త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rohit Sharma | రిటైర్మెంట్ వార్త‌ల‌పై మ‌రోసారి క్లారిటీ ఇచ్చిన రోహిత్ శ‌ర్మ‌.. వాటిని ప‌ట్టించుకోనంటూ..!

Rohit Sharma | రోహిత్ శ‌ర్మ మ‌రోసారి విమ‌ర్శ‌ల‌కు త‌న బ్యాట్‌తోనే స‌మాధానం చెప్పాడు. లార్డ్స్ వేదిక‌గా ఆదివారం ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో సెంచ‌రీతో మెరిశాడు. త‌న కెరీర్‌పై వ‌స్తున్న ఊహాగానాల‌కు చెక్ పెట్టాడు. లార్డ్స్ మైదానంలో వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచిన హిట్‌మ్యాన్.. ప్రస్తుతం రిటైర్మెంట్ గురించి ఎలాంటి ఆలోచన లేదని తన ఆటతోనే స్పష్టం చేశాడు.

P

Sports | Published On Jul 20, 2026, 3.35 pm IST

Rohit Sharma | రిటైర్మెంట్ వార్త‌ల‌పై మ‌రోసారి క్లారిటీ ఇచ్చిన రోహిత్ శ‌ర్మ‌.. వాటిని ప‌ట్టించుకోనంటూ..!
Advertisement

Rohit Sharma | రోహిత్ శ‌ర్మ మ‌రోసారి విమ‌ర్శ‌ల‌కు త‌న బ్యాట్‌తోనే స‌మాధానం చెప్పాడు. లార్డ్స్ వేదిక‌గా ఆదివారం ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో సెంచ‌రీతో మెరిశాడు. త‌న కెరీర్‌పై వ‌స్తున్న ఊహాగానాల‌కు చెక్ పెట్టాడు. లార్డ్స్ మైదానంలో వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచిన హిట్‌మ్యాన్.. ప్రస్తుతం రిటైర్మెంట్ గురించి ఎలాంటి ఆలోచన లేదని తన ఆటతోనే స్పష్టం చేశాడు. మూడో వన్డేకు ముందు రోహిత్ భవిష్యత్తుపై భారీగా చ‌ర్చ జ‌రిగిన విష‌యం తెలిసిందే. లార్డ్స్ వ‌న్డేనే చివ‌రిద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. వాట‌న్నింటికి రోహిత్ సెంచ‌రీతోనే స‌మాధానం ఇచ్చాడు. మ్యాచ్‌కు ముందు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సైతం రోహిత్ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

ఇకపై కూడా అదే చేస్తా..

మ్యాచ్ త‌ర్వాత బీసీసీఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రోహిత్ తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. "నా పని బ్యాట్‌తో పరుగులు చేయడం. మైదానంలోకి వెళ్లి దేశానికి ప్రాతినిధ్యం వహించడం నా బాధ్యత. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రోజు నుంచి నాకు చెప్పింది అదే. ఇకపై కూడా అదే చేస్తాను" అని చెప్పాడు. విమర్శలు, జ‌రుగుతున్న చ‌ర్చ‌పై స్పందిస్తూ.. "నేను అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇదే హడావుడి ఉంది. నేను ఆడుతున్నంత కాలం అది కొనసాగుతూనే ఉంటుంది. వాటి గురించి నేను అసలు పట్టించుకోను. నాకు మైదానంలో నా ప్రదర్శనే కీల‌కం. జట్టు విజయానికి ఎంతగా ఉపయోగపడుతున్నానన్నదే నా పూర్తి దృష్టి" అని రోహిత్ స్పష్టం చేశాడు. కెరీర్‌పై జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌తో పాటు ఒత్తిడిపై ప్ర‌శ్నించ‌గా.. "ఆ శబ్దం లేకపోతే ఆటలో మజా ఉండదు. నా పని మైదానంలో ఆడటం. విమర్శకుల పని బయట మాట్లాడటం. నేను దాన్ని అలా మాత్రమే చూస్తాను" అంటూ చమత్కరించాడు.

సెంచరీ చేసినా సిరీస్ చేజారడంపై నిరాశ‌..

లార్డ్స్‌లో సెంచరీ సాధించినా మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-2తో కోల్పోవడం నిరాశ క‌లిగించింద‌ని రోహిత్ తెలిపాడు. "ఫలితం నిరాశ కలిగించింది. మొత్తం మీద మంచి క్రికెట్ ఆడామని అనిపించింది. బర్మింగ్‌హామ్‌లో బాగా ప్రారంభించాం. కానీ, కార్డిఫ్‌లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాం. స్కోర్‌బోర్డుపై అవ‌స‌ర‌మైన‌న్ని పరుగులు పెట్టలేకపోయాం. లార్డ్స్‌లో కూడా పెద్ద లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేశాం. చివరికి 20-25 పరుగుల దూరంలో ఆగిపోయాం" అని చెప్పాడు. బౌలర్ల ప్రదర్శనపై స్పందిస్తూ.. "ఈ బౌలర్లలో చాలామందికి వన్డేల్లో పెద్దగా అనుభవం లేదు. వారికి కొంత సమయం ఇవ్వాలి. ఈ సిరీస్ నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితుల్లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం" అని చెప్పుకొచ్చారు.

ఇంగ్లండ్‌లో ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే

ఇంగ్లండ్‌లో ఆడ‌డంపై రోహిత్ తన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. "ఇంగ్లండ్‌లో ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టమే. ఇక్కడి వాతావరణం, పిచ్‌లు, పరిస్థితులు ప్రతి ఫార్మాట్‌లోనూ ఆటగాడికి సవాల్ విసురుతుంటాయి. ఒక క్రికెటర్‌గా అలాంటి సవాళ్లనే కోరుకుంటాం. మధ్య ఓవర్లలో ఎక్కువసేపు బ్యాటింగ్ చేయడం ఆస్వాదించాను. కానీ ఫలితం మాత్రం నిరాశపరిచింది. మ్యాచ్‌ను మన వైపు తిప్పుకోలేకపోయాం. ఇప్పుడు ఈ ఓటమిని మర్చిపోయి, వ్యక్తిగతంగా కాకుండా జట్టుగా ఎక్కడ మెరుగుపడాలో ఆలోచించాలి" అని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్.. ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధంపై స్పందించాడు. "నా కెరీర్ మొత్తం కోహ్లీతో కలిసి ఆడుతున్నాను. అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. మేమిద్దరం ఎన్నో కీలక భాగస్వామ్యాలు నిర్మించాం. ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటాం. క్రీజులో ఉన్నప్పుడు ఎప్పుడూ చర్చించుకుంటూ ముందుకు సాగుతుంటాం" అని రోహిత్ వివ‌రించాడు.

Advertisement
Advertisement