Padma Awards | రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్‌కు పద్మశ్రీ అవార్డులు..
Padma Awards | గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ జాబితాలో పలువురు క్రీడా ప్రముఖులు ఉన్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ అవార్డులు వరించాయి.
Padma Awards | గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ జాబితాలో పలువురు క్రీడా ప్రముఖులు ఉన్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ అవార్డులు వరించాయి. అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ విజయ్ అమృత్‌రాజ్‌ను కేంద్రం పద్మభూషణ్ అవార్డుకు ఎంపికచేసింది. అలాగే, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పుదుచ్చేరితో సహా పలు రాష్ట్రాలకు చెందిన వారిని సైతం పద్మ అవార్డులకు ఎంపికైన వారిలో ఉన్నారు. విజయ్ అమృత్‌రాజ్ (యూఎస్) పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. బల్దేవ్ సింగ్ (పంజాబ్), భగవాన్ దాస్ రైక్వర్ (మధ్యప్రదేశ్), హర్మన్‌ప్రీత్ కౌర్ (పంజాబ్), కే పజనివేల్ (పుదుచ్చేరి), ప్రవీణ్ కుమార్ (ఉత్తరప్రదేశ్), రోహిత్ శర్మ (మహారాష్ట్ర), సవితా పునియా (హర్యానా), జార్జియాకు చెందిన వ్లాదిమిర్ మెస్ట్విరిష్విలి (మరణానంతరం)లకు పద్మశ్రీ అవార్డులను ఎంపిక చేసింది.
రెండు ఐసీసీ టోర్నీలు అందించిన రోహిత్‌కు..
భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు గౌరవం దక్కింది. భారత్‌కు రెండు ఐసీసీ టైటిల్స్‌ను అందించాడు రోహిత్. 2024లో టీ20 ప్రపంచ కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ ఆ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత 2025లో టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్నాడు. రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ 20,109 పరుగులు సాధించాడు. ఇందులో 50 సెంచరీలు, 111 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ప్రపంచకప్ మహిళా జట్టు సారధికి..
భారత వుమెన్స్ క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్‌కు గుర్తింపు లభించింది. కేంద్రం ఆమెకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో భారత్ ఓడించి.. మహిళల ప్రపంచ కప్‌ను భారత్‌కు అందించిన తొలి టీమిండియా కెప్టెన్‌గా ఘనత సాధించింది. ప్రపంచకప్ ఫైనల్‌లో 299 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని.. బౌలింగ్‌లో అదరగొట్టింది. దీప్తి శర్మ ఐదు వికెట్లు పడగొట్టగా, షఫాలీ వర్మ ఆల్‌రౌండ్ ఫర్ఫామెన్స్‌తో భారత జట్టు దక్షిణాఫ్రికాను 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ చేసింది. స్వదేశంలో తొలి ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించింది. సొంత దేశంలో ప్రపంచ కప్ గెలిచిన రెండో భారత కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ ఘనత సాధించింది. ముంబయి వాంఖడే స్టేడియంలో 2011 ప్రపంచ కప్ టైటిల్ వరకు నడిపించిన తొలి కెప్టెన్‌గా ఎంఎస్ ధోని నిలిచాడు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






