగనున్న సూపర్ 8 మ్యాచ్‌లో ఆడుతాడని స్పష్టమవుతుందని, అందుకనే అంత ఎక్కువగా బ్యాటింగ్ సాధన చేస్తున్నాడని విశ్లేషకులు అంటున్నారు.
అభిషేక్ శర్మ, తిలక్‌లలో ఎవరు..?
ఇటీవలి కాలంలో టీమిండియా ఓపెనింగ్ స్థానంలో ఎవరో ఒకరు కచ్చితంగా విఫలం అవుతున్నారు. అభిషేక్ శర్మ ఫామ్‌లో ఉన్నాడని అనుకుంటే అతనికి జోడీగా పలు మ్యాచ్‌లలో ఓపెనింగ్‌కు దిగిన సంజు విఫలం అయ్యాడు. దీంతో సంజు స్థానంలో కిషన్‌ను ఎంపిక చేశారు. అంతకు ముందు కిషన్ 3వ స్థానంలో ఆడుతుండగా, ఆ ప్లేస్‌లో అదరగొడుతుండడంతో అతనికి ఓపెనర్‌గా దాదాపు పర్మినెంట్ చాన్స్ వచ్చింది. తనకు వచ్చిన చాన్స్‌ను కిషన్ సద్వినియోగం చేసుకున్నాడు. ఓపెనర్‌గా కూడా రాణిస్తున్నాడు. అయితే సంజు స్థానంలో వచ్చిన కిషన్ రాణించే సరికి అటు అభిషేక్ ఫామ్‌కు దూరమయ్యాడు. ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్‌లో అతను బోణీ చేయలేదు. దీంతో అభిషేక్‌కు బదులుగా సంజును మళ్లీ ఎంపిక చేస్తారని అంటున్నారు. కానీ టాప్ ఆర్డర్లో వచ్చే తిలక్ వర్మ కూడా సరిగ్గా రాణించకపోవడంతో అతని స్థానాన్ని అయినా సంజు భర్తీ చేస్తాడని తెలుస్తోంది. అభిషేక్ లేదా తిలక్ లలో ఎవరో ఒకరిని తప్పించి ఆ స్థానంలో సంజును తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. అందుకనే సంజు సాధారణం కన్నా ఎక్కువగానే ప్రాక్టీస్ చేస్తున్నట్లు గ్రౌండ్ స్టాఫ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రోటీస్‌తో మ్యాచ్‌లో తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందో చూడాలి.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026

ICC Women’s T20 World Cup | టీ20 వరల్డ్ కప్‌కు భారత్ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్ బౌలర్ నందినికి ఛాన్స్..!
మే 2, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



