MS Dhoni | రోహిత్, కోహ్లీ ఇంకా క్రికెట్ ఆడాలి.. మాజీ కెప్టెన్ ధోని అడ్వైజ్..!
MS Dhoni | మరో మూడురోజుల్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్నది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా మరోసారి టైటిల్‌ను నిలబెట్టుకోవాల్సి చూస్తోంది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో, విరాట్ సారథ్యంలో భారత్ రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈ సారి జరిగే పొట్టి కప్‌లో ఇద్దరు స్టార్స్ ఆడడం లేదు.
MS Dhoni | మరో మూడురోజుల్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్నది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా మరోసారి టైటిల్‌ను నిలబెట్టుకోవాల్సి చూస్తోంది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో, విరాట్ సారథ్యంలో భారత్ రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈ సారి జరిగే పొట్టి కప్‌లో ఇద్దరు స్టార్స్ ఆడడం లేదు. ఇద్దరు టీ20లు, టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇద్దరు ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. అయితే, ఇద్దరి భవిష్యత్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇద్దరూ ఆటను కొనసాగించాలని ఆకాంక్షించాడు. ఆటను కొనసాగించలా? వద్దా? అని ఎవరూ వారికి చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. జతిన్ సప్రూకు మాజీ కెప్టెన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.
వయసు ప్రమాణం కాదు..
ఈ సందర్భంగా తన అభిప్రాయాలను వెల్లడించాడు. 2027 వన్డే ప్రపంచకప్ నాటికి రోహిత్ వయసు 38, విరాట్ వయసు 37 ఏళ్లు వస్తాయి. ఇద్దరు ఆడే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ధోనీ తనదైన స్టయిల్‌లో స్పందించాడు. మొదట క్షమించండి! ప్రశ్న ఏంటీ? అంటూ చమత్కరించాడు. ఆ తర్వాత సీరియస్‌గా ఎందుకు ఆడకూడదు? అంటూ ప్రశ్నించాడు. 'నాకు వయసు అనేది ప్రమాణం కాదు. ప్రదర్శన, ఫిట్‌నెస్ ముఖ్యం. ఎవరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని నేను నమ్ముతున్నాను. కానీ, అందరినీ సమానంగా చూస్తారనేది స్పష్టంగా ఉండాలి. నేను జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సమయంలో నా వయసు 24 ఏళ్లు. అప్పుడు నాకు ఎవరూ ఏమీ చెప్పలేదు. పది, ఇరవై ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాను. ఎవరో వచ్చి వయసు గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు' అని ధోని వ్యాఖ్యానించాడు.
ఎందుకు ఆడకూడదు..?
ప్రస్తుతం ధోనీ వయసు 44 సంవత్సరాలు కాగా.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. జట్టులో అనుభవం కీలకమని, అది రోహిత్ అయినా, విరాట్ అయినా.. రాబోయే ఐదేళ్లలో వెలుగులోకి వచ్చే ఇతర ఆటగాళ్లయినా.. వారంతా తర్వాత వచ్చే ప్రపంచకప్ ఆడగలరా? లేదా ? అని నిర్ణయించడం తమ పని కాదని.. వారు బాగా ఆడితే, దేశం కోసం రాణించాలనే కోరిక ఉంటే ఎందుకు ఆడకూడదు? అని ధోని ప్రశ్నించాడు. అలా అయితే, అనుభవం ఉన్న ఆటగాళ్లను పొందలేరని.. అతను సచిన్ లాంటి వాడయితే తప్పా అని పేర్కొన్నాడు. ఆ వయస్సులో అనుభవం అనేది 16, 17 ఏళ్ల వయస్సులో ఆడడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే వస్తుందని తెలిపాడు. ఒక ఆటగాడు తన కెరీర్‌లో చాలాకాలం ఒత్తిడిని తట్టుకుంటే తప్ప.. అనుభవం ఉన్న ఆటగాడిగా పరిగణించలేమని తేల్చి చెప్పాడు.
అది అనుభం కాదు..
మీరు 20-25 మ్యాచుల ఆడితేనే ఆడితే.. అది అనుభవం కాదని.. ఎందుకంటే ఆటగాళ్లకు ఒత్తిడిలో ఆడటం ముఖ్యమన్నారు. ఆ అనుభవాన్ని పొందడానికి నేను 80-85 మ్యాచులు ఆడాల్సి ఉంటుందని తెలిపాడు. ఆపై నా మనస్సును ఎలా నియంత్రించుకోవాలో.. నా భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో.. ఒత్తిడిలో ఎలా బాగా రాణించాలో నేర్చుకోవాలని పేర్కొన్నాడు. అనుభవజ్ఞులైన, యువ ఆటగాళ్ల సరైన కలయిక చాలా కీలకమని తాను భావిస్తానని తెలిపాడు. రోహిత్, కోహ్లీ భవిష్యత్‌పై ఎలాంటి స్పష్టమైన వ్యాఖ్యలు చేయకపోయినా ఫిట్‌గా ఉండి.. బాగా ఆడగల ఏ ప్లేయర్‌కైనా తన స్థానాన్ని నిలబెట్టుకునే హక్కు ఉండాలని ధోని వాదించాడు. అందరినీ సమానంగా చూడడం ముఖ్యమని, బాగా రాణిస్తున్న వారు జట్టులో ఉంటారని.. రాణించని వారు ఉండరని.. ఫిట్‌గా లేకపోతే, అతన్ని ఎప్పుడైనా తప్పించవచ్చని తెలిపాడు.
కామెంటేటర్‌గా పనికి రాను..
తాను కామెంటేటర్‌గా పని చేసే అవకాశాన్ని ధోనీ తోసిపుచ్చాడు. తనకు గణాంకాలపై అవగాహన ఎక్కువగా లేదని.. అందుకే రిటైర్మెంట్ తర్వాత ప్లేయర్స్‌కు ఇష్టమైన పాత్రను తాను చేపట్టబోనని ధోనీ స్పష్టం చేశాడు. కామెంటేరి ఓ ఓ కళ అని.. ఎవరూ నొచ్చుకోకుండా అభిప్రాయాన్ని మర్యాదగా చెప్పాలని.. జట్టు ఓడిపోతుంటే దాని కొన్ని కారణాలుంటాయని.. ఎవరూ నొచ్చుకోని విధంగా వివరించే నైపుణ్యం మీకు ఉండాలని తెలిపాడు. తాను ఈ రోల్‌కి సరిపోనని భావిస్తున్నానని, తనకు తన గణాంకాలు గుర్తుండవని చెప్పాడు. తాను కేవలం మంచి శ్రోతను మాత్రమేనని.. తనకు సౌకర్యంగా అనిపించే వారితోనే మాట్లాడతానని.. అంతకంటే ఎక్కువగా వింటానని చెప్పాడు. ఏదైనా విషయంపై అవగాహన లేకపోతే మాట్లాడనని.. విని నేర్చుకుంటానని చెప్పాడు. తనకు నేరుగా మాట్లాడడమే ఇష్టమని.. ఫోన్‌లో మాట్లాడడం కూడా సౌకర్యంగా ఉండదని తెలిపాడు. ఈ విషయంలో మెరుగుపరుచుకోవాలనుకున్నా.. అలా చేయనందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.
Read Also :
Pakistan Media | జైషా, బీసీసీఐపై పాక్ మీడియా అబద్ధాలు.. గోబెల్స్‌ను మించి దుష్ప్రచారం..
T20 World Cup 2026 WarmUps | ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా వార్మప్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్.. ఎప్పుడు? ఎందులో చూడాలి?
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






