త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | హేజిల్‌వుడ్ అవుట్‌.. స్టీవ్ స్మిత్ ఇన్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో మార్పులు చేసిన ఆస్ట్రేలియా..!

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో ఆస్ట్రేలియా కీల‌క మార్పులు చేసింది. ఫాస్ట్ బౌల‌ర్ జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌కు చోటు క‌ల్పించింది. ఈ విష‌యాన్ని ఐసీసీ సోమ‌వారం ధ్రువీక‌రించింది.

P

Sports | Published On Feb 16, 2026, 6.38 pm IST

T20 World Cup | హేజిల్‌వుడ్ అవుట్‌.. స్టీవ్ స్మిత్ ఇన్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో మార్పులు చేసిన ఆస్ట్రేలియా..!
Advertisement

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో ఆస్ట్రేలియా కీల‌క మార్పులు చేసింది. ఫాస్ట్ బౌల‌ర్ జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌కు చోటు క‌ల్పించింది. ఈ విష‌యాన్ని ఐసీసీ సోమ‌వారం ధ్రువీక‌రించింది. హేజిల్‌వుడ్ గాయం నుంచి కోలుకోక‌పోవ‌డంతో అత‌ని స్థానంలో స్టీవ్‌ను తీసుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఐసీసీ అనుమ‌తి కోరింది. ఈవెంట్ టెక్నిక‌ల్ క‌మిటీ ఆమోదం తెలుప‌డంతో స్టీవ్ స్మిత్ జ‌ట్టులోకి వ‌చ్చాడు.

శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌కు ముందు జోష్ హేజిల్‌వుడ్ ఫిట్‌నెస్ సాధించ‌లేక‌పోయాడు. అయిన‌ప్ప‌టికీ ఆస్ట్రేలియా జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఫాస్ట్ బౌల‌ర్ కోలుకుంటాడ‌ని భావించినా నిరాశ త‌ప్ప‌లేదు. అయితే, స్టీవ్ స్మిత్‌ను ఎందుకు తీసుకుంద‌నేది స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా శ్రీ‌లంక‌లో టీ20 లీగ్ మ్యాచులు ఆడుతోంది. ఇక్క‌డ స్పిన్న‌ర్ల‌ను ఎదుర్కోవ‌డం ఆస్ట్రేలియాకు ఇబ్బందిక‌రంగా మారింది. ఈ ప‌రిస్థితుల్లో స్పిన్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు టాప్ ఆర్డ‌ర్‌లో సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్‌ను తీసుకోవాల‌ని భావించింది.

హేజిల్‌వుడ్ కోలుకునేందుకు ఇంకా స‌మ‌యం ప‌డుతుంది. దాంతో జ‌ట్టులో చేర‌లేదు. ఫిట్‌నెస్ సాధించేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని మెడిక‌ల్ టీమ్ స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా స్మిత్ గతేడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ఒక్క టీ20 కూడా ఆడ‌లేదు. డొమెస్టిక్‌లో మాత్రం రాణించాడు. ఇటీవ‌ల జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా 23 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైంది. సూప‌ర్ 8కు అర్హ‌త సాధించ‌డం క‌ష్టంగా మారింది. ఈ నేప‌థ్యంలో టోర్నీలో నుంచి నిష్క్ర‌మించ‌కుండా ఉండేందుకు శ్రీ‌లంక‌తో జ‌రిగే మ్యాచ్‌లో ఎలాగైన గెల‌వాల‌ని భావిస్తున్న‌ది.

Advertisement
Advertisement