Shubman Gill | ప్రపంచకప్‌లో దక్కని చోటు.. మౌనం వీడిన శుభ్‌మన్ గిల్..!
Shubman Gill | వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ జరుగనున్నది. పొట్టి కప్‌కు ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు. న్యూజిలాండ్‌తో జరిగి మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
Shubman Gill | వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ జరుగనున్నది. పొట్టి కప్‌కు ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు. న్యూజిలాండ్‌తో జరిగి మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. టీ20 ప్రపంచ కప్ జట్టు నుంచి తనను తప్పించడంపై ఎట్టకేలకు మౌనం వీడాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ వరకు గిల్ భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా కొనసాగాడు. కానీ, ఈ ప్రపంచ టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల జట్టులో చోటులో మాత్రం దక్కలేదు. సెలెక్టర్ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని, అవకాశం వచ్చినప్పుడల్లా తన పూర్తి సామర్థ్యంతో జట్టుకు సహకరించడానికి ప్రయత్నిస్తానని యువ కెప్టెన్ పేర్కొన్నాడు. గిల్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 36 టీ20 మ్యాచులు ఆడి 28.03 సగటు, 138.59 స్ట్రయిక్ రేట్‌తో 869 పరుగులు చేశాడు.
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల సిరీస్‌లో తొలి వన్డేకు ముందు గిల్ మాట్లాడుతూ.. తాను ఉండాల్సిన చోటే ఉన్నానని చెప్పాడు. నా పని నుంచి ఎవరూ దూరం చేయలేరని.. ఓ ఆటగాడు ఎప్పుడూ దేశం కోసం తనవంతు అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానని.. సెలెక్టర్లు తమ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నాడు. వర్తమానంలో జీవించడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచ కప్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాడు. తాము చివరిసారిగా న్యూజిలాండ్‌తో వన్డే ఆడిన సమయంలో తనకు అరంగేట్రమని.. ఆ రోజును తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని చెప్పాడు. గతేడాది నవంబర్‌లో కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో రెండోరోజు మెడ గాయంతో ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత రెండో టెస్ట్, వన్డే సిరీస్‌కు సైతం దూరమయ్యాడు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






