RR Vs CSK | టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. చెన్నై ఫస్ట్ బ్యాటింగ్..!
RR Vs CSK | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గువాహటిలో వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.
RR Vs CSK | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గువాహటిలో వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం కురవడంతో మైదానాన్ని మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. వర్షం కురిసిన నేపథ్యంలో పిచ్‌పై కొంత తేమ ఉండే అవకాశం ఉందని.. దాంతో బౌలింగ్ ఎంచుకున్నట్లు తెలిపాడు. ఈ సీజన్ బాగుంటుందని ఆశిస్తున్నామని, టైటిల్‌ను గెలవడమే తమ లక్ష్యమని చెప్పాడు. జట్టులో కీలకమైన ఆటగాళ్లను తీసుకుంటున్నట్లు తెలిపాడు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ.. తాము మ్యాచ్‌ను సానుకూలంగా ప్రారంభించాలనుకుంటున్నామని పేర్కొన్నాడు. గతేడాది ఎలా గడించింది అందరూ చూశారని.. ఈ సారి కొన్ని వ్యూహాలతో వేలానికి వెళ్లామని.. అన్నీ బాగానే జరుగుతాయని ఆశిస్తున్నామని తెలిపాడు. ఇదిలా ఉండగా.. సంజు శాంసన్ ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరడంతో రియాన్ పరాగ్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. సీనియర్ క్రికెటర్ రవీంద్ర జడేజా జట్టులో చేరడంతో మరింత బలంగా ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ : సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తిక్ శర్మ (వికెట్ కీపర్), జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్.
ఇంపాక్ట్ ప్లేయర్స్ : సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, రాహుల్ చాహర్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్.
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జూరెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ.
ఇంప్లాక్ ప్లేయర్స్ : డోనోవన్ ఫెరీరా, లువాన్ డ్రే ప్రిటోరియస్, రవి సింగ్, సుశాంత్ మిశ్రా, తుషార్ దేశ్‌పాండే.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






