BCCI | రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై వార్తలపై మౌనం వీడిన బీసీసీఐ.. అదే చివరి మ్యాచ్ కాదన్న సైకియా!
BCCI | టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్‌పై చర్చలకు బీసీసీఐ చెక్ పెట్టింది. ఇంగ్లండ్‌తో ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే రోహిత్‌కు చివరి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
BCCI | టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్‌పై చర్చలకు బీసీసీఐ చెక్ పెట్టింది. ఇంగ్లండ్‌తో ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే రోహిత్‌కు చివరి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ భవిష్యత్తుపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగోతందన్నారు. లార్డ్స్ వన్డే ఆయన చివరి మ్యాచ్ అవుతుందనే అంశంపై బీసీసీఐలో ఎలాంటి చర్చ జరగలేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం రోహిత్ భారత వన్డే జట్టులో కీలక సభ్యుడని, జట్టు ప్రణాళికల్లో ఉన్నంతకాలం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడని తెలిపారు.
అయితే, ఇటీవల 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని భారత సెలెక్షన్ కమిటీ భావిస్తున్నట్లు పలు నివేదికలు తెలిపాయి. దాంతో రోహిత్ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సమక్షంలో సెలెక్టర్లు రోహిత్‌తో భవిష్యత్తుపై చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, రోహిత్ ఇప్పటికే 2027 వన్డే ప్రపంచకప్ వరకు భారత జట్టుకు ఆడటమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. బీసీసీఐ కార్యదర్శి తాజా ప్రకటనతో హిట్‌మ్యాన్ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయ్యింది.
ఇదిలా ఉండగా.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమంగా ఉంది. తొలి వన్డేలో భారత్, రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచి సిరీస్‌ను సమం చేసింది. వారం జరుగనున్న మూడో వన్డేతో విజేత తేలనుంది. మరో వైపు ఇటీవల జరిగిన పలు మ్యాచుల్లో రోహిత్ సరిగా రాణించలేకపోయాడు. గత ఎనిమిది వన్డేల్లో 241 పరుగులు మాత్రమే చేసిన ఆయన సగటు 30.1గా ఉంది. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో 11, 26 పరుగులే చేశాడు. భారత్ క్రికెట్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ ఓపెనర్లలో ఒకడిగా నిలిచిన రోహిత్.. ఇప్పటి వరకు 286 వన్డేల్లో 11,731 పరుగులు చేశాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు నమోదు చేసిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను ఫైనల్‌కు, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ విజేతగా నిలబెట్టాడు. 2025 మేలో టెస్టు క్రికెట్‌కు ఆయన వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Trisha | తెలుగులో త్రిష క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - డేరింగ్ అండ్ డాషింగ్ రోల్లో చెన్నై క్వీన్
- ●TV Awards | ఇక బుల్లితెరకు అవార్డులు
- ●Mudumal Megalithic Menhirs | ముడుమాల్ నిలువురాళ్లకు మరింత గుర్తింపు తీసుకువస్తాం..
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్, నిఫ్టీలలో స్వల్ప నష్టాలు..
- ●Road Accident in USA | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
- ●CM Revanth Reddy | తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లు కేటాయించండి..

Trisha | తెలుగులో త్రిష క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - డేరింగ్ అండ్ డాషింగ్ రోల్లో చెన్నై క్వీన్

TV Awards | ఇక బుల్లితెరకు అవార్డులు

Mudumal Megalithic Menhirs | ముడుమాల్ నిలువురాళ్లకు మరింత గుర్తింపు తీసుకువస్తాం..

Stock Markets | స్టాక్ మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్, నిఫ్టీలలో స్వల్ప నష్టాలు..





