త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | రేవంత్ రెడ్డి నన్ను చంపినా భ‌య‌ప‌డ‌ను.. తేల్చిచెప్పిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

RS Praveen Kumar | కాంగ్రెస్ స‌ర్కార్ కుంభ‌కోణాలు బ‌య‌ట‌పెడుతున్నందుకు రేవంత్ రెడ్డి నన్ను చంపినా, చంపే ప్ర‌య‌త్నం చేసినా నేను భ‌య‌ప‌డ‌ను.. నా ఆత్మ కూడా ఇదే మాట్లాడుత‌ద‌ని బీఆర్ఎస్ లీడ‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తేల్చిచెప్పారు.

S

Telangana | Published On Jun 27, 2026, 6.50 pm IST

RS Praveen Kumar | రేవంత్ రెడ్డి నన్ను చంపినా భ‌య‌ప‌డ‌ను.. తేల్చిచెప్పిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్
Advertisement

RS Praveen Kumar | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ స‌ర్కార్ కుంభ‌కోణాలు బ‌య‌ట‌పెడుతున్నందుకు రేవంత్ రెడ్డి నన్ను చంపినా, చంపే ప్ర‌య‌త్నం చేసినా నేను భ‌య‌ప‌డ‌ను.. నా ఆత్మ కూడా ఇదే మాట్లాడుత‌ద‌ని బీఆర్ఎస్ లీడ‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తేల్చిచెప్పారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడారు.

నాకు సెక్యూరిటీ తగ్గించారు. నాపై ఇప్పటి వరకు 3 సార్లు హత్యాయత్నం జరిగింది. నేను 26 ఏళ్ళు దేశం కోసం పని చేశాను. టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ హ‌యాంలో ఆఫీస‌ర్‌గా ప‌ని చేశాను. ఏ రోజు కూడా నా భ‌ద్ర‌త‌ను త‌గ్గించ‌లేదు. 2021 జులై 19న స్వ‌చ్ఛందంగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేశాను. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కానిస్టేబుల్స్‌ను త‌గ్గించ‌లేదు. బుల్లెట్ ప్రూఫ్‌ కారు తీసుకుర‌మ్మ‌ని చెప్ప‌లేదు. ఒక్క మాట అన‌లేదు. కానీ ఇవాళ రేవంత్ స‌ర్కార్ బుల్లెట్ ప్రూఫ్ కారు వాప‌స్ తీసుకు ర‌మ్మ‌ని కానిస్టేబుల్‌కు చెప్పారు. మ‌రి రేవంత్ రెడ్డి సోదరుడికి నలుగురు గన్ మెన్స్ ఇచ్చారు. స‌బ్ మెషీన్ గ‌న్స్ వారికి ఇచ్చారు. అజిత్ దోవ‌ల్ లాగా తిరుప‌తి రెడ్డి తెలంగాణ స్టేట్ సెక్యూరిటీ అడ్వైజ‌రా..? వారికి ఉన్న థ్రెట్ నాకు ఎందుకు లేదో హోంమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి అని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు.

ఆయ‌న పొడుగుపై నేను మాట్లాడ‌లేదు

2 వేల కోట్ల కుంభ‌కోణం బ‌య‌పెట్టాను. నేను ఆధారాలతో స‌హా దుర్మార్గాలు బ‌య‌ట పెడుతున్నారు. బండి భగీరథ్‌ అంశంలో సీఎం చేసిన తప్పును బయటపెట్టాను. నేను మాట్లాడే అంశాలకు రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్ ఇస్తానంటే వ‌ద్ద‌న్నాను. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి వద్దు అని చెప్పాను. నా గుండుపై రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.. ఓపిక‌తో స‌మాధానం చెప్పాను. ఆయ‌న పొడుగుపై నేను మాట్లాడ‌లేదు. ఈ గుండు నుంచే చాలా ఆలోచ‌న వ‌స్తున్నాయ‌ని చెప్పాను. కొర‌క‌రాని కొయ్య‌గా త‌యార‌య్యాడ‌ని, వీని ఇట్ల కాదు చ‌నిపోయినా మంచిదే అనుకున్న‌డేమో.. నేను ఏమైనా దందాలు చేస్తున్నా. భూములు గుంజుకుంటున్నానా.. నేను ఓటుకు నోటు కేసులో ఏమైనా దొరికానా..? ఎందుకు కోపం పెంచుకున్నాడో అర్థం కావ‌డం లేదు అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ అన్నారు.

భ‌ద్ర‌త గురించి ఆలోచించ‌ను.. ప్ర‌జ‌ల గొంతుక‌గా ఉంటాను..

భ‌ద్ర‌త గురించి ఆలోచించ‌ను.. ప్ర‌జ‌ల గొంతుక‌గా ఉంటాను. త‌ప్ప‌కుండా కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడుతుంటాం. కాంగ్రెస్ పాల‌న అంత‌మ‌య్యే దాకా మేం త‌ప్ప‌కుండా పోరాడుతూనే ఉంటాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కారు తీసేసినా, గ‌న్‌మెన్ల‌ను తీసేసినా.. రేవంత్ రెడ్డి నన్ను చంపినా, చంపే ప్రయత్నం చేసినా నేను భయపడను నా ఆత్మ కూడా ఇదే మాట్లాడుత‌ది అని ఆయ‌న తేల్చిచెప్పారు.

రాయ‌ల‌సీమ వెళ్లి ఫ్యాక్ష‌నిస్టులో చేరండి..

నాకు రాష్ట్రపతి శౌర్య పతకం వచ్చింది. నా పేరుతో మరో 10 మంది రిటైర్డ్ అధికారులను రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారు. మీరు మాపై క‌క్ష తీర్చుకోవాలంటే రాయ‌ల‌సీమ వెళ్లి ఫ్యాక్ష‌నిస్టులో చేరండి.. తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి అయి ఇదేమీ వ్య‌వ‌హారం అర్థం కావ‌డం లేదు అని ధ్వ‌జ‌మెత్తారు.

రేవంత్ రెడ్డి కుక్క పిల్లలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు

నా భద్రత తగ్గింపుపై డీజీపీకి లెటర్ రాశాను. నా బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కూడా రేవంత్ రెడ్డికే ఇవ్వండి. రేవంత్ రెడ్డి కుక్క పిల్లలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సమకూర్చినా అభ్యంతరం లేదు. అనేక సందర్భాల్లో నాకు ప్రాణహానీపై పోలీసు అధికారులే అధికారికంగా లేఖ‌లు పంపారు. అవి ప్రేమ లేఖలు కాదు. నాకు భద్రత తగ్గించిన ప్రశ్నించ‌డం ఆప‌ను అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement