త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shree Charani | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వన్ బౌల‌ర్‌గా శ్రీ చ‌ర‌ణి

Shree Charani | టీమిండియా వుమెన్స్ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ శ్రీ చరణి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆమె, తొలిసారిగా ఐసీసీ మహిళల టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది.

P

Sports | Published On Jun 24, 2026, 11.30 am IST

Shree Charani | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వన్ బౌల‌ర్‌గా శ్రీ చ‌ర‌ణి
Advertisement

Shree Charani | టీమిండియా వుమెన్స్ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ శ్రీ చరణి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆమె, తొలిసారిగా ఐసీసీ మహిళల టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. తాజాగా విడుదలైన ఐసీసీ ర్యాంకింగ్స్‌ను విడుద‌ల చేసింది. కేవలం 21 ఏళ్ల వయసులోనే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన శ్రీ‌చ‌ర‌ణి.. ప్రపంచ నంబర్‌వన్ బౌలర్‌గా అవతరించింది. దీంతో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ స్పిన్నర్ లిండ్సే స్మిత్‌ను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి ఏడాది కూడా పూర్తికాకముందే శ్రీ చరణి నెంబ‌ర్ వ‌న్ బౌల‌ర్‌గా నిలువ‌డం విశేషం. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత జట్టులో కీల‌క స‌భ్యురాలిగా మారింది ఈ యువ స్పిన్న‌ర్ కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే 10 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటింది.

లీడ్స్‌లో నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి మెరిసిన చరణి, అనంతరం మాంచెస్టర్‌లో దక్షిణాఫ్రికాపై మూడు వికెట్లు సాధించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో మ్యాచ్ విన్నింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో కీలక రేటింగ్ పాయింట్లు సంపాదించి లిండ్సే స్మిత్‌ను అధిగమించింది. శ్రీ చరణి అగ్రస్థానానికి చేరుకోగా, లిండ్సే స్మిత్ రెండు స్థానాలు దిగజారి మూడో ర్యాంక్‌కు పరిమితమైంది. ఇంగ్లండ్‌కే చెందిన చార్లీ డీన్ తొలి మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు సాధించి రెండో స్థానానికి ఎగబాకింది. తాజా ర్యాంకింగ్స్‌లో మ‌రికొంద‌రు బౌల‌ర్లు సైతం ర్యాంకులు మెరుగ‌య్యాయి. మాజీ ప్రపంచ నంబర్‌వన్ సోఫీ ఎక్లెస్టోన్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి చేరుకుంది. వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఆస్ట్రేలియా బౌలర్ కిమ్ గార్త్ అత్యధికంగా 25 స్థానాలు మెరుగుపరుచుకుని టాప్-20లోకి ప్రవేశించింది. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా 25వ స్థానానికి చేరుకోగా, ఐర్లాండ్‌కు చెందిన ఓర్లా ప్రెండర్‌గాస్ట్ కూడా 26వ స్థానానికి ఎగ‌బాకింది.

Advertisement
Advertisement