త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gautam Gambhir | టీమిండియాలో ప్ర‌తి ప్లేయ‌ర్ ఒక చాంపియ‌న్: గౌత‌మ్ గంభీర్

Gautam Gambhir | టీ20 ప్రపంచ‌క‌ప్ 2026 ట్రోఫీని సాధించ‌డంపై హెడ్ కోచ్ గౌతం గంభీర్ స్పందిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇది కేవ‌లం దేవుడి ప్లాన్ మాత్ర‌మే కాద‌ని, 140 కోట్ల మంది భార‌తీయుల ప్లాన్ కూడా అని, జ‌ట్టులోని ప్ర‌తి ప్లేయ‌ర్ ఒక చాంపియ‌న్ అని గంభీర్ పేర్కొన్నారు.

S

Sports | Published On Mar 9, 2026, 12.27 pm IST

Gautam Gambhir | టీమిండియాలో ప్ర‌తి ప్లేయ‌ర్ ఒక చాంపియ‌న్: గౌత‌మ్ గంభీర్
Advertisement

Gautam Gambhir | టీ20 ప్రపంచ‌క‌ప్ 2026 ట్రోఫీని సాధించ‌డంపై హెడ్ కోచ్ గౌతం గంభీర్ స్పందిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇది కేవ‌లం దేవుడి ప్లాన్ మాత్ర‌మే కాద‌ని, 140 కోట్ల మంది భార‌తీయుల ప్లాన్ కూడా అని, జ‌ట్టులోని ప్ర‌తి ప్లేయ‌ర్ ఒక చాంపియ‌న్ అని గంభీర్ పేర్కొన్నారు. ఈ మేర‌కు గంభీర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో భార‌త్ ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీని నెగ్గ‌డ‌మే కాకుండా ఆసియా క‌ప్ ట్రోఫీని కైవ‌సం చేసుకుంది. ఇక ఇప్పుడు టీ20 ప్రపంచ క‌ప్ ను సొంత‌గ‌డ్డ‌పై సాధించింది. ఈ క్ర‌మంలోనే గ‌తంలో గంభీర్‌ను విమ‌ర్శించిన వారే ఆయ‌న కోచింగ్‌ను ఇప్పుడు ప్ర‌శంసిస్తున్నారు.

విమ‌ర్శించిన నోళ్ల నుంచే పొగ‌డ్త‌లు..

జ‌ట్టులో అన‌వ‌స‌ర ప్ర‌యోగాలు చేస్తున్నార‌ని, ప్లేయ‌ర్ల‌ను ఒక స్థిర‌మైన పొజిష‌న్‌లో ఆడ‌నివ్వ‌డం లేద‌ని గంభీర్‌ను విమ‌ర్శించారు. కానీ ఆయ‌న అలా చేయ‌డం వ‌ల్లే ప్లేయ‌ర్లు ఇప్పుడు ఏ పొజిష‌న్‌లో అయినా ఆడే సామ‌ర్థ్యాన్ని సాధించార‌ని విమ‌ర్శ‌కులు సైతం మెచ్చుకుంటున్నారు. కాగా రాహుల్ ద్రావిడ్ ప్ర‌ధాన కోచ్‌గా త‌ప్పుకున్న అనంత‌రం గంభీర్ కోచింగ్ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌గా టీమిండియా సొంత గ‌డ్డ‌పై టెస్టుల్లో మాత్రం ఘోర ప‌రాజ‌యం పాలైంది. ప‌లు వ‌న్డే సిరీస్‌ల‌ను కూడా కోల్పోయింది. అయిన‌ప్ప‌టికీ ఆయన కోచింగ్‌లో ఐసీసీ ఈవెంట్ల‌లో మాత్రం మెరుగైన ప్ర‌ద‌ర్శ‌నే చేస్తోంది. అయితే ప్ర‌పంచ క‌ప్ త‌రువాత గంభీర్ ను కోచ్‌గా త‌ప్పిస్తార‌ని టోర్నీకి ముందు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఈ రిజ‌ల్ట్‌తో ఇక ఆయ‌న స్థానం ప‌దిల‌మే అని భావిస్తున్నారు. కానీ టెస్టుల్లో మాత్రం టీమిండియా ప్ర‌ద‌ర్శ‌న ఆశాజ‌న‌కంగా లేదు. ఇక గంభీర్ ఆ విష‌యంపై దృష్టి పెడ‌తారేమో చూడాలి.

https://twitter.com/GautamGambhir/status/2030861235873546471

రికార్డులే రికార్డులు..

కాగా ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు మిచెల్ శాంట్నర్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టును చిత్తుగా ఓడించి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకుంది. దీంతో టీమిండియా అనేక రికార్డుల‌ను సైతం న‌మోదు చేసింది. వ‌రుస‌గా రెండోసారి ట్రోఫీని కైవ‌సం చేసుకున్న జ‌ట్టుగా నిల‌వ‌డంతోపాటు మూడు సార్లు ట్రోఫీని గెలిచిన తొలి జ‌ట్టుగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే స్వ‌దేశంలో టీ20 ప్ర‌పంచ క‌ప్ ట్రోఫీ గెలిచిన ఏకైక జ‌ట్టుగా కూడా భార‌త్ చ‌రిత్ర సృష్టించింది.

Advertisement
Advertisement