త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | చెన్నైతో నేడు రాజ‌స్థాన్ ఢీ..! మ‌రో రికార్డుకు చేరువైన ర‌వీంద్ర జ‌డేజా..!

IPL 2026 | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో మూడో మ్యాచ్ సోమ‌వారం గువాహ‌టిలోని బ‌ర‌స్ప‌రా క్రికెట్ స్టేడియంలో జ‌రుగ‌నుది. ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్-చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా మ‌రో రికార్డుకు చేరువ‌య్యాడు.

P

Sports | Published On Mar 30, 2026, 3.19 pm IST

IPL 2026 | చెన్నైతో నేడు రాజ‌స్థాన్ ఢీ..! మ‌రో రికార్డుకు చేరువైన ర‌వీంద్ర జ‌డేజా..!
Advertisement

IPL 2026 | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో మూడో మ్యాచ్ సోమ‌వారం గువాహ‌టిలోని బ‌ర‌స్ప‌రా క్రికెట్ స్టేడియంలో జ‌రుగ‌నుది. ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్-చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా మ‌రో రికార్డుకు చేరువ‌య్యాడు. చెన్నైపై 15 ప‌రుగులు సాధిస్తే టీ20ల్లో 4వేల ప‌రుగుల మార్క్‌ని చేరుకుంటాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 4వేల ప‌రుగులు చేసి, 200 వికెట్లు తీసిన భార‌త ఆట‌గాడిగా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో జ‌డేజా మ‌రో 15 ప‌రుగులు చేస్తే ఈ ఘ‌న‌త సాధించిన రెండో భార‌తీయ క్రికెట‌ర్‌గా నిలువ‌నున్నాడు. జడేజా ఇప్పటివరకు 346 టీ20 మ్యాచ్‌లలో 3,985 పరుగులు చేశాడు. అదే స‌మ‌యంలో 235 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్‌లో కూడా జడేజాకు మంచి రికార్డు ఉంది. 254 మ్యాచుల్లో 3,260 పరుగులు చేసి, ఐదు హాఫ్ సెంచ‌రీలు చేశాడు. బౌలింగ్‌లో 170 వికెట్లు తీసి అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో 10వ స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్‌ తీస్తే ల‌సిత్ మ‌లింగ్ (170 వికెట్లు)ను అధిగమించే అవకాశం ఉంది. గత సీజన్‌లో జడేజా ఆక‌ట్టుకున్నాడు. ఐపీఎల్‌ 2025 సీజ‌న్‌లో 14 మ్యాచుల్లో 301 పరుగులు చేసి, ప‌ది వికెట్లు ప‌డ‌గొట్టాడు. గ‌త సీజ‌న్ వ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టులో స‌భ్యుడిగా కొన‌సాగిన జ‌డేజా ఈ సారి మాత్రం రాజ‌స్థాన్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌నున్నాడు. సంజు శాంస‌న్ చెన్నైకి ఇచ్చి.. అత‌ని స్థానంలో జ‌డేజాను జ‌ట్టులోకి తీసుకుంది. చెన్నై, రాజస్థాన్ జట్ల మధ్య పోటీ ఎప్పుడూ హోరాహోరీగా సాగుతూ వ‌స్తోంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో 31 మ్యాడాయి. ఇందులో చెన్నై 16 విజయాలు సాధించగా, రాజస్థాన్ 15 మ్యాచ్‌ల్లో గెలిచింది. దీంతో ఈ మ్యాచ్‌పై కూడా ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement