Shubman Gill | వరల్డ్‌కప్ కోసమే గిల్‌ను ప్రిపేర్ చేశారు.. అయినా ఎందుకలా జరిగింది..?
Shubman Gill | భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టును బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించిన విషయం విదితమే. అయితే అందులో శుబమన్ గిల్‌ను ఎంపిక చేయలేదు.
Shubman Gill | భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టును బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించిన విషయం విదితమే. అయితే అందులో శుబమన్ గిల్‌ను ఎంపిక చేయలేదు. అతనికి బదులుగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ కు చోటు కల్పించారు. అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌తో మళ్లీ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. దీంతో కిషన్ బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. అయితే వరల్డ్ కప్ కోసం గిల్‌ను ఎంపిక చేయకపోవడం క్రికెట్ వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొదట్నుంచీ ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా, భవిష్యత్తు టీ20 జట్టు కెప్టెన్‌గా గిల్‌ను ప్రిపేర్ చేశారు. కానీ చివరి నిమిషంలో అతన్ని జట్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం మాజీలను, క్రికెట్ విశ్లేషకులను, ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది.
సెలెక్టర్ల ప్లాన్ ఫెయిల్..
వాస్తవానికి ఐపీఎల్‌లో గిల్ స్థిరంగా రాణిస్తున్నాడు కూడా. 2023 ఐపీఎల్ సీజన్‌లో అతను టోర్నీ మొత్తం మీద 890 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ సాధించాడు. అలాగే ఐపీఎల్ 2025 సీజన్‌లో 155.88 స్ట్రైక్ రేట్‌తో 650 పరుగులు చేశాడు. అందులో 6 అర్థసెంచరీలు కూడా ఉన్నాయి. అతను గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గిల్‌ను భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమించారు. గిల్‌ను ఓపెనర్‌గా పంపితే అతను నిలకడగా ఆడుతూ ఇతర బ్యాట్స్‌మెన్‌కు షాట్స్ కొట్టే అవకాశం కల్పించాలి. దీంతో జట్టు భారీ స్కోరు చేసే దిశగా అతను ఇన్నింగ్స్‌ను నడిపించాలి. కానీ దురదృష్టవశాత్తూ అతను ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. జట్టు మేనేజ్‌మెంట్ ఆ విధంగా ముందు నుంచే ప్రణాళికలు వేసింది. కానీ గిల్ అందులో సక్సెస్ అవలేకపోయాడు. అతను స్థిరమైన ఇన్నింగ్స్ ఆడలేదు. గత 15 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో అతను కేవలం 291 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే స్ట్రైక్ రేట్ కూడా పేలవంగానే ఉంది. ఇక అత్యుత్తమ స్కోరు 47 కాగా ఒక్క అర్థ సెంచరీ కూడా చేయలేదు. ఈ క్రమంలోనే సెలెక్టర్ లు గిల్‌ను పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
సంజు స్థానం వేరే..?
అయితే ఓపెనర్ గా సంజు శాంసన్‌ను ఆడించాలని సెలెక్టర్లు అనుకోలేదు. అది కూడా యాదృచ్ఛికంగానే జరిగింది. వాస్తవానికి గిల్‌ను ఓపెనర్ గా ప్రిపేర్ చేస్తున్నప్పుడే సంజు శాంసన్‌కు కూడా జట్టులో స్థానం కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శాంసన్ ను 3 లేదా 4వ స్థానంలో స్థిరంగా ఆడించాలని అనుకున్నారు. కానీ సెలెక్టర్లు అనుకున్న విధంగా గిల్ రాణించలేదు. దీని వల్ల బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాల్సి వచ్చింది. సంజును ఓపెనర్‌గా మార్చారు. ఆ స్థానంలో ఉన్న గిల్‌ను తప్పించారు. ఇక దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్‌ను బ్యాకప్ ఓపెనర్ గా, బ్యాకప్ వికెట్ కీపర్‌గా కూడా భావించి తీసుకున్నారు. అయితే గిల్‌ను తప్పించడం సరైన నిర్ణయమే అని, అతను ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో ఆడకపోయినా భవిష్యత్తులో రాణిస్తే గొప్ప ఓపెనర్ గా మారే అవకాశాలు ఉన్నాయని గవాస్కర్ లాంటి మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గిల్ టీ20లలోకి మళ్లీ వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



