త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | న్యూజిలాండ్ టార్గెట్ 170 ర‌న్స్‌..!

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో తొలి సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు ద‌క్షిణాఫ్రికా 170 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ జ‌ట్టు బౌలింగ్ ఎంచుకుంది.

P

Cricket | Published On Mar 4, 2026, 9.10 pm IST

T20 World Cup | న్యూజిలాండ్ టార్గెట్ 170 ర‌న్స్‌..!
Advertisement

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో తొలి సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు ద‌క్షిణాఫ్రికా 170 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ జ‌ట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగులు చేసింది. మార్కో జాన్సెన్ 55 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. డేవాల్ట్ బ్రేవిస్ (34) , ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (29) మిన‌హా ఎవ‌రూ భారీ స్కోర్ చేయ‌లేక‌పోయారు. ప్రొటీస్ జ‌ట్టులో న‌లుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోర్ చేయ‌లేక‌పోయారు. కివీస్ బౌల‌ర్ల‌లో మాట్ హెన్రీ, కోల్ మెక్‌కాంచీ, ర‌చిన్ రవీంద్ర త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ చెరో ఒక వికెట్ తీశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement