Sunil Gavaskar | ఐపీఎల్ ఫైనల్‌లో ఆడేది ఈ రెండు జట్లే.. సునీల్ గవాస్కర్ జోస్యం
Sunil Gavaskar | ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం లీగ్ దశ తుది అంకానికి చేరింది. త్వరలోనే ప్లేఆఫ్ మ్యాచులు జరుగనుండగా.. బెర్తులపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే, ఈ సీజన్‌లో ఫైనలిస్టులపై దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ తన అంచనాలను వెల్లడించారు.
Sunil Gavaskar | ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం లీగ్ దశ తుది అంకానికి చేరింది. త్వరలోనే ప్లేఆఫ్ మ్యాచులు జరుగనుండగా.. బెర్తులపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే, ఈ సీజన్‌లో ఫైనలిస్టులపై దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ తన అంచనాలను వెల్లడించారు. టైటిల్ పోరులో మరోసారి పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్యే జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌ను అద్భుతంగా ఆరంభించిన పంజాబ్ కింగ్స్ తొలి ఏడు మ్యాచుల్లో విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా మూడు ఓటములు ఎదురైనా.. జట్టుపై తనకు నమ్మకం మాత్రం తగ్గలేదన్నారు.
ఆర్‌సీబీ ఫామ్‌లో ఉంది..
తాను ఇప్పటికీ పంజాబ్‌కే మద్దతు ఇస్తానని, వరుస పరాజయాలు కొన్ని సందర్భాల్లో జట్టును మళ్లీ సమీకరించుకునే అవకాశాన్ని ఇస్తాయన్నారు. ఈ దశలో ప్రతి మ్యాచ్‌కు ఎంత కీలకమో ఆ జట్టుకు తెలుసునని, మరో ఓటమి తమ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా జట్టు జాగ్రత్తపడుతుందన్నారు. ఇక ఆర్‌సీబీ సైతం అద్భుత ఫామ్‌లో ఉందని గవాస్కర్ చెప్పుకొచ్చారు. ముంబయిపై చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిలో పోరులో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న ఆర్‌సీబీ ఫైనల్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ సీజన్‌లో పంజాబ్, బెంగళూరు టైటిల్ రేసులో నిలుస్తాయని భావిస్తున్నానన్నారు. ప్లేఆఫ్ నుంచి తప్పుకున్న ముంబయి ఇండియన్స్.. ఇకపై యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచించారు.
యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని సూచన..
టీ20 క్రికెట్‌లో ఎత్తుపల్లాలు సహజమని, సీజన్ ముగిసిన తర్వాత లోపాలను విశ్లేషించుకోవచ్చన్నారు. సీనియర్ ఆటగాళ్లు తమ వంతు కృషి చేశారని, మిగిలిన మ్యాచ్‌ల్లో యువకులకు అవకాశం ఇస్తే ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారో జట్టు అంచనా వేయగలదన్నారు. ఇక పంజాబ్ కింగ్స్ తర్వాతి మ్యాచ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌తో ధర్మశాల వేదికగా ఆడుతుంది. ప్లేఆఫ్ రేసులో ఈ మ్యాచ్‌లో విజయం కీలకం. ఇప్పటికే ముంబయి, లక్నో టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మిగతా జట్లు టాప్-4 కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గవాస్కర్ అంచనా నిజమవుతుందా లేదా.. ఇతర జట్లు దూసుకెళ్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






