త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dope Tests | చిక్కుల్లో య‌శ‌స్వీ జైస్వాల్‌, షెఫాలీ వ‌ర్మ‌.. నోటీసులు జారీ చేసిన నాడా..!

Dope Tests | భార‌త క్రికెట్ డోప్ టెస్టుల అంశం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. యువ ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్‌తో పాటు వుమెన్స్ క్రికెట‌ర్ షెఫాలీ వ‌ర్మ‌కు జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) నోటీసులు జారీ చేసింది.

P

Sports | Published On May 9, 2026, 4.27 pm IST

Dope Tests | చిక్కుల్లో య‌శ‌స్వీ జైస్వాల్‌, షెఫాలీ వ‌ర్మ‌.. నోటీసులు జారీ చేసిన నాడా..!
Advertisement

Dope Tests | భార‌త క్రికెట్ డోప్ టెస్టుల అంశం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. యువ ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్‌తో పాటు వుమెన్స్ క్రికెట‌ర్ షెఫాలీ వ‌ర్మ‌కు జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) నోటీసులు జారీ చేసింది. డోప్ టెస్టుకు హాజరుకాకపోవడం, నిర్దేశించిన ప్రదేశంలో అందుబాటులో లేకపోవడం త‌దిత‌ర కార‌ణాల‌తో ఇద్ద‌రిపై ‘వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్’ కింద తొలి మిస్డ్ టెస్ట్ నమోదు చేసింది. అయితే, ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు ఇద్దరు క్రికెటర్లకు అవకాశం ఇచ్చింది. వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్ నిబంధనల ప్రకారం.. 12 నెలల వ్యవధిలో మూడు సార్లు డోప్ టెస్టులు మిస్ అయితే యాంటీ డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించిన‌ట్లుగా ప‌రిగ‌ణిస్తారు. విచార‌ణ స‌మ‌యంలో నిర్దోషిగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేక‌పోతే రెండేళ్ల వ‌ర‌కు నిషేధం విధించే అవ‌కాశం ఉంటుంది.

గత ఏడాది డిసెంబర్‌లో యశస్వీకి డోప్ టెస్ట్

యశస్వీ జైస్వాల్, షెఫాలీ వర్మ ఇద్దరూ నాడా నిర్వహించే రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (RTP)లో ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న ప్లేయ‌ర్లు అంతా రోజులో ఓ నిర్దిష్ట సమయం, ప్రదేశాన్ని ముందుగానే నాడాకు తెలియ‌జేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో డోప్ కంట్రోల్ అధికారి (DCO) ఎప్పుడైనా అక్కడికి వెళ్లి నమూనాలు సేక‌రిస్తుంటారు. నాడా నోటీసుల ప్ర‌కారం.. గత ఏడాది డిసెంబర్ 17న యశస్వీ జైస్వాల్ డోప్ టెస్టు కోసం అధికారులు వెళ్లగా అక్క‌డ అందుబాటులో లేడు. అలాగే, న‌వంబ‌ర్ 7న షెఫాలీ వ‌ర్మ సైతం నిర్దేశించిన ప్ర‌దేశంలో అందుబాటులో లేన‌ట్లుగా అధికారులు గుర్తించారు. ఈ అంశంపై ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వివ‌ర‌ణ కోరుతూ నాడా నోటీసులు పంపింది. అయితే, స‌మాధానం రాలేద‌ని నాడా పేర్కొంటూ.. ఈ మేర‌కు తొలి మిస్ టెస్ట్‌ను న‌మోదు చేసుకుంది.

బీసీసీఐ, ఐసీసీకి సమాచారం..

ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి కూడా నాడా స‌మాచారం అందించింది. ప్రస్తుతం ఇద్దరు క్రికెటర్లకు వివ‌ర‌ణ ఇచ్చేందుకు ఏడురోజుల గ‌డువు ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో యశస్వీ, షెఫాలీ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప‌రిస్థితి ఎదురైంది. మరో రెండు మిస్డ్ టెస్టులు నమోదైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ప్ర‌స్తుతం నాడా ఆర్‌టీపీ జాబితాలో అభిషేక్ శ‌ర్మ‌, అక్ష‌ర్ ప‌టేల్‌, శుభ్‌మ‌న్ గిల్‌, హార్దిక్ పాండ్యా, జ‌స్‌ప్రీత్ బుమ్రా, రిష‌బ్ పంత్‌, కేఎల్ రాహుల్‌, అర్ష‌దీప్ సింగ్‌, తిల‌క్ వ‌ర్మ‌, దీప్తి శ‌ర్మ‌, రేణుక సింగ్ ఠాకూర్‌తో పాటు ప‌లువురు ఉన్నారు.

Advertisement
Advertisement