త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dhruv Rathee Tweet on Modi | మొదటిసారి నా మాట విన్నారు.. ప్రధాని జాబ్ వదిలేసి ‘వ్లాగర్’ అవ్వండి: మోదీపై ధ్రువ్ రాథీ సెటైర్లు

సీషెల్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీపై ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పీఎం జాబ్ వదిలేసి ఫుల్ టైమ్ ట్రావెల్ వ్లాగర్ అవ్వాలంటూ సెటైర్లు వేశారు.

J

Viral news | Published On Jun 27, 2026, 6.54 pm IST

Dhruv Rathee Tweet on Modi | మొదటిసారి నా మాట విన్నారు.. ప్రధాని జాబ్ వదిలేసి ‘వ్లాగర్’ అవ్వండి: మోదీపై ధ్రువ్ రాథీ సెటైర్లు
Advertisement
  • ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటనపై యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఆసక్తికర వ్యాఖ్యలు
  • అక్కడి భారీ తాబేళ్లతో ఫొటోలు దిగాలంటూ మోదీకి ధ్రువ్ రాథీ వ్యంగ్యంగా సలహా
  • తాజాగా మోదీ తాబేళ్లతో దిగిన ఫొటోలను షేర్ చేయడంతో మరోసారి స్పందించిన ధ్రువ్ రాథీ
  • ప్రధాని పార్ట్ టైమ్ జాబ్ వదిలేసి, ఫుల్ టైమ్ ట్రావెల్ వ్లాగర్ కావాలంటూ ఎక్స్ వేదికగా కౌంటర్

Dhruv Rathee Tweet on Modi | త్రినేత్ర.న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల గురించి ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో.. ధ్రువ్ రాథీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. "మొదటిసారి మోదీజీ నా సలహా విన్నారు" అంటూ ఆయన వ్యంగ్యంగా స్పందించారు.

ట్రావెల్ వ్లాగర్‌కు సలహా ఇస్తున్నా..

అసలేం జరిగిందంటే.. ప్రధాని మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకల్లో (స్వర్ణోత్సవాలు) పాల్గొనేందుకు వెళ్తున్నట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనికి ధ్రువ్ రాథీ స్పందిస్తూ.. "తోటి ట్రావెల్ వ్లాగర్‌గా నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను. అక్కడ ఆల్డబ్రా తాబేళ్లతో (Aldabra tortoises) ఫొటోలు దిగండి.. చాలా సరదాగా ఉంటుంది. మీ వెకేషన్ ఎంజాయ్ చేయండి" అంటూ తాను తాబేలుకు ఆకులు తినిపిస్తున్న ఒక ఫొటోను షేర్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు.

నిజంగానే తాబేలు దగ్గరికి వెళ్లిన మోదీ

ఆసక్తికరంగా.. సీషెల్స్ వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడి ప్రెసిడెంట్ డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినియెతో కలిసి నేషనల్ బొటానికల్ గార్డెన్స్‌లోని జెయింట్ టార్టాయిస్ ఎన్‌క్లోజర్‌ను (Giant Tortoise Enclosure) సందర్శించారు. ఆ భారీ తాబేళ్లకు ఆకులు తినిపిస్తున్న ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

పీఎం జాబ్ వదిలేయండి..

మోదీ పోస్ట్‌పై ధ్రువ్ రాథీ తనదైన శైలిలో మరోసారి పంచ్ వేశారు. "మోదీజీ మొదటిసారి నా సలహా విన్నారు. ఆయన తన పార్ట్ టైమ్ పీఎం (PM) జాబ్‌ను వదిలేసి, ఫుల్ టైమ్ ట్రావెల్ వ్లాగర్ (Travel vlogger) కావాలి" అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నెటిజన్లు ఈ రెండు పోస్టులను పోల్చుతూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement