T20 World Cup | ఆడితే భారత్‌లోనే ఆడాలి..! లేకుంటే టోర్నీ నుంచి వైదొలగాలి..!
T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ భాగస్వామ్యంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. భారత్‌లో ఆడబోమని, తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని డిమాండ్ చేస్తూ వస్తున్నది. ఆ దేశానికి ఐసీసీ ప్రతినిధులు చేరుకొని బీసీబీని ఒప్పించేందుకు ప్రయత్నించింది.
- బంగ్లాదేశ్ బోర్డుకు ఐసీసీ అల్టిమేటం
- వివాదంలోకి దూరిన పాకిస్తాన్ బోర్డు
- బంగ్లాదేశ్ బోర్డుకు హామీ ఇచ్చిన పీసీబీ
- గతంలో ఆసియా కప్ సమయంలోనూ ఇదే పని చేసిన పాక్ బోర్డు
T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ భాగస్వామ్యంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. భారత్‌లో ఆడబోమని, తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని డిమాండ్ చేస్తూ వస్తున్నది. ఆ దేశానికి ఐసీసీ ప్రతినిధులు చేరుకొని బీసీబీని ఒప్పించేందుకు ప్రయత్నించింది. అయినా, వెనక్కి తగ్గకుండా ఐర్లాండ్‌తో గ్రూప్‌ను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. తాజాగా బంగ్లాదేశ్ బోర్డుకు ఐసీసీ అల్టిమేటం జారీ చేసింది. ఆడితే భారత్‌లోనే ఆడాలని.. లేకపోతే ఆ జట్టు స్థానంలో మరో జట్టును తీసుకుంటామని హెచ్చరించింది. నిర్ణయాన్ని తెలిపేందుకు జనవరి 21 వరకు ఇచ్చినట్లుగా ఓ నివేదిక తెలిపింది. బీసీబీకి అనుకూలంగా నిర్ణయం లేకపోవడంతో ఆ దేశం పాక్ సహాయం కోరింది.
అదే వితండవాదం..
గతవారం రోజులుగా బంగ్లాదేశ్ బోర్డుతో ఐసీసీ రెండు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది. తాము ప్రపంచకప్‌లో ఆడాలనుకుంటున్నామని.. భారత్‌లో మాత్రం కాదని బీసీబీ అదే మొండి వైఖరిని కొనసాగించింది. శ్రీలంకలో మ్యాచులు నిర్వహించాలని కోరగా.. షెడ్యూల్, గ్రూప్ మార్పులను మార్చేందుకు ఐసీసీ నిరాకరించింది. ఆటగాళ్ల భద్రతను కారణంగా బీసీబీ వితండవాదం చేస్తూ వస్తోంది. అయితే, ఈ వాదనలను అంతర్జాతీయ క్రికెట్ కమిటీ తోసిపుచ్చుతోంది. ప్రస్తుత షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని, బంగ్లాదేశ్ గ్రూప్-సీలోనే ఆడాలని స్పష్టం చేసింది. ఆటగాళ్లకు ఎలాంటి భద్రతా పరమైన ముప్పులేదని తెలిపింది. ఆందోళన మేరకు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటామని భరోసా ఇచ్చింది.
బంగ్లా నిరాకరిస్తే స్కాట్లాండ్‌కు ఛాన్స్..
షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ మ్యాచులన్నీ భారత్‌లోనే ఆడాల్సి ఉంది. ఆ జట్టు లీగ్ మ్యాచులను బంగ్లాదేశ్, ముంబయిలో ఉండుతుంది. ఫిబ్రవరి 7న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ జరుగాల్సి ఉంది. ఆ తర్వాత మరో రెండు మ్యాచులు, చివరగా ముంబయిలో లీగ్ మ్యాచ్ ఆడుతుంది. ఐర్లాండ్ మ్యాచులు శ్రీలంకలో ఉన్నందున బంగ్లాదేశ్‌ను గ్రూప్-బీలోకి మార్చాలని బీసీబీ కోరింది. అయితే, ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తే ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌ను ఎంపిక చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బీసీబీ తుది నిర్ణయం కోసం ఐసీసీ ఎదురుచూస్తోంది.
వివాదం మధ్యలోకి దూరిన పాక్..
బంగ్లాదేశ్‌కు ఐసీసీ నుంచి ఎలాంటి ఊరట కలుగకపోవడంతో ఆ దేశం పాక్ సహాయం కోరింది. టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనడానికి మద్దతు కోరుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం పాకిస్తాన్ అధికారులను సంప్రదించగా.. సానుకూలంగా స్పందించినట్లు మరో నివేదిక తెలిపింది. బంగ్లా బోర్డు ఆందోళనను పరిష్కరించకపోతే పాక్ ఆడే విషయాన్ని పునః పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. పరిస్థితి మరింత త్రీవంగా మారుతోందని.. టోర్నీ సన్నాహాలను ప్రభావితం చేస్తుందని పాక్ బోర్డు వర్గాలు తెలిపినట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆ దేశంపై ఒత్తిడి చేయకూడదనేది పాక్ వైఖరి, ఈ విషయంలో బంగ్లాదేశ్‌కు మద్దతు తెలిపింది. ఆసియా కప్ సమయంలోనూ పాక్ ఇలాంటి పనే చేసింది. ఆ తర్వాత సిగ్గులేకుండా టోర్నీలో ఆడింది. మూడు మ్యాచుల్లో ఘోరంగా ఓటమిపాలైంది. మళ్లీ బంగ్లాను మోసం చేసి.. పాక్ టోర్నీలో ఆడినా ఆశ్చర్యపోనవసరం లేదు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






