Lionel Messi | జోర్డాన్‌తో రేపు చివరి లీగ్ మ్యాచ్.. మెస్సీ దూరం..
Lionel Messi | అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్-జేలో జోర్డాన్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. డిఫెండింగ్ చాంపియన్స్ అర్జెంటీనా ఇప్పటికే నాకౌట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని కోచ్ లియోనల్ నిర్ణయం తీసుకున్నారు.
Lionel Messi | అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్-జేలో జోర్డాన్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. డిఫెండింగ్ చాంపియన్స్ అర్జెంటీనా ఇప్పటికే నాకౌట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని కోచ్ లియోనల్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మెస్సీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అల్జీరియా, ఆస్ట్రియాతో జరిగిన మ్యాచుల్లో ఐదు గోల్స్ చేసిన విషయం తెలిసిందే. జట్టు గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలువడంతో కీలక పాత్ర పోషించారు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే అర్జెంటీనా నాకౌట్లోకి ప్రవేశించింది. మ్యాచ్‌కు ముందు మాట్లాడిన స్కలోని, మెస్సీ మ్యాచ్ ప్రారంభంలో బెంచ్‌పై ఉంటారని, అవసరమైతే తర్వాతి భాగంలో మైదానంలోకి దిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. బలమైన జట్టుతో బరిలోకి దిగడం లేదన్న అభిప్రాయాలను స్కలోని తిప్పికొట్టారు.
జట్టులోని ప్రతి ఆటగాడు ప్రపంచ చాంపియన్స్ తరఫున ఆడే అర్హతను సంపాదించుకున్నాడని పేర్కొన్నారు. “రేపు ఆడే ఆటగాళ్లు అంతా అర్హులు. వారు జట్టులో భాగమే. శిక్షణలో మేం చేసిన కఠిన శ్రమ అంతా ఈ ఆటగాళ్ల వల్లే సాధ్యమైంది. మైదానంలో ఆడని సమయంలో కూడా వారు తమ శ్రద్ధను చూపుతున్నారు” అని స్కలోని తెలిపారు. ఆటగాళ్ల మార్పులు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపకూడదన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. “కోచ్‌గా నా లక్ష్యం జట్టు ప్రదర్శన స్థిరంగా ఉండేలా చూడడం. జెర్సీ వేసుకుని మైదానంలోకి దిగితే, మ్యాచ్ పాయింట్ల విలువ ఏదైనా సరే, గెలవాలనే ఆత్మవిశ్వాసంతో ఆడాలి” అని స్పష్టం చేశారు. ఇక జోర్డాన్ జట్టు క్రమశిక్షణతో కూడిన సవాల్ విసరొచ్చని స్కలోని హెచ్చరించారు. టోర్నమెంట్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమితో జోర్డాన్ ఇప్పటికే నిష్క్రమించినా అర్జెంటీనాకు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. డిఫెన్స్ వ్యూహంతో ఐదుగురు డిఫెండర్లను ఉపయోగించే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో ఎటాకింగ్ వ్యూవహాన్ని మార్చుకోవాల్సి రావచ్చని తెలిపారు. విజయంతో గ్రూప్ స్టేజ్‌ని ముగించాలనే లక్ష్యంతో అర్జెంటీనా బరిలోకి దిగుతోంది. అదే సమయంలో జోర్డాన్ చారిత్రక తొలి వరల్డ్ కప్ ప్రయాణాన్ని విక్టరీతో ముగించాలని భావిస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



