త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | ఇంగ్లండ్‌, పాక్ మ్యాచ్‌.. స్టాండ్స్‌లో ఫ్యాన్స్‌ మ‌ధ్య గొడ‌వ‌.. వీడియో..

T20 World Cup 2026 | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 సూప‌ర్ 8 ద‌శ‌లో భాగంగా శ్రీ‌లంక‌లోని ప‌ల్లెకెలె ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, పాకిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డగా ఆట చివరి వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగింది. ఇంగ్లండ్ కెప్టెన్ హారీ బ్రూక్ అద్భుత‌మైన సెంచ‌రీతో జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది.

S

Cricket | Published On Feb 25, 2026, 11.09 am IST

T20 World Cup 2026 | ఇంగ్లండ్‌, పాక్ మ్యాచ్‌.. స్టాండ్స్‌లో ఫ్యాన్స్‌ మ‌ధ్య గొడ‌వ‌.. వీడియో..
Advertisement

T20 World Cup 2026 | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 సూప‌ర్ 8 ద‌శ‌లో భాగంగా శ్రీ‌లంక‌లోని ప‌ల్లెకెలె ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, పాకిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డగా ఆట చివరి వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగింది. ఇంగ్లండ్ కెప్టెన్ హారీ బ్రూక్ అద్భుత‌మైన సెంచ‌రీతో జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. ల‌క్ష్య ఛేద‌న‌లో ఓ ద‌శ‌లో ఇంగ్లండ్ 58/4 ఉన్న‌ప్ప‌టికీ బ్రూక్ 51 బంతుల్లో 100 ప‌రుగులు సాధించి జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. మ‌రో 5 బంతులు మిగిలి ఉండ‌గానే పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. అయితే మ్యాచ్ సంద‌ర్భంగా స్టాండ్స్‌లో ఇరు దేశాల‌కు చెందిన ఫ్యాన్స్ మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌కు చెందిన ఇద్ద‌రు ఫ్యాన్స్ గొడ‌వ‌ప‌డ్డారు.

మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇంగ్లండ్ ఫ్యాన్‌, పాకిస్థాన్ ఫ్యాన్ మాట‌ల యుద్దానికి దిగారు. ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు ప‌ర‌స్ప‌ర‌ దాడికి సిద్ధ‌మ‌య్యారు. కానీ అంత‌లోనే శ్రీ‌లంక ఫ్యాన్స్ ఆ ఇద్ద‌రినీ విడదీశారు. దీంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డంతో సెమీ ఫైన‌ల్ బెర్తును ఖాయం చేసుకున్న ఇంగ్లండ్ త‌న త‌దుప‌రి మ్యాచ్‌ను ఈ నెల 27న కొలంబోలో న్యూజిలాండ్‌తో ఆడ‌నుంది. మరోవైపు మ్యాచ్‌లో ఓట‌మి పాలైన పాక్ కు సెమీస్ అవ‌కాశాలు క్లిష్టంగా మారాయి. శ్రీ‌లంక త‌మ త‌దుప‌రి రెండు మ్యాచ్‌ల‌లో ఒక దాంట్లో ఓట‌మి పాల‌వ‌డం లేదా న్యూజిలాండ్ అయినా ఒక మ్యాచ్‌లో ఓడిపోతేనే పాక్‌కు సెమీస్ చాన్స్ ఉంటుంది. అప్పుడైనా స‌రే పాక్ ర‌న్ రేట్ మెరుగ్గా ఉండాలి. లేదంటే టోర్నీ నుంచి నిష్క్ర‌మ‌ణ త‌ప్ప‌దు. ఇక పాకిస్థాన్ త‌మ త‌రువాతి మ్యాచ్‌ను ఈ నెల 28న ప‌ల్లెకెలెలో శ్రీ‌లంక‌తో ఆడ‌నుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement