త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sri Lanka Cricket | శ్రీ‌లంక క్రికెట‌ర్ల‌కు షాక్‌.. ఫిట్‌నెస్ టెస్ట్ త‌ప్ప‌నిస‌రి చేసిన బోర్డు..!

Sri Lanka Cricket | శ్రీ‌లంక జ‌ట్టు ఆ దేశ క్రికెట‌ర్ల‌కు షాక్ ఇచ్చింది. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ లీగ్‌ల‌లో ఆడాల‌నుకునే ఆట‌గాళ్ల‌కు త‌ప్ప‌నిస‌రిగా ఫిట్‌నెస్ టెస్ట్‌ని శ్రీ‌లంక క్రికెట్ (SLC) త‌ప్ప‌నిస‌రి చేసింది. ఓ నివేదిక ప్ర‌కారం.. ఆయా లీగ్‌ల‌లో పాల్గొనే ముందు ఫిట్‌నెస్ టెస్టుల‌లో పాల్గొనాల‌ని ఉంటుంది.

P

Sports | Published On Mar 21, 2026, 3.13 pm IST

Sri Lanka Cricket | శ్రీ‌లంక క్రికెట‌ర్ల‌కు షాక్‌.. ఫిట్‌నెస్ టెస్ట్ త‌ప్ప‌నిస‌రి చేసిన బోర్డు..!
Advertisement

Sri Lanka Cricket | శ్రీ‌లంక జ‌ట్టు ఆ దేశ క్రికెట‌ర్ల‌కు షాక్ ఇచ్చింది. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ లీగ్‌ల‌లో ఆడాల‌నుకునే ఆట‌గాళ్ల‌కు త‌ప్ప‌నిస‌రిగా ఫిట్‌నెస్ టెస్ట్‌ని శ్రీ‌లంక క్రికెట్ (SLC) త‌ప్ప‌నిస‌రి చేసింది. ఓ నివేదిక ప్ర‌కారం.. ఆయా లీగ్‌ల‌లో పాల్గొనే ముందు ఫిట్‌నెస్ టెస్టుల‌లో పాల్గొనాల‌ని ఉంటుంది. అన్ని ప్ర‌మాణాలు చేరితేనే ఎన్‌వోసీలు జారీ చేయ‌నున్న‌ట్లు బోర్డు స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలోనే వనిందు హసరంగా (లక్నో సూపర్ జెయింట్స్), నువాన్ తుషార (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), మతిషా పతిరానా (కోల్‌కతా నైట్ రైడర్స్), ఇషాన్ మలింగ (సన్‌రైజర్స్ హైదరాబాద్) వంటి ప్లేయ‌ర్స్ ఐపీఎల్‌లో ఆడ‌నున్న నేప‌థ్యంలో ఇది వారిపై ప్ర‌త్య‌క్ష ప్ర‌భావం చూప‌నుంది.

ఐపీఎల్ ఆడేందుకు అనుమ‌తి

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడే దుష్మంత చమీరా, పతుమ్ నిస్సంక, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన కమిందు మెండిస్ ఫిట్‌నెస్ పరీక్షల్లో పాస్ అయ్యారు. దాంతో వారికి ఐపీఎల్ ఆడేందుకు అనుమ‌తి దొరికింది. నువాన్ తుషారాకు ఎన్ఓసీ (NOC) ఇవ్వాల్సి ఉంది. అయితే, అది ఫిట్‌నెస్ పరీక్ష టెస్ట్ ఫ‌లితంపైనే ఎన్‌వోసీ ఇవ్వ‌డం ఆధారపడి ఉంటుంది. వనిందు హసరంగా, ఇషాన్ మలింగ, మతిషా పతిరానా ఐపీఎల్ 2026 పాల్గొనేందుకు ఎన్ఓసీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకుంటున్నారు. వారికి ఇంకా ఫిట్‌నెస్ టెస్టులు జ‌ర‌గాల్సి ఉంద‌ని శ్రీ‌లంక క్రికెట్ విభాగం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ స‌మ‌యంలోనే గాయపడ్డారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ప‌లు జ‌ట్లు స‌న్నాహ‌కాల‌ను మొద‌లుపెట్టాయి.

ఫిట్‌నెస్ పరీక్షలపై ఎందుకు దృష్టి?

పతిరానా ఐపీఎల్ సీజన్‌లోని ప్రారంభంలో కొన్ని మ్యాచుల‌కు దూరం కానున్నాడు. ఏప్రిల్ మధ్య నుంచి జ‌రిగే మ్యాచుల‌కు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. బోర్డు ఆట‌గాళ్ల ఫిట్‌నెస్‌పై మళ్లీ దృష్టి సారించడానికి కారణం ప్రమోదయ విక్రమసింఘే నేతృత్వంలోని కొత్త సెలక్షన్ కమిటీ, శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖే కార‌ణ‌మ‌ని స‌మాచారం. ఆ జ‌ట్టుకు మే నెలాఖరు వరకు ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు లేవు. అయితే శ్రీ‌లంక క్రికెట్ జాతీయ కాంట్రాక్ట్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ని మెరుగుప‌రిచేందుకు ఈ స‌మ‌యంలో శిక్షణా కార్యక్రమంగా ప‌రిగ‌ణిస్తోంది. ప్రస్తుతం జాతీయ కాంట్రాక్ట్ ఆటగాళ్లందరి కోసం ఎనిమిది వారాల ప్రత్యేక శారీరక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాబోయే సిరీస్‌ల నాటికి ఆట‌గాళ్ల‌ను సిద్ధం చేయ‌డంతో పాటు వారి ఫిట్‌నెస్‌ను మెరుగుప‌రిచేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement