Rajasthan Royals | కల్ సొమాని చేతుల్లోకి రాజస్థాన్ రాయల్స్.. డీల్ విలువ రూ.15వేలకోట్లు..!
Rajasthan Royals | ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు సంచలన ఒప్పందం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ చేతులు మారింది. ఆర్ఆర్ జట్టు అమెరికన్ వ్యాపారవేత్త కల్ సొమానీ నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసింది.
Rajasthan Royals | ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు సంచలన ఒప్పందం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ చేతులు మారింది. ఆర్ఆర్ జట్టు అమెరికన్ వ్యాపారవేత్త కల్ సొమానీ నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 1.60 బిలియన్లు. భారతీయ కరెన్సీలో రూ.15,290 కోట్లు. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ ఒప్పందంగా పేర్కొంటున్నారు. ఐపీఎల్ 2027 సీజన్ నుంచి మాత్రమే డీల్ అమలులోకి వస్తుంది. ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో పాత యాజమాన్యంలోనే ఉంటుంది.
గత ఏడాదిలో టోరెంటో గ్రూప్ సీవీసీ క్యాపిటల్ నుంచి గుజరాత్ టైటాన్స్‌లో 67శాతం వాటా కొనుగోలు చేసింది. ఆ డీల్ విలువ రూ.5,025 కోట్లు కాగా.. ఫ్రాంచైజీ విలువను రూ.7500 కోట్లకు పెంచింది. సీవీసీ క్యాపిటల్స్ 33 శాతం వాటాను అంటిపెట్టుకుంది. 2021లో సీవీసీ క్యాపిటల్ గుజరాత్ టైటాన్స్‌ను రూ.5,625 కోట్లు కొనుగోలు చేసింది. ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ డీల్ గురించి ప్రకటన చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 1.63 బిలియన్లకు అమ్ముడుపోయిందని పేర్కొన్నారు. అయితే, ఈ డీల్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఒప్పందం సంతకాలు జరిగాయని తెలుస్తోంది. ఈ సీజన్ ముగిసిన తర్వాత ఫ్రాంచైజీ అప్పగింత జరుగుతుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. సొమాని ఇంట్రాఎడ్జ్, ట్రుయో, ట్రుయో.ఏఐ, అకాడెమియన్, స్పోర్ట్స్ టెక్ సంస్థలను స్థాపించారు. ఇక కన్సార్టియంలో అమెరికా వ్యాపారవేత్త రాబ్ వాల్టన్ సైతం ఉన్నారు. ఆయన ప్రముఖ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. అలాగే, హాంఫ్ ఫ్యామిలీ సైతం ఈ గ్రూప్ భాగం కానుంది. సొమాని గతంలో మోటర్ సిటీ గోల్ఫ్ క్లబ్ కో ఓనర్‌గా వ్యవహరించారు. టీఎంఆర్‌డబ్ల్యూ స్పోర్ట్స్, టీజీఎల్ గోల్ఫ్ లీగ్‌లో పెట్టుబడులు పెట్టారు. ఇదిలా ఉండగా.. ఈ ఒప్పందానికి బీసీసీఐ ఆమోదం తెలుపాల్సి ఉంది. ఐపీఎల్‌లో మరో జట్టు సైతం అమ్మకానికి ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరును సైతం విక్రయించనున్నారు. ఈ డీల్ విలువ 2 బిలియన్లకుపైగా ఉండనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






