T20 WC | ముంబయి సిద్ధి వినాయకుడి సేవలో టీమిండియా క్రికెటర్లు..!
T20 WC | ముంబయి వాంఖడే స్టేడియంలో గురువారం ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌లో టీమిండియా తలపడనున్నది. ఈ కీలక నాకౌట్ మ్యాచ్‌కు ముందు టీమిండియా క్రికెటర్లు బుధవారం ముంబయి సిద్ధివినాయక మందిరాన్ని సందర్శించారు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ వినాయకుడిని దర్శించుకున్నారు.
T20 WC | ముంబయి వాంఖడే స్టేడియంలో గురువారం ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌లో టీమిండియా తలపడనున్నది. ఈ కీలక నాకౌట్ మ్యాచ్‌కు ముందు టీమిండియా క్రికెటర్లు బుధవారం ముంబయి సిద్ధివినాయక మందిరాన్ని సందర్శించారు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా క్రికెటర్లకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారి దర్శనాలు చేయించారు. అనంతరం వారిని సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
ఈ టీ20ప్రపంచకకప్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో సున్నా స్కోర్‌కే వెనుదిరిగిన అభిషేక్ శర్మ దక్షిణాఫ్రికాపై 15 పరుగులు చేశాడు. ఆ తర్వాత జింబాబ్వేపై 55, వెస్టిండీస్‌పై పది పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నాకౌట్ మ్యాచ్‌లోనైనా రాణిస్తాడని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరో వైపు నమీడియా, పాక్‌లపై హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్ జింబాబ్వేతో మ్యాచ్‌లో 38 పరుగులు చేశాడు. సెమీస్‌లోనైనా భారీ ఇన్నింగ్స్‌ను టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అక్షర్ పటేల్ సైతం పెద్దగా రాణించలేకపోయాడు. దాంతో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌తో రాణిస్తాడనే అంచనాలున్నాయి.
భారత్ గ్రూప్ దశలో అమెరికా, నబీమియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై వరుస విజయాలతో సూపర్-8లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో 76 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత జింబాబ్వేను 72 పరుగుల తేడాతో, వెస్టిండీస్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో ఈ నెల 5న (గురువారం) ఇంగ్లండ్‌తో తలపడనున్నది. ఈ మ్యాచ్‌లో గెలిచి మరోసారి ఫైనల్‌కు అర్హత సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also :
Sanju Samson | సంజు శాంసన్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారా..? ఐసీసీ రూల్స్ ఏమంటున్నాయి..?
MS Dhoni | ఓవర్ స్పీడ్.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌కు ట్రాఫిక్ చాలాన్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






