త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. పాక్ బాయ్ కాట్ చేసినా శ్రీ‌లంక వెళ్ల‌నున్న‌ భార‌త్‌..

T20 World Cup 2026 | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి 15న భార‌త్‌తో జ‌ర‌గాల్సిన గ్రూప్ ద‌శ మ్యాచ్‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు పాకిస్థాన్ తేల్చి చెప్పిన త‌రువాత అభిమానుల‌కు అనేక సందేహాలు వ‌స్తున్నాయి. పాకిస్థాన్ ఎలాగూ మ్యాచ్‌ను బ‌హిష్క‌రించింది క‌దా. ఇక శ్రీలంక‌కు భార‌త్ వెళ్తుందా, వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు క‌దా.. అని చాలా మంది ఆలోచిస్తున్నారు.

S

Cricket | Published On Feb 2, 2026, 12.07 pm IST

T20 World Cup 2026 | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. పాక్ బాయ్ కాట్ చేసినా శ్రీ‌లంక వెళ్ల‌నున్న‌ భార‌త్‌..
Advertisement

T20 World Cup 2026 | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి 15న భార‌త్‌తో జ‌ర‌గాల్సిన గ్రూప్ ద‌శ మ్యాచ్‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు పాకిస్థాన్ తేల్చి చెప్పిన త‌రువాత అభిమానుల‌కు అనేక సందేహాలు వ‌స్తున్నాయి. పాకిస్థాన్ ఎలాగూ మ్యాచ్‌ను బ‌హిష్క‌రించింది క‌దా. ఇక శ్రీలంక‌కు భార‌త్ వెళ్తుందా, వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు క‌దా.. అని చాలా మంది ఆలోచిస్తున్నారు. అయితే ఐసీసీ ప్రోటోకాల్ ప్ర‌కార‌మే భార‌త్ వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒక జ‌ట్టు మ్యాచ్‌ను బ‌హిష్క‌రించినా ఐసీసీ నియ‌మావ‌ళి ప్ర‌కారం ఇంకో జ‌ట్టు క‌చ్చితంగా న‌డుచుకోవాల్సి ఉంటుంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు వ‌చ్చి మ్యాచ్ అయ్యే వ‌ర‌కు లేదా మ్యాచ్ రిఫ‌రీ ఫ‌లితాన్ని ప్ర‌క‌టించే వ‌ర‌కు ఇంకో జ‌ట్టు మైదానంలోనే ఉండాలి. ఈ క్ర‌మంలోనే పాక్ తాను చెప్పిన‌ట్లుగానే మ్యాచ్‌ను బ‌హిష్క‌రిస్తే, అంటే మ్యాచ్ ఆడేందుకు రాక‌పోతే.. అప్పుడు మ్యాచ్ రిఫ‌రీ భార‌త్ గెలిచిన‌ట్లు ప్ర‌క‌టిస్తారు. దీంతో మ్యాచ్ ముగిసిన‌ట్లు అవుతుంది. అప్పుడు భార‌త జ‌ట్టు మైదానాన్ని వీడొచ్చు.

ఐసీసీ రూల్స్ ప్ర‌కార‌మే..

భారత జట్టు కొలంబో చేరుకుని, మ్యాచ్ రిఫరీ అధికారికంగా మ్యాచ్‌ను రద్దు చేసే వరకు లేదా ఫ‌లితాన్ని ప్ర‌క‌టించే వ‌ర‌కు మైదానంలో వేచి ఉంటుంది. టీమిండియా ఐసీసీ నిబంధనలన్నింటినీ పాటిస్తుంది. షెడ్యూల్ ప్రకారం ప్రాక్టీస్ చేస్తుంది, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటుంది, నిర్ణీత సమయానికి SSC Cricket Ground కు చేరుకుని మ్యాచ్ రిఫరీ నిర్ణయం కోసం ఎదురుచూస్తుంది, అని బీసీసీఐ వ‌ర్గాలు తెలిపాయి. మ్యాచ్‌ను పాకిస్థాన్ బ‌హిష్క‌రించిన నేప‌థ్యంలో అనేక సందేహాలు రాగా, ఇప్పుడు వాటిని బీసీసీఐ అధికారులు నివృత్తి చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో గ‌న‌క పాక్ ఆడ‌క‌పోతే అనంత‌రం ఆ జ‌ట్టు ఎదుర్కొనే ప‌రిణామాలు మాత్రం తీవ్రంగానే ఉంటాయ‌ని తెలుస్తోంది.

అకార‌ణంగా బాయ్ కాట్‌..

ముందుగా చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం భార‌త్‌, పాక్ జ‌ట్లు ఐసీసీ టోర్నీల్లో ప్ర‌త్య‌ర్థి దేశాల్లో ఆడాల్సి వ‌స్తే త‌మ మ్యాచ్‌ల‌ను త‌ట‌స్థ వేదిక‌ల్లో ఆడుతారు. అందులో భాగంగానే గ‌తంలో చాంపియ‌న్స్ ట్రోఫీ సంద‌ర్భంగా పాకిస్థాన్‌లో భార‌త్ మ్యాచ్‌ల‌ను ఆడాల్సి ఉన్నా ఒప్పందం ప్ర‌కారం భార‌త్ త‌న మ్యాచ్‌ల‌ను త‌ట‌స్థ వేదిక అయిన దుబాయ్‌లో ఆడింది. అలాగే ఇప్పుడు కూడా ఆతిథ్య జ‌ట్టు భార‌త్‌లో పాక్ ఆడాల్సి వ‌స్తోంది క‌నుక ఆ జ‌ట్టు మ్యాచ్‌ల‌ను శ్రీ‌లంక‌లో ఫిక్స్ చేశారు. ఇది ముందుగా చేసుకున్న ఒప్పందం ప్ర‌కార‌మే జ‌రిగింది. కానీ పాక్ మాత్రం ఇప్పుడు అకార‌ణంగా మ్యాచ్‌ను బాయ్ కాట్ చేస్తామ‌ని చెబుతోంది. పీసీబీ సైతం ఇండియాతో మ్యాచ్‌ను ఎందుకు బ‌హిష్క‌రిస్తున్నారో అధికారికంగా కార‌ణం చెప్ప‌లేదు.

కుక్క తోక వంక‌రే అన్న చందంగా..

సాధార‌ణంగా ఇలాంటి సంద‌ర్భాల్లో కార‌ణం లేకుండా మ్యాచ్‌ల‌ను బ‌హిష్క‌రిస్తే ఐసీసీ తీవ్ర చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మిస్తుంది. ఆ జ‌ట్టుపై భారీ ఎత్తున జరిమానా విధించ‌డంతోపాటు భ‌విష్య‌త్తులో ఐసీసీ టోర్నీల‌ను నిర్వ‌హించేందుకు అర్హ‌తను తొల‌గిస్తుంది. అలాగే ఈ మ్యాచ్ వ‌ల్ల ఆర్థికంగా ఐసీసీకి న‌ష్టం సంభ‌విస్తుంది క‌నుక పాక్‌కు వ‌చ్చే నిధుల‌ను కూడా ఆపేస్తుంది. అయితే ఇన్ని తెలిసినా పాక్ ఇంకా ఎందుకు డాంబికాన్ని ప్ర‌దర్శిస్తుంద‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే కుక్క తోక వంక‌రే అన్న చందంగా పాక్ ఎప్పుడూ ఒక మాట‌పై నిల‌బ‌డ‌లేదు. గ‌తంలో ఆసియా క‌ప్‌లోనూ ఇలాగే భార‌త్‌తో మ్యాచ్‌ల‌ను ఆడ‌బోము అని చెప్పి, భారీ ఫైన్‌కు భ‌య‌ప‌డి మ‌ళ్లీ తోక ముడిచి వ‌చ్చి మ్యాచ్‌ల‌ను ఆడారు. ఇప్పుడు కూడా ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తున్నారు. క‌నుక మ్యాచ్ అయ్యే స‌మ‌యం వ‌ర‌కు కూడా వారు చెప్పే విష‌యాల‌ను అస‌లు న‌మ్మ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement