త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KKR Vs MI | కేకేఆర్‌పై ఆరు వికెట్ల తేడాతో ముంబయి గెలుపు..! రాణించిన రోహిత్‌, రికెల్టన్‌..!

KKR Vs MI | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై ముంబయి ఇండియన్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్‌ నిర్దేశించిన పరుగుల 221 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబయికి ఓపెనర్లు శుభారంభం అందించారు.

P

Sports | Published On Mar 29, 2026, 11.22 pm IST

KKR Vs MI | కేకేఆర్‌పై ఆరు వికెట్ల తేడాతో ముంబయి గెలుపు..! రాణించిన రోహిత్‌, రికెల్టన్‌..!
Advertisement

KKR Vs MI | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై ముంబయి ఇండియన్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్‌ నిర్దేశించిన పరుగుల 221 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబయికి ఓపెనర్లు శుభారంభం అందించారు. రోహిత్‌ శర్మ, ర్యాన్‌ రికెల్టన్‌ జోడీ బ్యాట్‌తో పరుగుల వరద పారించింది. తొలి వికెట్‌కు ఇద్దరు 71 బంతుల్లో 148 పరుగులు జోడించారు. రోహిత్‌ శర్మ, రికెల్టన్‌ సిక్సర్ల మోత మోగించారు. స్టేడియం నలువైపులా బౌండరీలు బాదారు. రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ కెరీర్‌లో 49వ హాఫ్‌ సెంచరీ చేశాడు. రోహిత్‌ 23 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేయడం విశేషం. మాజీ కెప్టెన్‌ కేవలం 38 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్ల సహాయంతో 75 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. సైతం మరో వైపు రికెల్టన్‌ సైతం 24 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. రోహిత్‌ అవుట్‌ అయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (16) వేగంగా పరుగులు చేసే క్రమంలో భారీ షాట్‌కు యత్నించి అవుట్‌ అయ్యాడు. అనంతరం రికెల్టర్‌ 43 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, నాలుగు ఫోర్ల సహాయంతో 81 పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. చివరలో తిలక్‌ వర్మ (20)తో పాటు హార్దిక్‌ పాండ్యా (18*), నమన్‌ ధీర్‌ (5*) జట్టును విజయ తీరాలకు చేర్చారు. అయితే, కోల్‌కతా బౌలర్లలో ఎవరూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. సునీల్‌ నరైన్‌, కార్తీక్‌ త్యాగికి చెరో వికెట్‌ దక్కింది.

రాణించిన కోల్‌కతా బ్యాటర్లు..

అంతకు ముందు టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్‌కు వచ్చిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానె 40 బంతుల్లో 67 పరుగులు చేయగా, యువ ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీ 28 బంతుల్లో 51 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ప్రారంభంలో రహానే, ఫిన్‌ అలెన్‌ జోడీ కాస్త నెమ్మదిగా ప్రారంభించినా.. ఆ తర్వాత స్పీడ్‌ పెంచింది. హార్దిక్ పాండ్యా వేసిన నాలుగో ఓవర్లో భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. దాంతో స్కోర్‌ బోర్డు పరుగులెత్తింది. గజన్‌ఫర్ బౌలింగ్‌లోనూ అలెన్ బౌండరీలు, సిక్సర్ల మోత మోగించాడు. ఈ జోడీని శార్దూల్‌ ఠాకూర్‌ విడగొట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరాన్ గ్రీన్‌ను సైతం పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత హాఫ్‌ సెంచరీ చేసిన శార్దూల్‌ సైతం అవుట్‌ అయ్యాడు. తక్కువ సమయంలోనే మూడు వికెట్లు పడడంతో కేకేఆర్‌ కాస్త ఒత్తిడిలోకి వెళ్లింది. రఘువంశీ, రింకూ సింగ్‌ జోడీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. ముఖ్యంగా రఘువంశీ వేగంగా పరుగులు రాబట్టాడు. 29 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఆరు ఫోర్ల సహాయంతో 51 పరుగులు చేశాడు. రింకు సింగ్‌ చివరి వరకు క్రీజులో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ముంబయి బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌కు మూడు వికెట్ల దక్కగా, హర్దిక్‌ పాండ్యాకు ఒక వికెట్‌ దక్కింది. మిగతా బౌలర్లు ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

వాంఖడేలో రికార్డులు..

వాంఖడే వేదికగా పలు రికార్డులు నమోదయ్యాయి. ఎంఐ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కేకేఆర్‌పై అరుదైన రికార్డును నమోదు చేశాడు. అలాగే, కేకేఆర్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ సైతం స్పెషల్‌ క్లబ్‌లో చేరాడు. కేకేఆర్‌పై అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో మ్యాచ్‌కు ముందు రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ, ఈ మ్యాచ్‌లో అవసరమైన 11 పరుగులు పూర్తి చేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ అధిగమించి.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. వార్నర్ 28 ఇన్నింగ్స్‌లలో 1093 పరుగులు చేయగా.. రోహిత్‌ 1,161 పరుగులు చేసి వార్నర్‌ను అధిగమించాడు. సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ అతనికి ఐపీఎల్‌లో 190వ మ్యాచ్‌ ఆడాడు. లీగ్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ (189 మ్యాచ్‌లు) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో ఏబీ డివిల్లియర్స్, డేవిడ్ వార్నర్ తలో 184 మ్యాచ్‌లతో తదుపరి స్థానాల్లో ఉండగా, డ్వేన్ బ్రావో (161 మ్యాచులు) ఆ తర్వాత స్థానంలో ఉన్నాడు.

13 సంవత్సరాల తర్వాత తొలి మ్యాచ్‌లో విజయం..

గత 13వ సంవత్సరాలుగా ఐపీఎల్‌లో ప్రారంభ మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయిన ఆ జట్టు ఎట్టకేలకు తొలిసారిగా గెలుపొందింది. ముంబ‌యి చివ‌రిసారిగా 2012లోనే తొలి మ్యాచ్‌ను గెలిచింది. ఆ తర్వాత ఎన్నడూ ఐపీఎల్‌ ముంబయి తాను ఆడిన తొలి మ్యాచ్‌లో గెలువలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఆ బలహీనత నుంచి బయటపడింది. రోహిత్‌ శర్మ, ర్యాన్‌ రికెల్టన్‌ జోడీ అద్భుతంగా ఆడడంతో ఆ జట్టుకు ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే విజయం దక్కింది. అదే సమయంలో కేకేఆర్‌పై ముంబయి ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. ఇప్పటి వరకు వాంఖడేలో కేకేఆర్‌తో ముంబయి 13 మ్యాచులు ఆడింది. ఇందులో ముంబయి 11 మ్యాచుల్లో గెలువగా కేకేఆర్‌ కేవలం రెండు మ్యాచుల్లోనే గెలిచింది.

Advertisement

తాజావార్తలు

Advertisement