Sourav Ganguly | పాకిస్థాన్ వ్యవహార శైలిపై గంగూలీ ఆసక్తికర కామెంట్స్.. ఇలా చేయడం తొలిసారి అంటూ..
Sourav Ganguly | టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమన్న పాకిస్థాన్ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం తమ జట్టును టోర్నమెంట్ కోసం శ్రీలంకకు పంపేందుకు అనుమతిచ్చినా, ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ మ్యాచ్‌లో మాత్రం మైదానంలోకి దిగబోమని స్పష్టం చేసింది.
Sourav Ganguly | టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమన్న పాకిస్థాన్ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం తమ జట్టును టోర్నమెంట్ కోసం శ్రీలంకకు పంపేందుకు అనుమతిచ్చినా, ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ మ్యాచ్‌లో మాత్రం మైదానంలోకి దిగబోమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై తాజాగా స్పందించిన గంగూలీ.. వరల్డ్‌కప్‌లో భారత్‌తో ఆడబోమని పాకిస్థాన్ చెప్పడం ఇదే తొలిసారి. ఎందుకు ఆడబోమంటున్నారో నాకు అర్థం కావడం లేదు.. అని అన్నారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టోర్నమెంట్లో అత్యంత లాభదాయకమైన పోరుగా పేరుంది. ఈ మ్యాచ్ జరగకపోతే భారీ ఆర్థిక నష్టం తప్పదని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ని హెచ్చరించింది. మ్యాచ్‌ను బాయ్ కాట్ చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది.
కాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా పీసీబీకి లేఖ రాసి, మ్యాచ్ బహిష్కరణ వల్ల తాము ఎదుర్కొనే ఆర్థిక నష్టాలను గుర్తు చేసింది. గతంలో కష్టకాలాల్లో పాకిస్థాన్ క్రికెట్‌కు శ్రీలంక అందించిన మద్దతును కూడా ఆ లేఖలో ప్రస్తావించింది. అయినప్పటికీ పాక్ శ్రీలంక విజ్ఞప్తిని తిరస్కరించింది. భారత్‌తో మ్యాచ్ ఆడే విషయంలో తాము తమ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పింది.
అయితే టీ20 వరల్డ్‌కప్ భారత్ వేదికగా జరుగుతుండడంతో ఆ విషయంపై కూడా గంగూలీ స్పందించారు. భారత జట్టుకు టైటిల్ ను నిలబెట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని గంగూలీ అభిప్రాయపడ్డారు. ఇది హోమ్ వరల్డ్‌కప్. స్వదేశంలో భారత్ అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి.. అని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఏ జట్టూ వరుసగా రెండు టీ20 వరల్డ్‌కప్స్ గెలవలేదని, అలాగే స్వదేశంలో టైటిల్ సాధించిన ఉదాహరణ లేదని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో భారత్ ఆ అడ్డంకులను అధిగమించి కప్ సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026

Dope Tests | చిక్కుల్లో యశస్వీ జైస్వాల్, షెఫాలీ వర్మ.. నోటీసులు జారీ చేసిన నాడా..!
మే 9, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



