RR Vs RR | మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్న రవీంద్ర జడేజా..!
RR Vs RR | చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత రాజస్థాన్ 12.1 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్‌లో ఆర్‌ఆర్ ఆటగాడు రవీంద్ర జడేజా, సంజు శాంసన్ భావోద్వేగానికి గురయ్యారు. ఓ సందర్భంలో జడేజా కన్నీళ్లు పెట్టుకున్నాడు. మొన్నటి సీజన్ వరకు సీఎస్‌కే తరఫున ఆడిన జడేజా ఈ సారి ఆర్‌ఆర్ తరఫున, శాంసన్ చెన్నై తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ సీజన్‌కు ముందు ట్రేడ్ డీల్‌లో భాగంగా శాంసన్ చెన్నైకి, జడేజా ఆర్‌ఆర్‌కి వెళ్లాల్సి వచ్చింది.
Ravindra Jadeja got emotional while playing against his former team, CSK. 💔#RavindraJadeja #Jadeja #CSK #IPL #IPL2026 #Cricket #CricketFans #IndianCricket #IPLUpdates #CricketReels #CricketLovers #Dhoni #CSKFans pic.twitter.com/mCAClf3dof
— Team India 2.0 (@teamindia_2_0) March 30, 2026
గువాహటి వేదిక జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై ఆర్‌ఆర్ ఆధిపత్యం ప్రదర్శించింది. రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తేమ ఉన్న పిచ్‌ను ఉపయోగించుకొని ఫాస్ట్ 38 పరుగులకే నాలుగు కీలక వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత జడేజా సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే వికెట్లను పడగొట్టి సీఎస్‌కేను మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఈ సమయంలో శివం దూబేకు జడేజా గన్ తరహాలో చూపిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సమయంలో అభిమానులు సీఎస్‌కే సీఎస్‌కే అని హోరెత్తించగా జడేజా భావోద్వేగాలను ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. 13 సంవత్సరాలు సీఎస్‌కేతో అనుబంధం ఉన్న జడేజా.. తొలిసారిగా ఆ జట్టుపైనే ఆడడం గమనార్హం. ఇక సోషల్ మీడియా వేదికగా అభిమానులు జడేజాకు మద్దతు తెలిపారు. పలువురు యూజర్లు స్పందిస్తూ.. ‘రాజస్థాన్ టీమ్‌కి వెళ్లినా అభిమానుల మనసులో మీకు స్థానం ఉంటుందని తెలిపారు.
Ravindra Jadeja is looking so angry at CSK. Man, just look at Jadeja's gun celebration towards Shivam Dube when he got his wicket!
It couldn't be a better revenge than this, a team thrown you out & now you have literally embarrassed them in very 1st game! pic.twitter.com/qIQqJBc3cA
— Rajiv (@Rajiv1841) March 30, 2026
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. జేమీ ఓవర్టన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సంజు శాంసన్ ఆరు పరుగులు మాత్రమే చేశాడు. రాజస్థాన్ తరఫున వైభవ్ సూర్యవంశీ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ రియాన్ పారాగ్ 14, యశస్వీ 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక సీఎస్‌కే ఏప్రిల్ 3న చెపాక్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఆడనుండగా.. స్థాన్ ఏప్రిల్ 4న అహ్మదాబాద్‌లో గుజరాత్‌తో ఆడనుంది.
Jadeja was seen emotional when crowd starts to chant CSK...CSK pic.twitter.com/oPRvmU2wAm
— rocket.jadeja (@sherjedeja) March 30, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






