NZ Vs WIN | వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ ఘన విజయం.. 2-0తో సిరీస్ కైవసం..
NZ Vs WIN | మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 323 పరుగుల భారీ తేడాలో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చేతులెత్తేసింది.
NZ Vs WIN | మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 323 పరుగుల భారీ తేడాలో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చేతులెత్తేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలబడలేకపోయారు. మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకు కూడా యత్నించలేదు. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం ఒక్క ప్లేయర్ మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. దీంతో న్యూజిలాండ్ అలవోకగా విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ జట్టు ప్లేయర్లలో డివాన్ కాన్‌వే డబుల్ సెంచరీతో రాణించాడు. మరో బ్యాట్స్‌మన్, కెప్టెన్ టామ్ లాథమ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 367 బంతుల్లో 31 ఫోర్లతో కాన్‌వే 227 పరుగులు చేయగా, లాథమ్ 246 బంతులు ఆడి 15 ఫోర్లు, 1 సిక్సర్‌తో 137 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్, ఆండర్సన్ ఫిలిప్, జస్టిన్ గ్రీవ్స్ తలా 2 వికెట్లు తీయగా, కీమర్ రోచ్, రోస్టన్ చేజ్‌లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండీస్ 420 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు ప్లేయర్లలో కావెమ్ హాడ్జ్ 275 బంతుల్లో 15 ఫోర్లతో 123 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మరో ప్లేయర్ బ్రాండన్ కింగ్ (63) ఫర్వాలేదనిపించగా, జాన్ కాంప్‌బెల్ (45), అలిక్ అథనాజె (45), జస్టిన్ గ్రీవ్స్ (43) కాసేపు క్రీజులో నిలబడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో జేకబ్ డఫ్ఫీ 4 వికెట్లు పడగొట్టగా, అజాజ్ పటేల్ 3 వికెట్లు తీశాడు. మైకేల్ రే 2 వికెట్లు తీయగా, డారిల్ మిచెల్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన కివీస్ 2 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. ఆ జట్టు ప్లేయర్లలో కెప్టెన్ టామ్ లాథమ్ మళ్లీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 130 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్లతో లాథమ్ 101 పరుగులు చేయగా, డివాన్ కాన్‌వే 139 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. మరో ఇద్దరు ప్లేయర్లు కేన్ విలియమ్సన్ (40), రచిన్ రవీంద్ర (46) దూకుడుగా ఆడి ఇన్నింగ్స్ త్వరగా డిక్లేర్ చేసేందుకు సహాయపడ్డారు. ఈ ఇన్నింగ్స్‌లో విండీస్ బౌలర్లలో కేవలం కావెం హాడ్జ్‌కు మాత్రమే 2 వికెట్లు దక్కాయి.
ఇక 462 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయే వరకు నిలకడగా ఆడింది. కానీ ఆ తరువాత వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో వెస్టిండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 138 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. బ్రాండన్ కింగ్ (67 పరుగులు, 13 ఫోర్లు) మాత్రమే కాసేపు క్రీజులో ఉన్నాడు. మిగిలిన ఎవరూ రాణించలేదు. దీంతో న్యూజిలాండ్ సునాయాసంగా విజయం సాధించింది. ఇక కివీస్ బౌలర్లలో ఈసారి జేకబ్ డఫ్పీ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించగా, మరో బౌలర్ అజాజ్ పటేల్ మళ్లీ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక పార్ట్ టైమ్ బౌలర్లు గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్రలు సైతం చెరొక వికెట్ తీయడం విశేషం. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో గెలుపుతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో కివీస్ ప్రస్తుతం 77.78 శాతం విజయాల రేటుతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 100 శాతం విజయాల రేటుతో ఆసీస్ మొదటి స్థానంలో ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






