PSL 2026 | భద్రతా నిబంధనలు ఉల్లంఘించాడని ఆరోపణలు.. షాహీన్ ఆఫ్రిదికి రూ.10లక్షల జరిమానా..
PSL 2026 | పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా లాహోర్ ఖలందర్స్ జట్టు కెప్టెన్ షాహీన్ షా ఆఫ్రిదిపై సొంత టీమ్ రూ.10 లక్షలు (పాక్ కరెన్సీ) జరిమానా విధించింది. దాంతో కొత్త వివాదానికి తెరలేపినట్లయ్యింది.
PSL 2026 | పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా లాహోర్ ఖలందర్స్ జట్టు కెప్టెన్ షాహీన్ షా ఆఫ్రిదిపై సొంత టీమ్ రూ.10 లక్షలు (పాక్ కరెన్సీ) జరిమానా విధించింది. దాంతో కొత్త వివాదానికి తెరలేపినట్లయ్యింది. భద్రతా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టు బస చేసిన హోటల్‌లో అనుమతి లేని వ్యక్తులు ప్రవేశించడంపై భద్రతా సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. సమాచారం ప్రకారం.. సికందర్ రాజాకు పరిచయం ఉన్న నలుగురు వ్యక్తులను ఆటగాళ్ల గదులకు అనుమతించలేదు. పీసీబీ భద్రతా సిబ్బంది, పీఎస్ఎల్ సీఈఓ సల్మాన్ నజీర్ స్పష్టంగా అనుమతి నిరాకరించారు. అయినా షాహీన్ ఆఫ్రిదీ, సికందర్ రాజా ఆ వ్యక్తులను గదిలోకి అనుమతించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
పంజాబ్ పోలీసుల వివరాల ప్రకారం.. ఆ నలుగరు వ్యక్తులు ఆటగాళ్ల గదిలో దాదాపు మూడు గంటల పాటు గడిపారు. నిబంధనల ప్రకారం ఎవరైనా బయటి వ్యక్తులు ఇలా గదుల్లో ఉండటానికి అనుమతి లేదు. సికందర్ రాజా మాత్రం వారు కేవలం 40 నిమిషాల పాటు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది సూచనలను పట్టించుకోకుండా ఇద్దరు ఆటగాళ్లు వ్యవహరించినట్లు పోలీసుల లేఖలో స్పష్టం చేశారు. ఈ ఘటనపై లాహోర్ ఖలందర్స్ ప్రకటన విడుదల చేసింది. “ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదు. అపార్థం వల్లే ఈ ఘటన జరిగింది. భద్రతా నిబంధనలను తాము పూర్తిగా గౌరవిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మెరుగైన కమ్యూనికేషన్ అవసరం” అని జట్టు పేర్కొంది.
జట్టు క్రమశిక్షణ పాటించేందుకు షాహీన్ ఆఫ్రిదికి రూ.10 లక్షల జరిమానా విధించారు. సికందర్ రాజాపై ఎలాంటి అధికారిక చర్యలు తీసుకోలేదు. ప్రెస్ మీట్‌లో సికందర్ రాజా పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తనదే బాధ్యతని, షాహీన్ ఆఫ్రిదిని తప్పుపట్టొద్దంటూ కోరారు. వాస్తవానికి నలుగురి హోటల్‌లోకి వచ్చేందుకు జట్టు లియాజన్ అధికారి ప్రయత్నించగా.. భద్రతా కారణాలతో నిరాకరించారు. జట్టు యజమాని సమీన్ రానా కూడా పీఎస్ఎల్ నిర్వాహకులను సంప్రదించినా అనుమతి దక్కలేదు. అయినా వారిని గదుల్లోకి తీసుకురావడం వివాదానికి దారి తీసింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






