FIFA 2026 | తుది అంకానికి చేరిన గ్రూప్ రౌండ్.. నాకౌట్‌కు అర్హత సాధించిన 28 జట్లు.. మిగిలింది నాలుగు బెర్తులే..!
FIFA 2026 | ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ రౌండ్ చివరి దశకు చేరుకుంది. 48 జట్లతో ప్రారంభమైన ఈ ప్రపంచకప్‌లో కొత్త ఫార్మాట్ కారణంగా పోటీ మరింత ఉత్కంఠంగా మారింది. ఇప్పటివరకు మొత్తం 28 జట్లు నాకౌట్ దశ (రౌండ్ ఆఫ్ 32)కు అర్హత సాధించగా, మిగిలిన నాలుగు స్థానాల కోసం పలు జట్లు పోటీపడుతుండడంతో ఆసక్తిని పెంచుతోంది.
FIFA 2026 | ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ రౌండ్ చివరి దశకు చేరుకుంది. 48 జట్లతో ప్రారంభమైన ఈ ప్రపంచకప్‌లో కొత్త ఫార్మాట్ కారణంగా పోటీ మరింత ఉత్కంఠంగా మారింది. ఇప్పటివరకు మొత్తం 28 జట్లు నాకౌట్ దశ (రౌండ్ ఆఫ్ 32)కు అర్హత సాధించగా, మిగిలిన నాలుగు స్థానాల కోసం పలు జట్లు పోటీపడుతుండడంతో ఆసక్తిని పెంచుతోంది. ఈసారి తొలిసారిగా 32 జట్లతో రౌండ్ ఆఫ్ 32 నిర్వహిస్తున్నారు. గ్రూప్ దశ తర్వాత నేరుగా 16 జట్లకు కాకుండా అదనంగా నాకౌట్ రౌండ్ ఉండటం టోర్నమెంట్‌లో మ్యాచుల సంఖ్య పెరిగింది. కొత్త ఫార్మాట్‌లో 48 జట్లను 12 గ్రూపులుగా ఏ నుంచి ఎల్ వరకు విభజించారు. ప్రతి గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయి. ఇందులో ప్రతి జట్టు మూడు మ్యాచులు ఆడుతుంది. 12 జట్లు గ్రూప్‌లో విన్నర్‌గా నిలువనుండగా.. మరో 12 జట్లు రన్నరప్‌గా తర్వాతి రౌండ్‌కు వెళ్తాయి. అలాగే, ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మూడోస్థానంలోని ఎనిమిది జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. మూడోస్థానంలో నిలిచిన ప్రతి జట్టు తర్వాతి రౌండ్‌కు వెళ్లదు. కేవలం ఎనిమిది జట్లు మాత్రమే నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. మిగతా నాలుగు జట్లు ఇంటిబాటపడుతాయి.
ఇప్పటి వరకు నాకౌట్‌కు చేరిన జట్లు ఇవే..
గ్రూప్ ఏ నుంచి మెక్సికో, సౌతాఫ్రికా నాకౌట్‌కు అర్హత సాధించాయి. నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా మెక్సికో ఘనత సాధించింది. అలాగే, దక్షిణాఫ్రికా సైతం చరిత్రలో తొలిసారిగా నాకౌట్ స్టేజీకి చేరడం విశేషం. గ్రూప్ బీ నుంచి స్విట్జర్లాండ్, కెనడా, బోస్నియా (మూడోస్థానం), గ్రూప్ సీ నుంచి బ్రెజిల్, మొరాకో, గ్రూప్ డీ నుంచి యూఎస్ఏ, ఆస్ట్రేలియా, పరాగ్వే (మూడోస్థానం), గ్రూప్ ఈ నుంచి జర్మనీ, ఐవరీ కోస్ట్, ఈక్వెడార్ (మూడోస్థానం) రౌండ్ ఆఫ్ 32లోకి ప్రవేశించాయి. గ్రూప్ ఎఫ్ నుంచి నెదర్లాండ్స్, జపాన్, స్వీడన్ (మూడోస్థానం), గ్రూప్ జీ నుంచి బెల్జియం, ఈజిప్ట్ తర్వాతి రౌండ్‌లోకి వెళ్లాయి. అయితే, ఈజిప్ట్ తొలిసారిగా వరల్డ్ కప్ నాకౌట్‌కు చేరడం చరిత్రలో తొలిసారి. గ్రూప్ హెచ్ నుంచి స్పెయిన్, కేప్ వెర్డే నాకౌట్‌లోకి దూసుకెళ్లాయి. కేప్‌వెర్డే తొలిసారి నాకౌట్‌కు చేరడమే కాకుండా.. ప్రపంచకప్ చరిత్రలో నాకౌట్‌కు అర్హత సాధించిన అతిచిన్న దేశంగా రికార్డులకెక్కింది. గ్రూప్ ఐ నుంచి ఫ్రాన్స్, నార్వే, సెనెగల్ (మూడో స్థానం), గ్రూప్ జే నుంచి అర్జెంటినా మాత్రమే అర్హత సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ మాత్రమే తర్వాతి రౌండర్‌కు వెళ్లగా.. ఆస్ట్రియా, అల్జెరియా తర్వాతి స్థానాల కోసం పోటీపడుతున్నాయి. జోర్డాన్ ఇప్పటికే ఇంటిబాటపట్టింది. ఇక గ్రూప్ కేలో కొలంబియా, పోర్చుగల్ అర్హత సాధించగా.. గ్రూప్ ఎల్ నుంచి ఇంగ్లండ్, ఘనా నాకౌట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి.
ఇప్పటి వరకు అర్హత సాధించిన జట్లు ఇవే..
మెక్సికో, దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్, కెనడా, బోస్నియా అండ్ హెర్జెగోవినా, బ్రెజిల్, మొరాకో, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, పరాగ్వే, జర్మనీ, ఐవరీ కోస్ట్, ఈక్వడార్, నెదర్లాండ్స్, జపాన్, స్వీడన్, బెల్జియం, ఈజిప్ట్, స్పెయిన్, కేప్ వెర్డే, ఫ్రాన్స్, నార్వే, సెనెగల్, అర్జెంటీనా, కొలంబియా, పోర్చుగల్, ఇంగ్లాండ్, ఘనా నాకౌట్‌కు అర్హత సాధించాయి. రౌండ్ ఆఫ్ 32లోకి ఇంకా నాలుగు జట్లు అర్హత సాధించాల్సి ఉంది. ఆదివారం జరిగే మ్యాచుల తర్వాత రౌండ్ ఆఫ్ 32 ఫిగర్ క్లారిటీ రానుంది. గ్రూప్ జే, కే, ఎల్‌లో కీలక మ్యాచులు జరుగన్నాయి. గ్రూప్ దశ ముగింపు దశకు చేరుతున్న కొద్దీ ప్రపంచకప్ ఉత్కంఠ మరింత పెరుగుతోంది. చివరి నాలుగు టికెట్లు ఎవరు దక్కించుకుంటారన్నదే ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తర్వాతి రౌండ్స్ ఇలా..
రౌండ్ ఆఫ్ 32 : జూన్ 28 నుంచి జూలై 3 వరకు..
రౌండ్ ఆఫ్ 16: జూలై 4 నుంచి 7 వరకు..
క్వార్టర్ ఫైనల్స్: జూలై 9 నుంచి 11 వరకు
సెమీ ఫైనల్స్: జూలై 14 నుంచి 15 వరకు..
మూడో స్థానం కోసం మ్యాచ్ : జూలై 18న జరుగుంది.
ఫైనల్: జూలై 19న న్యూ జెర్సీ వేదికగా జరుగుతుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Dhruv Rathee Tweet on Modi | మొదటిసారి నా మాట విన్నారు.. ప్రధాని జాబ్ వదిలేసి 'వ్లాగర్' అవ్వండి: మోదీపై ధ్రువ్ రాథీ సెటైర్లు
- ●Kavitha | మహిళా బిల్లు తేకపోతే ఓట్లేయమని చెప్పాలి.. ఆ ట్రెండ్ తేవాలి
- ●RS Praveen Kumar | రేవంత్ రెడ్డి నన్ను చంపినా భయపడను.. తేల్చిచెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●RS Praveen Kumar | నన్ను జైలుకు పంపించినా సరే.. రేవంత్ కుంభకోణాలను వదలను : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Anasuya | ఏడాది గ్యాప్ తర్వాత కొత్త సినిమా సైన్ చేసిన అనసూయ.. సూపర్ హిట్ సీక్వెల్లో...
- ●PM Modi Seychelles Visit | 194 ఏళ్ల వయసు.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవి 'జొనాథన్'ను కలిసిన ప్రధాని మోదీ

Dhruv Rathee Tweet on Modi | మొదటిసారి నా మాట విన్నారు.. ప్రధాని జాబ్ వదిలేసి 'వ్లాగర్' అవ్వండి: మోదీపై ధ్రువ్ రాథీ సెటైర్లు

Kavitha | మహిళా బిల్లు తేకపోతే ఓట్లేయమని చెప్పాలి.. ఆ ట్రెండ్ తేవాలి

RS Praveen Kumar | రేవంత్ రెడ్డి నన్ను చంపినా భయపడను.. తేల్చిచెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar | నన్ను జైలుకు పంపించినా సరే.. రేవంత్ కుంభకోణాలను వదలను : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్






