RS Praveen Kumar | నన్ను జైలుకు పంపించినా సరే.. రేవంత్ కుంభకోణాలను వదలను : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | నన్ను జైలుకు పంపించినా సరే.. రేవంత్ సర్కార్‌లో చోటు చేసుకుంటున్న కుంభకోణాలను బయట పెడుతూనే ఉంటానని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి వద్ద ఉన్న విద్యాశాఖలో రూ. 2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, అందుకు సంబంధించిన ఆధారాలను బయటపెడుతున్నానని ఆయన తెలిపారు.
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్ : నన్ను జైలుకు పంపించినా సరే.. రేవంత్ సర్కార్‌లో చోటు చేసుకుంటున్న కుంభకోణాలను బయట పెడుతూనే ఉంటానని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి వద్ద ఉన్న విద్యాశాఖలో రూ. 2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, అందుకు సంబంధించిన ఆధారాలను బయటపెడుతున్నానని ఆయన తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో రూ. 2 వేల కోట్ల గురుకుల కుంభకోణం జరుగుతోంది.. కానీ కుంభకోణం లేదు.. రూ. 687 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చామని సీఎం అంటున్నారు. మతి లేకుండా హరీశ్‌రావు, ప్రవీణ్ మాట్లాడుతున్నారని ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, అజహారుద్దీన్‌కు స్క్రిప్టు ఇచ్చి మాపై మాట్లాడించారు. బీఆర్ఎస్ వాళ్లకు ఇష్టం లేదని, పిల్లలకు వస్తువులు అందిస్తుంటే కక్ష కట్టి రానివ్వట్లేదని దుమ్మెత్తి పోశారు. ఈ క్రమంలో నిజాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఇది అంగీకరించాల్సిన విషయం
ఇంటర్ తరగతులు ప్రారంభమై 25 రోజులు, పాఠశాలలు ప్రారంభమై 10 రోజులు అవుతుంది. ఇప్పటికీ యూనిఫాం, పీటీ డ్రెస్సులు, బెడ్ షీట్స్, టవల్స్, ట్రంక్ బాక్సులు ఇప్పటికీ రాలేదు. ఇప్పటికీ చాలా జిల్లాల్లో పప్పు దినుసులు, ఉప్పు, కారం, నూనె కాంట్రాక్టులు జరుగుతున్నాయి. ఈ కాంట్రాక్టుల్లో ఎన్నో వివాదాలు జరుగుతున్నాయి. కేసీఆర్ హయాంలో ఇలాంటి ఘటనలు జరగలేదు. రేవంత్ రెడ్డి ఏమన్న పర్వాలేదు.. ఎంత ఇబ్బంది పెట్టినా పర్వాలేదు. ఆ సమయంలో నేను అధికారిని. మార్చి నెల నుంచే కసరత్తు మొదలు పెట్టేవాళ్లం. మీరు ఇప్పటికీ స్పష్టమైన అవగాహనకు రాలేకపోతున్నారు. ఇది అంగీకరించాల్సిన విషయం అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
ఈ ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వండి
తెలంగాణలో ఇప్పటికీ 15 మంత్రులు ఉన్నారు. సీఎంకు రెక్వెస్ట్ ఏంటంటే.. మఫత్ లాల్, రమేష్ జైన్, నిరంజన్ జైన్‌లను రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలోకి తీసుకోవాలి. మీకు ప్రాణాలు చల్లగా ఉంటాయి. మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెడుతారు. ముందరపెట్టి వీళ్లతోని గూడుపుఠాణీ కార్యక్రమం చేయడం కన్నా ఈ ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వండి అయిపోతది. దేశమంతా తిరిగి డబ్బులు తీసుకువస్తారు. మీకు మూటలు ఇస్తారని ఆర్ఎస్పీ తెలిపారు.
లాభం జరిగే ఫైళ్లపై నేరుగా సీఎం సంతకం
బడ్జెట్‌లో రేవంత్ రెడ్డికి ఎన్ని నిధులు పోతున్నాయో పెట్టండి. ఫైల్స్ సంబంధిత శాఖా మంత్రుల వద్దకు వెళ్లడం లేదు. మూటలు మోయడానికి ఇన్ని గన్నీ బ్యాగులు కావాలని పెట్టండి. ఇవన్నీ దోచుకునే పథకం ఉంది అని మల్లు భట్టి విక్రమార్కతో బడ్జెట్‌లో పెట్టించండి. స్టార్ హోటల్స్‌లో జీవోలు తయారవుతున్నాయి. సంబంధిత మంత్రులకు సంబంధం లేకుండా జీవోలు వస్తున్నాయి. లాభం జరిగే ఫైళ్లపై నేరుగా సీఎం సంతకం చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
ట్రంక్ బాక్సుల పేరుతో పిలల్లకు డ్రగ్స్ సప్లై చేయరని గ్యారెంటీ ఏముంది..?
ట్రంక్ బాక్సులు చింతామణి పార్శ్వనాథ్ కంపెనీకి వచ్చాయి. డ్రగ్స్ నిర్మూలన అని బాకాలు ఊదుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. ట్రంక్ బాక్సుల కాంట్రాక్టు నిరంజన్ జైన్ అనే డ్రగ్స్ సప్లయర్‌కు ఇచ్చారు. ట్రంక్ బాక్సుల పేరుతో పిలల్లకు డ్రగ్స్ సప్లై చేయరని గ్యారెంటీ ఏముంది..? తెలంగాణ చేనేత కార్మికులకు శక్తి లేదని చెప్పి మఫత్ లాల్‌కు ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు. టెస్కో రాజేష్ అగర్వాల్ అనే వ్యక్తికి బట్టల సప్లై కాంట్రాక్టు ఇచ్చింది. విద్యాశాఖలో రూ. 687 కోట్ల టెండర్లు ఇవ్వలేదు.. రూ. 2041 కోట్ల టెండర్లు విద్యాశాఖలో ఇచ్చారు. బంకర్ బెడ్ కుంభకోణం సెపరేట్.. ఇంత వరకు ఒక్క ఐటెం కూడా పిల్లల వద్దకు రాలేదు అని ఆర్ఎస్పీ ధ్వజమెత్తారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో చర్చ చేద్దాం
విద్యాశాఖలో ఎలాంటి అవినీతి జరగలేదని, చర్చకు సిద్ధమని అంటున్నారు కదా..? జులై 2 వ తేదీన ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌కు వస్తాము. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ చర్చకు రావాలి. జులై 2 న క్యాబినెట్ సమావేశం ఉన్నా రద్దు చేసుకుని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రావాలి. ప్రభుత్వ పెద్దలకు జైవీర్ రెడ్డి,రమేష్ జైన్, నిరంజన్ జైన్ గన్నీ బ్యాగుల్లో డబ్బులు పంపుతున్నారు. ఐఏఎస్ అధికారులు గుడ్డిగా జీవోలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నింటిపై విచారణ జరిపిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
తాజావార్తలు
- ●Netflix | ఓటీటీలో ప్రభాస్ డాక్యుమెంటరీ సిరీస్ ట్రెండింగ్ - హాలీవుడ్ సినిమాలను దాటేసి...
- ●Afghanistan Earthquake | ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భారత్, పాకిస్తాన్లలో వణికిన జనం
- ●Kavitha | మహిళా రిజర్వేషన్ల అమలుకు ఢిల్లీలో భారీ సభ నిర్వహిద్దాం : కల్వకుంట్ల కవిత
- ●Allu Sneha Reddy | నిర్మాతగా అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ - జోకర్ మూవీ లాంఛ్ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా స్నేహారెడ్డి
- ●KTR | ఆర్ఎస్పీకి భద్రత తగ్గించడం పూర్తిగా కక్ష సాధింపు చర్యే : కేటీఆర్
- ●TG RERA | తెలంగాణ 'రెరా' చైర్మన్‌గా కేఎస్ శ్రీనివాసరాజు నియామకం

Netflix | ఓటీటీలో ప్రభాస్ డాక్యుమెంటరీ సిరీస్ ట్రెండింగ్ - హాలీవుడ్ సినిమాలను దాటేసి...

Afghanistan Earthquake | ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భారత్, పాకిస్తాన్లలో వణికిన జనం

Kavitha | మహిళా రిజర్వేషన్ల అమలుకు ఢిల్లీలో భారీ సభ నిర్వహిద్దాం : కల్వకుంట్ల కవిత

Allu Sneha Reddy | నిర్మాతగా అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ - జోకర్ మూవీ లాంఛ్ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా స్నేహారెడ్డి





