త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC Women’s T20 Rankings | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన షెఫాలీ వ‌ర్మ‌..!

P

Sports | Published On Apr 21, 2026, 7.23 pm IST

ICC Women’s T20 Rankings | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన షెఫాలీ వ‌ర్మ‌..!
Advertisement

ICC Women’s T20 Rankings | భారత మహిళల జట్టు యువ ఓపెనర్ షెఫాలీ వ‌ర్మ ఐసీసీ టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చింది. తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్‌లో ఆమె రెండు స్థానాలు మెరుగుప‌రుచుకొని ఆరో స్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రాణించ‌డంతో ర్యాంకు మెరుగైంది. భారత జట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సైతం మంచి ఫామ్‌ని కొన‌సాగించ‌డంతో ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి సంయుక్తంగా 11వ స్థానానికి చేరుకుంది. తొలి టీ20లో 47 పరుగులు చేసింది.

మరోవైపు ఓపెన‌ర్ స్మృతి మంధాన ఒక స్థానం దిగ‌జారి నాలుగోస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్ లారా వోల్వోర్డ్ ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది. అన్నెరి డ్రెక్‌సెన్ 18 స్థానాలు ఎగ‌బాకి 33వ స్థానానికి, సునే 35వ స్థానానికి చేరింది. బౌలింగ్ విభాగంలో పాకిస్తాన్‌కు చెందిన సాదియా ఇక్బాల్ అగ్ర‌స్థానంలో ఉంది. భార‌త స్పిన్న‌ర్ శ్రీ‌చ‌ర‌ణి నాలుగు స్థానాలు మెరుగుప‌రుచుకొని 23వ స్థానానికి చేరింది. ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.

ఆల్‌రౌండర్ల జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన అమెలియా కెర్ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతుండ‌గా.. దక్షిణాఫ్రికా ప్లేయ‌ర్ క్లో ట్రయాన్ నాలుగు స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరింది. బంగ్లాదేశ్-శ్రీలంక తొలి వన్డే తర్వాత విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్ సిమ్ర‌న్ అక్త‌ర్ 86 ప‌రుగులతో మెరువ‌డంతో ర్యాంకింగ్స్‌లో 22వ స్థానానికి చేరింది. బౌలింగ్ విభాగంలో న‌హిదా అక్త‌ర్ 13, రబేయా ఖాన్ 20, మారుఫ అక్త‌ర్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 43వ స్థానానికి చేరుకుంది.

Advertisement
Advertisement