త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WPL 2026 | WPL విజేతగా ఆర్సీబీ.. జ‌ట్టుకు ఎంత ప్రైజ్ మ‌నీ ద‌క్కిందో తెలుసా..?

WPL 2026 | ఐపీఎల్ టైటిల్ ద‌క్కించుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) పురుషుల‌ జట్టుకు దాదాపు 18 ఏళ్లు ప‌టిన విష‌యం తెలిసిందే. అయితే, ఆర్సీబీ మ‌హిళా జ‌ట్టు మాత్రం 3 సంవత్సరాల్లో 2 సార్లు డబ్ల్యూపీఎల్ గెలుచుకుని స‌త్తా చాటింది.

D

Cricket | Published On Feb 6, 2026, 11.23 am IST

WPL 2026 | WPL విజేతగా ఆర్సీబీ.. జ‌ట్టుకు ఎంత ప్రైజ్ మ‌నీ ద‌క్కిందో తెలుసా..?
Advertisement

WPL 2026 | ఐపీఎల్ టైటిల్ ద‌క్కించుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) పురుషుల‌ జట్టుకు దాదాపు 18 ఏళ్లు ప‌టిన విష‌యం తెలిసిందే. అయితే, ఆర్సీబీ మ‌హిళా జ‌ట్టు మాత్రం 3 సంవత్సరాల్లో 2 సార్లు డబ్ల్యూపీఎల్ గెలుచుకుని స‌త్తా చాటింది. గురువారం వడోదర వేదికగా జరిగిన వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్ లీగ్‌ ఫైనల్​లో ఢిల్లీ క్యాపిటల్స్​పై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 204 పరుగులు రికార్డ్ ఛేదనతో ఆర్సీబీ సగర్వంగా టైటిల్​ను ముద్దాడింది. దీంతో జ‌ట్టుపై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌లువురు స్టార్ క్రికెట‌ర్లు సైతం ఆర్బీఐపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ విజ‌యంతో ఆర్బీబీకి భారీ ప్రైజ్ మ‌నీ ద‌క్కింది. ఇక మ్యాచ్‌లో ర‌న్న‌ర్‌గా నిలిచిన ఢిల్లీ జ‌ట్టుకు కూడా భారీగానే ప్రైజ్ మ‌నీ వ‌చ్చింది.

WPL 2026 ఎడిషన్​కుగానూ బీసీసీఐ భారీ ప్రైజ్​మనీ ప్రకటించింది. మొత్తం రూ.10 కోట్ల ప్రైజ్ మ‌నీని అందించింది. అందులో రూ.6 కోట్లు విన్న‌ర్‌గా నిలిచిన ఆర్బీబీ జ‌ట్టుకు ద‌క్క‌నుండ‌గా.. మ‌రో రూ.3కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ద‌క్క‌నుంది. మిగిలిన మ‌నీని అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లతోపాటూ అత్యుత్తమ ప్ర‌ద్శ‌న చేసిన ప్లేయర్లకు అందించ‌నున్నారు.

ఏ ప్లేయ‌ర్‌కి ఎంత ద‌క్కుతుందంటే..?

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ - సోఫీ డివైన్ (గుజరాత్)- రూ.5 లక్షలు
ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) - స్మృతి మంధాన (377 పరుగులు)- రూ.5 లక్షలు
పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు)- సోఫీ డివైన్ (17 వికెట్లు)- రూ. 5 లక్షలు
అత్యధిక సిక్స్​లు -హర్మన్​ప్రీత్​కౌర్, సోఫీ డివైన్ (13 సిక్స్​లు) - రూ. 5 లక్షలు
బెస్ట్ స్ట్రైక్ రేట్ - సోఫీ డివైన్ - రూ. 5 లక్షలు
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ - నందిని శర్మ (దిల్లీ క్యాపిటల్స్) - రూ. 5 లక్షలు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (ఫైనల్) - స్మృతి మంధాన - రూ. 2.5 లక్షలు

Advertisement

తాజావార్తలు

Advertisement