త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | పాక్ డిమాండ్ల‌కు అంగీక‌రించ‌ని ఐసీసీ..? వెన‌క్కి త‌గ్గ‌నున్న పీసీబీ..?

T20 World Cup 2026 | టీ20 వ‌రల్డ్ క‌ప్‌లో భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌ను బ‌హిష్క‌రించ‌డంపై పాకిస్థాన్ వెన‌క్కి త‌గ్గేలా క‌నిపిస్తోంది. పాకిస్థాన్ స్థానిక ఆంగ్ల ప‌త్రిక డాన్ క‌థ‌నం ప్ర‌కారం, భార‌త్ తో మ్యాచ్‌ను పాకిస్థాన్ ఆడబోతుంద‌ని, దీనిపై ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నున్నాయ‌ని తెలుస్తోంది.

S

Cricket | Published On Feb 9, 2026, 1.08 pm IST

T20 World Cup 2026 | పాక్ డిమాండ్ల‌కు అంగీక‌రించ‌ని ఐసీసీ..? వెన‌క్కి త‌గ్గ‌నున్న పీసీబీ..?
Advertisement

T20 World Cup 2026 | టీ20 వ‌రల్డ్ క‌ప్‌లో భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌ను బ‌హిష్క‌రించ‌డంపై పాకిస్థాన్ వెన‌క్కి త‌గ్గేలా క‌నిపిస్తోంది. పాకిస్థాన్ స్థానిక ఆంగ్ల ప‌త్రిక డాన్ క‌థ‌నం ప్ర‌కారం, భార‌త్ తో మ్యాచ్‌ను పాకిస్థాన్ ఆడబోతుంద‌ని, దీనిపై ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నున్నాయ‌ని తెలుస్తోంది. భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు పాక్ తెలిపిన నేప‌థ్యంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై పాకిస్థాన్ లోని లాహార్‌లో ఆదివారం సాయంత్రం 4 గంట‌ల పాటు ఐసీసీ, బీసీబీ, పీసీబీ స‌భ్యుల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఐసీసీ ఎదుట పీసీబీ మూడు డిమాండ్ల‌ను ఉంచిన‌ట్లు తెలిసింది.

బంగ్లాదేశ్‌కు లాభాల్లో వాటా..?

ఐసీసీ ఇకపై నిర్వ‌హించే అన్ని టోర్నీల‌కు త‌మ‌కు కూడా హోస్టింగ్‌, బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ ఇవ్వాల‌ని, టోర్నీల‌లో పాకిస్థాన్ రెవెన్యూ షేర్ పెంచాల‌ని, టీ20 వ‌రల్డ్ క‌ప్ 2026 నుంచి తొల‌గించ‌బ‌డిన బంగ్లాదేశ్‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని, భార‌త్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ను నిర్వ‌హించేలా చూడ‌డంతోపాటు నో హ్యాండ్ షేక్ పాల‌సీ అనే విధానాన్ని తొల‌గించాల‌ని.. ఐసీసీని పీసీబీ డిమాండ్ చేసిన‌ట్లు తెలిసింది. అయితే వీటిపై ఐసీసీ ఇంకా అధికారికంగా స్పందించ‌లేదు. కానీ బంగ్లాదేష్‌కు మాత్రం ఈ విష‌యంలో వంద శాతం న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. న‌ష్ట ప‌రిహారం కాకుండా ఈ వ‌రల్డ్ క‌ప్ నిర్వ‌హ‌ణ‌లో వ‌చ్చే లాభాల్లో బంగ్లాదేశ్ వాటాను వారికే ఇస్తామని, ముందుగా నిర్దేశించిన ప్ర‌కారం పూర్తి వాటాను బంగ్లాదేశ్‌కు ఇస్తామ‌ని ఐసీసీ హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అయితే దీనిపై ఐసీసీ అధికారికంగా స్పందించాల్సి ఉన్నా, డాన్ క‌థ‌నం మాత్రం ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది.

స‌మ‌స్య కొలిక్కి వ‌చ్చిన‌ట్లే..?

అయితే బంగ్లాదేశ్ కు జ‌రిగే నష్టం విష‌యంలో ప‌రిహారం ఇవ్వ‌డం మిన‌హా పీసీబీ చేసిన ఇత‌ర‌ ఏ డిమాండ్లకు కూడా ఐసీసీ అంగీక‌రించ‌లేద‌ని తెలుస్తోంది. తాము ఆయా డిమాండ్ల విష‌యంలో అంగీక‌రించ‌లేమ‌ని పీసీబీకి ఐసీసీ స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. అయితే ఈ విష‌యంపై ఐసీసీ డిప్యూటీ చెయిర్ ఇమ్రాన్ ఖ‌వాజా స్పందిస్తూ పీసీబీకి ప‌లు సూచ‌న‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. భార‌త్‌తో మ్యాచ్ బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యాన్ని విర‌మించుకుని మ్యాచ్‌ను ఆడాల‌ని ఖ‌వాజా చెప్పిన‌ట్లు స‌మాచారం. ఆ త‌రువాత మిగిలిన అన్ని విష‌యాల‌ను ఐసీసీ బోర్డు మీటింగ్‌లలో చ‌ర్చించి లేదా ఐసీసీ ఆర్బిట్రేష‌న్ క‌మిటీలో ఫిర్యాదు చేసి ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ని ఖ‌వాజా పీసీబీకి సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో పీసీబీ కూడా ఖవాజా సూచ‌న‌ను ఆల‌కించింద‌ని, ఆయ‌న సూచ‌న‌ల మేర‌కు భార‌త్‌తో మ్యాచ్ బహిష్క‌ర‌ణ నిర్ణ‌యాన్ని పాక్ వెన‌క్కి తీసుకుంటుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ విష‌యాల‌పై పీసీబీ లేదా ఐసీసీ ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు. కానీ స‌మ‌స్య ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లేన‌ని తెలుస్తోంది. బంగ్లాదేశ్‌కు న‌ష్ట ప‌రిహారం ఇప్పించే విషయంపై పీసీబీ ఈ అంశంలో కాస్త విజ‌యం సాధించింద‌ని, క‌నుక ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను త‌రువాత నెమ్మ‌దిగా పరిష్క‌రించుకోవచ్చ‌ని పీసీబీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో భార‌త్-పాక్ మ్యాచ్ 100 శాతం జ‌రుగుతుంద‌ని, ఇక మ్యాచ్‌కు ఎలాంటి అవాంత‌రాలు లేన‌ట్లే అని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement