త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Vs Sri Lanka XI | గిల్‌ వచ్చాడు.. భారత్‌ గెలిచింది!

India Vs Sri Lanka XI | శ్రీలంకతో మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి రోజు శ్రీలంక 200/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడంతో భారత్‌ ముందు 207 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ టార్గెట్‌ను ఛేదించిన భారత్‌ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

P

Sports | Published On Aug 9, 2026, 7.10 pm IST

India Vs Sri Lanka XI | గిల్‌ వచ్చాడు.. భారత్‌ గెలిచింది!
Advertisement

శ్రీలంకతో వార్మప్‌లో 6 వికెట్ల తేడాతో విజయం

India Vs Sri Lanka XI | శ్రీలంకతో మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి రోజు శ్రీలంక 200/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడంతో భారత్‌ ముందు 207 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ టార్గెట్‌ను ఛేదించిన భారత్‌ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గాయంతో తొలి రెండు రోజులు మ్యాచ్‌కు దూరంగా ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ మూడో రోజు బ్యాటింగ్‌కు రావడంతో జట్టు యాజమాన్యంతో పాటు అభిమానుల్లోనూ ఊరట కనిపించింది. మ్యాచ్‌కు ముందు వేలికి గాయం కావడంతో గిల్‌ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే, చివరి రోజు బ్యాటింగ్‌కు దిగడంతో ఆ అనుమానాలకు తెర‌ప‌డిన‌ట్ల‌య్యింది.

గిల్‌ అందుబాటులో లేని సమయంలో కేఎల్‌ రాహుల్‌ రెండు రోజుల పాటు ఇన్నింగ్స్‌ను సమర్థంగా నడిపించాడు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 357/6 వద్ద డిక్లేర్‌ చేసింది. దేవదత్‌ పడిక్కల్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి 164 బంతుల్లో 142 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు ఉన్నాయి. రవీంద్ర జడేజా 63, గర్నూర్‌ బ్రార్‌ 18 బంతుల్లోనే 36 పరుగులు సాధించారు. కేఎల్‌ రాహుల్‌ 40, మానవ్‌ సుతార్‌ 41 పరుగులు చేశారు. అంతకుముందు శ్రీలంక లెవెన్ జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 363/8 వద్ద డిక్లేర్‌ చేసింది. నిశాన్‌ మదుషంక 66, రవీందు రసంత 71, కెప్టెన్‌ సోనల్‌ దినూష 52 పరుగులతో రాణించారు. భారత్‌ బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మానవ్‌ సుతార్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.

చివరి రోజు 45 ఓవర్లలో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన శ్రీలంక 200/6 వద్ద డిక్లేర్‌ చేసింది. నిశాన్‌ మదుషంక 73 బంతుల్లో 63 పరుగులు చేసి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. నిపుణ్‌ ధనంజయ 46, అంజల బండ‌ర 35 పరుగులు చేశారు. భారత్‌ బౌలర్లలో గర్నూర్‌ బ్రార్‌, జడేజా రెండేసి వికెట్లు తీశారు. మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ చెరో వికెట్‌ పడగొట్టారు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన ఆరు పరుగుల ఆధిక్యంతో కలిపి మొత్తం ఆధిక్యం 206 పరుగులకు చేరింది. దీంతో భారత్‌కు 207 పరుగుల విజయలక్ష్యం నిర్దేశించారు. లక్ష్యాన్ని ఛేదించిన భారత్‌ ఆరు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను ముగించింది.

Advertisement
Advertisement