Rishabh Pant | టీమిండియాకు ఎదురుదెబ్బ.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు రిషభ్ పంత్ దూరం!
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు (Team India) భారీ ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తున్నది.
త్రినేత్ర.న్యూస్: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు (Team India) భారీ ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తున్నది. మొదటి వన్డే కోసం టీమ్ఇండియా వడోదరలోని బీసీఏ (BCA) గ్రౌండ్‌లో శనివారం ప్రాక్టీస్ సేషన్‌లో పాల్గొంది. ఈ క్రమంలో త్రోడౌన్ స్పెషలిస్టులను ఎదుర్కొంటున్న సమయంలో ఓ బంతి పంత్ నడుము పైభాగంలో తగలడంతో ఆయనకు బలమైన గాయమైంది. దీంతో ఆయన్ను సిరీస్ నుంచి తప్పించినట్లు సమాచారం.
`జట్టు వైద్యులు నిర్వహించిన స్కానింగ్‌లలో పంత్ కుడి వైపున పక్కటెముకకు దెబ్బ తగిలిందని, సైడ్ స్ట్రెయిన్ గుర్తించారు. దీంతో అతడిని న్యూజిలాండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్ నుంచి జట్టు యాజమాన్యం తొలగించింది` అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ లేదా ధ్రువ్ జురెల్‌లో ఎవరినో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. వీరిద్దరు ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన విషయం తెలిసిందే. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
అయితే బెంగళూరులోని బీసీసీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ (CoE) నివేదిక ఇచ్చిన తర్వాత పంత్‌కు కొన్నిరోజుల పాటు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. టీమ్ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం త్వరలో భారత పర్యటనకు న్యూజిలాండ్ రానుంది. జనవరి 11 నుంచి మూడు వన్డేల సిరీస్, 21 నుంచి టీ20 సిరీస్ మొదలుకానున్నాయి.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



