T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026.. నేటి వార్మప్ మ్యాచ్‌లు ఇవే.. తలపడనున్న ఇండియా ఎ, యూఎస్ఏ..
T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ మరో 5 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐసీసీ ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే సోమవారం (ఫిబ్రవరి 2, 2026) నుంచి వార్మప్ మ్యాచ్‌లను నిర్వహిస్తోంది. చిన్న టీమ్‌లు రెండేసి చొప్పున వార్మప్ మ్యాచ్‌లను ఆడేలా షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ మరో 5 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐసీసీ ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే సోమవారం (ఫిబ్రవరి 2, 2026) నుంచి వార్మప్ మ్యాచ్‌లను నిర్వహిస్తోంది. చిన్న టీమ్‌లు రెండేసి చొప్పున వార్మప్ మ్యాచ్‌లను ఆడేలా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ క్రమంలోనే తొలి రోజు మొత్తం మూడు వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్ 1లో ఆప్గనిస్థాన్, స్కాట్లండ్ జట్ల మధ్య తొలి వార్మప్ మ్యాచ్ జరగనుంది. అలాగే ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇండియా ఎ జట్టు యూఎస్ఏతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అవుతుంది.
రాత్రి 7 గంటలకు చెన్నైలో కెనడా, ఇటలీ జట్ల మధ్య మరో వార్మప్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ వార్మప్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తారా, లేదా అన్న విషయంపై స్పష్టత రాలేదు. కానీ ఇండియా ఎ, భారత జట్టు ఆడే మ్యాచ్‌లను మాత్రం ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వ్యూయర్షిప్ అధికంగా ఉంటుంది కనుక కచ్చితంగా ఈ మ్యాచ్‌లను ప్రసారం చేస్తారని సమాచారం. ఇక ఈ టోర్నీకి జియో స్టార్ ఇప్పటికే ప్రధాన బ్రాడ్ కాస్టర్‌గా ఉన్న నేపథ్యంలో డిజిటల్ వేదికగా జియో హాట్ స్టార్‌లో మ్యాచ్‌లను ప్రసారం చేస్తారు. అలాగే శాటిలైట్ మాధ్యమంలో స్టార్ టీవీ చానల్స్‌లో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
వార్మప్ మ్యాచ్‌లలో భాగంగా ఇవాళ ఇండియా ఎ జట్టు యూఎస్ఏతో ఆడుతుంది. తరువాత భారత ప్రధాన జట్టు ఫిబ్రవరి 4వ తేదీన సౌతాఫ్రికాతో వార్మప్ ఆడుతుంది. మళ్లీ 6వ తేదీన ఇండియా ఎ జట్టు నమీబియాతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌దే విజయం.. ఆస్ట్రియన్ సైనిక నిపుణుడి సంచలన వ్యాఖ్యలు..!
మే 6, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



