T20 World Cup | టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్‌ను తొలగించిన ఐసీసీ..! గ్రూప్-సీలో స్కాట్లాండ్‌కు చోటు..!
T20 World Cup | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అన్నంత పని చేసింది. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం అధికారిక లేఖను బీసీబీకి పంపింది. ఈ నెల 4 నుంచి జరుగుతున్న హైవోల్టేజ్ డ్రామాకు తెరపడినట్లయ్యింది. బంగ్లాదేశ్‌కు ఉద్వాసన పలుకడంతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌కు చోటు కల్పించినట్లు ఐసీసీ అధికారికంగా బంగ్లా బోర్డుకు స్పష్టం చేసింది.
T20 World Cup | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అన్నంత పని చేసింది. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం అధికారిక లేఖను బీసీబీకి పంపింది. ఈ నెల 4 నుంచి జరుగుతున్న హైవోల్టేజ్ డ్రామాకు తెరపడినట్లయ్యింది. బంగ్లాదేశ్‌కు ఉద్వాసన పలుకడంతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌కు చోటు కల్పించినట్లు ఐసీసీ అధికారికంగా బంగ్లా బోర్డుకు స్పష్టం చేసింది.
ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు పలువురు సీనియర్ ఐసీసీ అధికారులు దుబాయిలో ఉన్నారు. శుక్రవారం ఆలస్యంగా బంగ్లాదేశ్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాంకు ఈ మెయిల్ పంపింది. పేరు చెప్పేందుకు ఇష్టపడని ఐసీసీ అధికారిని ఉటంకిస్తూ పీటీఐ వార్త సంస్థ వివరాలను వెల్లడించింది. ఆ అధికారి నిన్న సాయంత్రమే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్‌కు ఈ మెయిల్ పంపామన్నారు. ఐసీసీ జారీ చేసిన అల్టిమేటంపై ఇచ్చిన 24 గంటల గడువు ముగిసినా బంగ్లా బోర్డు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ బోర్డు ఐసీసీకి సమాచారం ఇచ్చేందుకు ఢాకాలో మీడియా సమావేశం నిర్వహించింది. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనగా ఐసీసీ భావిస్తోంది. ఆ జట్టు స్థానంలో మరో జట్టును తీసుకుంటున్నట్లుగా ఐసీసీ స్పష్టం చేసిందన్నారు. భద్రత విషయంలో ఐసీసీ హామీ ఇచ్చిందని.. అయినా అదే కారణంతో భారత్‌కు జట్టును పంపబోమని బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడల మంత్రిత్వశాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తెలిపారు. ఇదిలా ఉండగా క్రికెట్ స్కాట్లాండ్ తమకు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని.. త్వరలోనే అందుతుందని భావిస్తు్న్నామని చెప్పింది.
భారత్‌లో నాలుగు మ్యాచులు ఆడనున్న స్కాట్లాండ్
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం.. బంగ్లాదేశ్ లీగ్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబయిలో జరుగాల్సి ఉంది. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను గ్రూప్-సీలో చేర్చడంతో.. ఆ జట్టు షెడ్యూల్ చేసిన మ్యాచులు ఆడుతుంది. ఇలా ఒక జట్టు స్థానంలో మరో జట్టును చేర్చడం కొత్తేమీ కాదు. 2009లో ఇంగ్లాండ్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్ నుంచి జింబాబ్వే వైదొలిగింది. అప్పుడు సైతం ఇదే స్కాట్లాండ్ జట్టుకు చోటు కల్పించారు. బంగ్లాదేశ్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. భారత్‌లో ఆడబోమంటూ నిరాకరించడంతో ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్‌కు టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం దక్కింది.
మూడు కోల్‌కతాలో.. ఒకటి ముంబయిలో..
స్కాట్లాండ్ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడనున్నది. ఫిబ్రవరి 9న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్‌తో కోల్‌కతాలో.. ఫిబ్రవరి 17న చివరి లీగ్ మ్యాచ్‌ను ముంబయిలో నేపాల్‌తో తలపడుతుంది. టోర్నీలో గ్రూప్ ఏలో భారత్, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్, అమెరికా ఉన్నాయి. ఇక గ్రూప్ బీలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్ సీలో స్కాట్లాండ్ (బంగ్లా స్థానంలో), ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్, వెస్టిండీస్.. గ్రూప్ డీలో ఆఫ్ఘనిస్తాన్, కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యూఏఈ ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అల్టిమేటం జారీ చేసినప్పటికీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తన మొండిపట్టుదల వీడలేదు. ఐసీసీ ఇచ్చిన అల్టిమేటంపై బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌తో జరిగిన సమావేశం తర్వాత బీసీబీ భారత్‌కు వెళ్లబోమని స్పష్టం చేసింది. ఈ సమావేశంలో బీసీబీ అధ్యక్షుడు అమీనుల్, సీఈఓ నిజాముద్దీన్, బంగ్లాదేశ్ జట్టుకు చెందిన కొందరు ఆటగాళ్లు పాల్గొన్నారు. సమావేశం అనంతరం బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ మాట్లాడుతూ ఐసీసీతో సంప్రదింపులు కొనసాగిస్తామని.. బంగ్లాదేశ్ ప్రపంచ కప్ ఆడాలనుకుంటున్నామని చెప్పింది.
ఈ వివాదం ఎక్కడ మొదలైంది?
ఐపీఎల్ నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను విడుదల చేయడంతో ఈ వివాదం మొదలైంది. భారత్‌లో భద్రతా కారణాలను చూపుతూ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరోసారి డిమాండ్ చేసింది. గ్రూప్ సీ నుంచి గ్రూప్ బీకి మార్చి.. ఐర్లాండ్‌ను గ్రూప్ సీకి పంపే ప్రత్యామ్నాయానికి ఐసీసీ ప్రతిపాదించింది. ఎందుకంటే గ్రూప్ బీ మ్యాచ్‌లు శ్రీలంకలో జరగాల్సి ఉంది. ఐసీసీ అధికారులు బంగ్లాదేశ్‌లో బీసీబీ అధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత జనవరి 21న ఐసీసీ బోర్డు సమావేశం జరిగింది. అందులో మెజారిటీ ఆధారంగా బంగ్లాదేశ్ డిమాండ్‌ను తిరస్కరించారు. షెడ్యూల్ ప్రకారం.. భారతదేశంలో ఆడాలని స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చుతామని ఐసీసీ బంగ్లాదేశ్‌కు అల్టిమేటం ఇచ్చింది. బంగ్లాదేశ్ అయినా అదే పాత పాటే పాడతూ భారత్‌లో ప్రపంచకప్‌లో ఆడేందుకు నిరాకరించింది. తాజాగా బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






