త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | సూప‌ర్ 8లో జ‌ట్ల విభ‌జ‌న‌.. ఐసీసీపై తీవ్ర విమ‌ర్శ‌లు..

T20 World Cup 2026 | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 నేప‌థ్యంలో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. సూప‌ర్ 8 ద‌శ‌లో రెండు గ్రూపుల్లో జ‌ట్ల‌ను విభ‌జించిన తీరు స‌రిగ్గా లేద‌ని నెటిజ‌న్లు, విశ్లేష‌కులు త‌ప్పుబ‌డుతున్నారు. సూప‌ర్ 8 ద‌శ‌కు గాను ఐసీసీ ముందుగానే సీడింగ్ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే.

S

Cricket | Published On Feb 20, 2026, 12.02 pm IST

T20 World Cup 2026 | సూప‌ర్ 8లో జ‌ట్ల విభ‌జ‌న‌.. ఐసీసీపై తీవ్ర విమ‌ర్శ‌లు..
Advertisement

T20 World Cup 2026 | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 నేప‌థ్యంలో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. సూప‌ర్ 8 ద‌శ‌లో రెండు గ్రూపుల్లో జ‌ట్ల‌ను విభ‌జించిన తీరు స‌రిగ్గా లేద‌ని నెటిజ‌న్లు, విశ్లేష‌కులు త‌ప్పుబ‌డుతున్నారు. సూప‌ర్ 8 ద‌శ‌కు గాను ఐసీసీ ముందుగానే సీడింగ్ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. లీగ్‌ ద‌శ‌లో టాప్ 2 జ‌ట్లు త‌మ సీడింగ్ ప్ర‌కారం సూప‌ర్ 8 లో ఆడుతాయి. అయితే ఈ సీడింగ్ విధానం వ‌ల్ల టోర్నీలో ఇప్ప‌టికే పైచేయిగా ఉన్న జ‌ట్లకు అన్యాయం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. సాధార‌ణంగా ఎలాంటి టోర్నీ అయినా స‌రే విన్న‌ర్ల‌కు ఎక్కువ రివార్డు ఇచ్చే విధంగా ఉంటుంద‌ని, కానీ ఐసీసీ సీడింగ్ నిర్ణ‌యం వ‌ల్ల ఇప్పుడు ఈ టోర్నీ ర‌న్న‌ర్స్‌-అప్‌కు ఎక్కువ చాన్స్‌లు ఇచ్చిన‌ట్లు అయింద‌ని విమ‌ర్శిస్తున్నారు.

విన్న‌ర్స్ అంతా ఒక గ్రూప్‌లో..

ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీ లీగ్‌ ద‌శ‌లో టాప్ స్థానాల్లో నిలిచిన జ‌ట్లు అన్నీ సూప‌ర్ 8 లో ఒక గ్రూప్‌లో ఉండ‌గా, టాప్ 2 స్థానాల్లో నిలిచిన జ‌ట్ల‌న్నీ సూపర్ 8లో ఇంకో గ్రూప్‌లో ఉన్నాయి. అంటే ఇక్క‌డ సూప‌ర్ 8 లో జ‌ట్ల విభ‌జ‌న స‌రిగ్గా జ‌ర‌గ‌లేదు. దీని వ‌ల్ల లీగ్‌ ద‌శ‌లో టాప్‌లో నిలిచిన‌ప్ప‌టికీ విన్న‌ర్లుగా ఉన్న ఇండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, జింబాబ్వేలు త‌క్కువ రివార్డును పొందిన‌ట్లు అయింది. ఎందుకంటే ఈ నాలుగు జ‌ట్లలో రెండు జ‌ట్లు సెమీ ఫైన‌ల్‌కు చేర‌వు. దీని వ‌ల్ల లీగ్‌ ద‌శ‌లో విన్న‌ర్లు అయిన‌ప్ప‌టికీ వారికి స‌రైన రివార్డు ద‌క్క‌డం లేద‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. మ‌రోవైపు సూప‌ర్ 8 లో ఇంకో గ్రూపులో ఉన్న‌వారు లీగ్‌ ద‌శ‌లో ర‌న్న‌ర్స్‌-అప్ స్థానాల్లో నిలిచారు. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, శ్రీ‌లంక జ‌ట్లు లీగ్ ద‌శ‌లో త‌మ గ్రూపుల్లో 2 స్థానంలో నిలిచాయి. అయితే వీరికి కూడా విన్న‌ర్ జ‌ట్ల మాదిరిగానే స‌మాన అవ‌కాశం ల‌భిస్తోంది. ఈ టీమ్‌ల‌లోనూ రెండు జ‌ట్లు సెమీస్‌కు వెళ్ల‌వు. అయిన‌ప్ప‌టికీ విన్న‌ర్లంతా ఒక గ్రూప్‌లో, ర‌న్న‌ర్స్‌-అప్ అంతా ఒక గ్రూప్‌లో ఉండ‌డం వ‌ల్ల ఇరు గ్రూపుకు సెమీస్‌కు చేరేందుకు స‌మాన అవ‌కాశం ద‌క్కిన‌ట్లు అయింది. దీని వ‌ల్ల విన్న‌ర్ జ‌ట్ల‌కు న‌ష్ట‌మే జ‌రుగుతుంద‌ని, టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు పైచేయి సాధించినా కూడా త‌దుప‌రి స్టేజ్‌కు ఆ రివార్డు ప‌నిచేయ‌డం లేద‌ని విమ‌ర్శ‌కులు అంటున్నారు.

సీడింగ్ విధానం వ‌ల్లే ఇలా..

ఉదాహ‌ర‌ణ‌కు చూస్తే టోర్నీ గ్రూప్ డిలో సౌతాఫ్రికా అగ్ర స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో న్యూజిలాండ్ ఉంది. కానీ సీడింగ్ ప్ర‌కారం న్యూజిలాండ్‌కు హై ర్యాంకు ఇచ్చారు. దీని వ‌ల్ల సౌతాఫ్రికా సీడింగ్ ప్ర‌కారం మ‌ళ్లీ సూప‌ర్ 8 స్టేజ్‌లో విన్న‌ర్స్‌తో పోటీ ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఇక్క‌డ ఆ జ‌ట్టుకు స‌రైన రివార్డు ల‌భించ‌లేదు. దీని కార‌ణంగా ఆ జ‌ట్టుకు ఫైన‌ల్‌కు కాదు క‌దా, క‌నీసం సెమీ ఫైన‌ల్‌కు వెళ్లేందుకు కూడా క‌ష్ట‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ఇక సూప‌ర్ 8లో సౌతాఫ్రికాతోపాటు ఆ గ్రూప్‌లో ఉన్న‌ ఇత‌ర జ‌ట్ల‌కు కూడా చావో రేవో అన్న‌ట్లు మార‌నుంది. అందుక‌నే దీన్ని ప్ర‌స్తుతం గ్రూప్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తున్నారు. ఐసీసీ నిర్ణ‌యించిన సీడింగ్ విధానం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని, టాప్‌లో వ‌చ్చిన టీమ్‌ల‌ను సరిగ్గా విభజించ‌కుండా ప్రీ సీడింగ్ తో ముందే ఫిక్చ‌ర్ల‌ను నిర్ణ‌యించార‌ని, క‌నుక‌నే ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ని అంటున్నారు.

శ్రీ‌లంక ప‌రిస్థితి..

ఇక మ‌రోవైపు టోర్నీకి స‌హ ఆతిథ్య జ‌ట్టుగా ఉన్న శ్రీ‌లంక‌కు కూడా మ‌రో న‌ష్టం ఉంద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ పాకిస్థాన్ గ‌న‌క సెమీస్‌కు చేరితేనే వారి మ్యాచ్‌లు శ్రీ‌లంక‌లో ఉంటాయి. వారు చేర‌కుండా, శ్రీ‌లంక సెమీస్‌కు చేరినా లంక జ‌ట్టు త‌మ మ్యాచ్‌ను సొంత మైదానంలో ఆడే వీలు లేదు. వారు భార‌త్‌లో మ్యాచ్‌ను ఆడాల్సిందే. ఇలా వారికి ఈ టోర్నీ షెడ్యూల్ న‌ష్టం క‌లిగిస్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అయితే ఐసీసీ మాత్రం ఇలా క‌చ్చితంగా నిర్ణ‌యించాల్సిందేన‌ని, లేదంటే ప్లేయ‌ర్ల త‌ర‌లింపు, వ‌స‌తి, మ్యాచ్‌ల షెడ్యూల్‌, నిర్వ‌హ‌ణ వీలు కాద‌ని చెబుతోంది. ఇక ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో సూప‌ర్ 8లో భార‌త్ ఉన్న గ్రూప్‌లో మాత్రం పోరు ర‌స‌వ‌త్తరంగా మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement