Rohit Sharma | లార్డ్స్‌లో హిట్‌మ్యాన్ షో.. ఇంగ్లండ్‌పై సెంచరీ కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డ్..
Rohit Sharma | లార్డ్స్ (Lords) వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత జట్టు (Ind vs Eng) ఓడినప్పటికీ పలు రికార్డులు బద్దలయ్యాయి. టీమ్ఇండియా (TeamIndia) సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన అద్భుత శతకంతో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Rohit Sharma | త్రినేత్ర.న్యూస్: లార్డ్స్ (Lords) వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత జట్టు (Ind vs Eng) ఓడినప్పటికీ పలు రికార్డులు బద్దలయ్యాయి. టీమ్ఇండియా (TeamIndia) సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన అద్భుత శతకంతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ప్రతిష్ఠాత్మకమైన లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. 39ఏండ్ల హిట్‌మ్యాన్ తనలో ఏమాత్రం జోరు తగ్గలేదని నిరూపిస్తూ.. 84 బంతుల్లోనే 100 పరుగుల మైలురాయిన అందుకున్న రోహిత్.. 138 రన్స్ (110 బాల్స్) చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇప్పటివరకు లార్డ్స్‌లో మైదానంలో అత్యధిక స్కోర్ రికార్డు గంగూలీ (Sourav Gangully) పేరుతో ఉన్నది. 2004లో సౌరభ్ ఇంగ్లండ్‌పై 90 రన్స్ చేశాడు. ఇక ఇంగ్లండ్‌లో వన్డేల్లో రోహిత్‌కు ఇది 8వ సెంచరీ కాగా, మొత్తంగా వన్డేల్లో 34వ శతకం.
అదేవిధంగా రోహిత్ వయసు 39 ఏండ్ల 80 రోజులు. దీంతో లార్డ్స్ మైదానంలో వన్డేల్లో సెంచరీ బాదిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున ఏ ఫార్మాట్లో అయినా శతకం బాదిన అతిపెద్ద వయస్కుడిగానూ, వన్డేల్లో విదేశీ గడ్డపై అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు.
విదేశాల్లో అత్యధిక వన్డే సెంచరీలు..
రోహిత్ శర్మ- 8 (ఇంగ్లండ్‌లో)
సచిన్ టెండూల్కర్- 7 (యూఏఈలో)
సయీద్ అన్వర్- 7 (యూఏఈలో)
ఏబీ డి విలియర్స్- 7 (భారత్‌లో)
క్వింటన్ డి కాక్- 7 (భారత్‌లో)
భారత్ ఓటమి.. మరో సిరీస్ కూడా..
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన మూడో వన్డేలో.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 386 పరుగుల లక్ష్యాన్ని భారత్ (ENGvIND) ముందుంచింది. అయితే టీమ్ఇండియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 360 రన్స్ మాత్రమే చేసి ఓటమి చవిచూసింది. రోహిత్ శర్మ (138 పరుగులు) సెంచరీకి తోడు విరాట్ కోహ్లీ (74 పరుగులు), శుభ్‌మన్ గిల్ (77 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించినప్పటికీ.. చివర్లో వికెట్లు కోల్పోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ ఓటమితో ఇంగ్లండ్ పర్యటనలో భారత్ 1-2తో వన్డే సిరీస్ కూడా కోల్పోయింది. అంతకుముందు టీ20 సిరీస్‌లో దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.
First Indian to score an ODI century at Lord's ✅
8️⃣th ODI century in England ✅Rohit Sharma with a special knock at the Home of Cricket 💙
Updates ▶️ https://t.co/pLZ2PvDH5G#TeamIndia | #ENGvIND | @ImRo45 pic.twitter.com/S23LZfktRi
— BCCI (@BCCI) July 19, 2026
సంబంధిత వార్తలు

Rohit Sharma | రిటైర్మెంట్ వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ.. వాటిని పట్టించుకోనంటూ..!
జులై 20, 2026

BCCI | రోహిత్ శర్మ రిటైర్మెంట్పై వార్తలపై మౌనం వీడిన బీసీసీఐ.. అదే చివరి మ్యాచ్ కాదన్న సైకియా!
జులై 18, 2026

Rohit Sharma | లార్డ్స్ వన్డే రోహిత్‌కు చివరిదేనా?.. జైస్వాల్‌కు ఛాన్స్ ఇవ్వాలన్న యోచనలో సెలెక్టర్లు..!
జులై 17, 2026
తాజావార్తలు
- ●Trisha | తెలుగులో త్రిష క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - డేరింగ్ అండ్ డాషింగ్ రోల్లో చెన్నై క్వీన్
- ●TV Awards | ఇక బుల్లితెరకు అవార్డులు
- ●Mudumal Megalithic Menhirs | ముడుమాల్ నిలువురాళ్లకు మరింత గుర్తింపు తీసుకువస్తాం..
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్, నిఫ్టీలలో స్వల్ప నష్టాలు..
- ●Road Accident in USA | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
- ●CM Revanth Reddy | తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లు కేటాయించండి..

Trisha | తెలుగులో త్రిష క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - డేరింగ్ అండ్ డాషింగ్ రోల్లో చెన్నై క్వీన్

TV Awards | ఇక బుల్లితెరకు అవార్డులు

Mudumal Megalithic Menhirs | ముడుమాల్ నిలువురాళ్లకు మరింత గుర్తింపు తీసుకువస్తాం..

Stock Markets | స్టాక్ మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్, నిఫ్టీలలో స్వల్ప నష్టాలు..




